Thanneeru Sasi

Drama

4  

Thanneeru Sasi

Drama

మీకు ఎన్ని గుర్తు ఉన్నాయి?

మీకు ఎన్ని గుర్తు ఉన్నాయి?

2 mins
531


     మీకు ఎన్ని గుర్తు ఉన్నాయి?(పార్ట్2)#వాయుగుండ్లశశికళ


వాసవి కన్యక పరమేశ్వరి కి నమస్కరించుకొని గర్భగుడి నుండి బయటకు వచ్చాను.వీళ్ళేరి?అందరూ ప్రదక్షిణ చేస్తుంటే కొడుకు వెనుక పరిగెత్తుతూ అప్రదక్షిణ చేస్తూ ఉంది మా అమ్మాయి.పోనీ ఏదో ఒకటి పుణ్యం వస్తుందిలే.డ్యూప్లెక్స్ లాగా కట్టి మెట్లు పెట్టారు.పైన చుట్టూ అమ్మవారి చరిత్ర చెప్పే కుడ్యశిల్పాలు.అద్దాల పై కప్పు దగ్గర నుండి చూడవచ్చు. ఆ కీర్తనలు,ఈ అలంకరణ,లైట్స్ కుంభాభిషేక వైభవం కనిపