Thanneeru Sasi

Drama Inspirational Others

4  

Thanneeru Sasi

Drama Inspirational Others

టు ప్రొసీడ్ ఆర్ నాట్ టు (పార్ట్2)

టు ప్రొసీడ్ ఆర్ నాట్ టు (పార్ట్2)

3 mins
333


    టు ప్రొసీడ్ ఆర్ నాట్ టు (పార్ట్ 2)          ...….వాయుగుండ్ల శశికళ.


ఎక్కడో తెలంగాణ లో దూరంగా నాకు వచ్చిన గురుకుల పాఠశాల ఉపాధ్యాయిని ఉద్యోగం లో వెళ్లి చేరాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాము.ఏదైనా ఆలోచన ఇమ్మని దేవుడిని కోరుకుంటూ ఉన్నాను.

పక్కన ఎనిమిది నెలల హేమ తో మాట్లాడుతూ ఉన్నాను.ఇంతలో నాన్న దగ్గర నుండి కబురు"ఎవరో సార్ నీకోసం వచ్చారు"అని! ఎవరో ఏమిటో చూసి వస్తాను,అని చెప్పాను పాపకి.నవ్వింది.

ముందు షాప్ లోకి వెళ్లి చూసాను.


ఎవరో సార్.ఎప్పుడూ చూడలేదు.

"నమస్తే సార్"అన్నాను.

"నమస్తే అమ్మ.మీకు గురుకుల పాఠశాల లో జాబ్ వచ్చింది కదా,వెళ్లి చేరండి"అన్నారు.


"సార్ మీరు ఎవరు?"అడిగారు నాన్న.

"నా పేరు వనపాల్ రెడ్డి.నేను ఇప్పుడు మీ అమ్మాయికి ఉద్యోగం వచ్చిన సంస్థ లో ఇక్కడ కోట పాఠశాలలో మాథ్స్ టీచర్ గా పనిచేస్తున్నాను.మాకు వచ్చిన లిస్ట్ లో మీ అమ్మాయి పేరు చూసి వచ్చాను"చెప్పారు.


వింటూ ఉన్నాను శ్రద్ధగా.

"ఇక్కడైతే బాగుండేది సార్.ఎక్కడో పల్లెటూరు.నక్స్ లైట్ ఏరియా.ఎలా వెళుతుంది?"చెప్పారు నాన్న కొంచెం ఆలోచనగా.


"లేదు లేదు.అదేమీ పల్లెటూరు కాదు.వరంగల్ జిల్లా కేంద్రం.వరంగల్,హనుమ కొండ రెండూ కలిసే ఉంటాయి.జిల్లా ఆఫీస్ లు అన్నీ హనుమ కొండ లోనే ఉంటాయి.ఇంకా మీకు ట్రైన్ రూట్.ఇక్కడ గూడూరు లో ఎక్కితే వరంగల్ లేదా ఖాజీపేట లో దిగవచ్చు.టౌన్ లో నక్స్ లైట్ ల భయం పెద్దగా ఉండదు.మీ అమ్మాయికి భయం లేదు" చెప్పారు.


"ఎలా అయినా అమ్మాయిని అంత దూరం పంపలేము.అల్లుడుగారు వెళ్ళాలి అంటే ఆయన ప్రైవేట్ జాబ్ వదులుకొని వెళ్ళాలి"నాన్న మా మనసులోని సందేహాలు అన్నీ ఆడిగేస్తూ ఉన్నారు.

దేవుడే అన్నీ చెప్పిస్తూ ఉన్నాడు అనిపిస్తూ ఉంది.నా కష్టం ఆ ఉద్యోగం కే అవసరం ఏమో!


"దానికి ఏమీ దిగులు లేదు.అది త్వరలో కార్పోరేషన్ చేస్తూ ఉన్నారు.ఆ ప్లేస్ దొరకడం మీ అమ్మాయి లక్. దానికి అంత డిమాండ్.మీ అల్లుడుగారికి అక్కడ ప్రయివేట్ స్కూల్ లలో చాలా జాబ్స్ దొరుకుతాయి.ఇద్దరూ హ్యాపీ గా ఉండవచ్చు" చెప్పారు.


"నిజమే కానీ అక్కడ మాకు తెలిసినవారు ఎవ్వరూ లేరు.పిల్లలు అంత దూరం వెళ్లి ఎలా ఉంటారు?"అడిగారు నాన్న.


మా వాళ్ళ నుండి నేనే మొదటగా ఉద్యోగానికి వెళుతూ ఉన్నాను.ఆలోచనలు మొత్తం భయంగానే ఉన్నాయి.


"అది చెప్పడానికే వచ్చాను.మాది ఆ ఊరే.మా బంధువులు ఉన్నారు.అక్కడ ఉండచ్చు అద్దెకు.మీ అమ్మాయి జాబ్ లో చేరితే ,తాను మాథ్స్ కాబట్టి మేము ఇద్దరం మ్యూచువల్ ట్రాన్స్ఫర్ పెట్టుకొని తాను ఇక్కడికి,నేను అక్కడికి వెళ్లి పోవచ్చు.అది చెపుదాము అనే వచ్చాను"చెప్పారు ఆయన.

"మరీ 1380 రూపాయల జీతం .పిల్లలు ఎలా బ్రతుకుతారు?"అడిగారు నాన్న.

ఆయన నవ్వారు.

"అది బేసిక్ అండి. దాని మీద డి.ఏ,హౌస్ అలవెన్స్ ఇంకా చాలా వస్తాయి.ఇంకా ఇప్పుడు పి.ఆర్ సి వస్తుంది.5000 దాకా వస్తాయి.ఇంకా మీ అల్లుడుగారు జాబ్ చేయొచ్చు.ట్యూషన్స్ తీసుకోవచ్చు.అక్కడ చదువుకున్న వాళ్లకు చాలా గౌరవం ఇస్తారు."

ఇప్పుడు మా నాన్నకు,మాకు క్లారిటీ వచ్చింది.

నాన్న కృతజ్ఞతలు చెప్పి వాళ్ళ అడ్రెస్ తీసుకున్నారు.

ఆయన వెళ్లిపోయారు.

ఎవరో తెలీదు,వాళ్లే వచ్చారు.సందేహాలు తీర్చారు.ముందుకు వెళ్ళమని దేవుడే దారి చూపించినట్లుగా ఉంది.

ఎందుకైనా మంచిది "దేవుడమ్మని" అడగాలి.మా అత్తగారి కి ఆమంటే నమ్మకం.పూజ చేసి ప్రశ్న చెపుతూ ఉంటుంది ట్రాన్స్ లో!

వెళ్లి ఆడిగాము.

"వెళ్ళండి.ప్రతి ఇంటిలో మీకు ధర్మమే పలుకుతుంది"చెప్పింది.

అంతకంటే కావలసింది ఏముంది.

       **********

వెళ్లే ముందు రోజు బుజ్జిదాని దగ్గర కూర్చున్నాను.నిజానికి మేము ఆడిగినవన్నీ సమస్యలు కాదు,ఇదిగో దీన్ని వదిలి వెళ్లడమే పెద్ద సమస్య నాకు.

"ఉంటావా నేను లేకుండా?అత్తమ్మ నిన్ను బాగా చూసుకుంటుందిలే!"చెప్పాను.కళ్ళలో నీళ్ళు ఎప్పుడు బయటకు వచ్చాయో బుగ్గలపై కారుతూ ఉన్నాయి.

"ఊ" అంది నవ్వుతూ.

"ఏమిటి ఊ?ఇదొక్కటి వచ్చు నీకు.మనిద్దరం విడిపోతున్నాము తెలుసా!

ఇంకా చాలా రోజులు నన్ను చూడలేవు"బాధగా అన్నాను.

మళ్లీ అదే నవ్వు.


ఇప్పుడు కదా అసలు కష్టం,గుండెని కోసేసినట్లు.ప్రొసీడ్ ఆర్ నాట్ టు.


నెహ్రు గారు ఇందిర తప్పటడుగులు జైల్ లో ఉంది చూడలేదని బాధపడ్డారు.ఇప్పుడు నేను దీనితో మిస్ 

అయినవన్నీ తిరిగి వస్తాయా?బహుశా మనవడి రూపం లో వస్తాయేమో!

ఇప్పుడైతే దీనిని వదిలి వెళ్లాల్సిందే.ఒక తల్లి,బిడ్డల బంధం కంటే గొప్పది ఏముంది ఈ లోకంలో.దానిని ఎలా వదిలేది?


గబగబ దాని రెండు పిడికిళ్ల లో వేళ్ళు ఉంచి తెరిచాను.గులాబీలు రెండు పూచినట్లు ఉన్నాయి.ఎలా వదిలి వెళ్ళేది దీనిని?మొత్తంగా ముద్దులు కురిపించి గుండెలకు హత్తుకున్నాను.తల పైకెత్తి నవ్వింది.


"వెళ్లమంటావా?"ఆఖరుసారి అడిగాను.

"ఊ" అంది.పసి పిల్లలు వాక్కు దైవవాక్కు.


నిజమే ఒక ఎమోషనల్ బాండింగ్ మనను జీవితం లో పాజిటివ్ గా ముందుకు పంపేలా ఉండాలి కానీ అక్కడే ఆపేసేటట్లు ఉండకూడదు.అది మనను ఎదగనివ్వాలి.

ఇప్పుడు ముందుకు ప్రొసీడ్ అవ్వాలి ఈ చిన్నతల్లి నవ్వులే శక్తి గా ఉంచుకొని!

నిజమైన బంధం మనను ఉన్నతులను చేస్తుంది,దానికి దైవం సహాయం చేస్తుంది.

లెట్ మీ ప్రొసీడ్!

          @@@@@@

చిన వీర భద్రుడు గారు చెపుతూ ఉంటారు.ఏది వ్రాసిన నేపధ్యం వ్రాయండి.ఇంగిలీష్ వాళ్ళు అలా వ్రాస్తూ ఉంటారు.దాని వలన పాఠకులు ఇంకొంచెం రచయిత ఆలోచనలకు చేరుకుంటారు అని.

అందుకే ఇప్పుడు కొంచెం వ్రాస్తున్నాను.


న్యూ ఇయర్ కి ఏదో ఒక నిర్ణయం తీసుకోండి అంటూ ఉంటారు.దానిని అమలు చేస్తామో,లేదో అది వేరే సంగతి.ఇక్కడ నేను మార్చుకోవాల్సి ఉంది అని ఆలోచన ఉంటుంది కదా.

చాలా సార్లు జీవితం లో "టు ప్రొసీడ్ ఆర్ నాట్ టు" అని డైలమాలో పడుతూ ఉంటాము.నా జీవితం లో నేను పడ్డ అతి పెద్ద బాధ ఏమిటి అనుకున్నప్పుడు,ఇదే అని తోచింది.

ఐశ్వర్య రాయ్ పాప ను కన్న తరువాత లావు అయింది అని అందరూ విమర్శిస్తూ ఉన్నప్పుడు అమితాబ్ ఒక ట్వీట్ చేసారు.

"తనని ముందు మాతృత్వాన్ని అనుభవించనివ్వండి" అని.

మాతృత్వం కంటే గొప్ప బంధం లేదు.అది వాళ్ళు హ్యాపీ గా అనుభవించేటట్లు అందరం హెల్ప్ చేయాలి,ఎందుకంటే మీ అమ్మతో మీరు అదే ఆనందాన్ని పొందినందుకు కృతజ్ఞత గా.

       @@@@@(1992 లోని కథ)



Rate this content
Log in

Similar telugu story from Drama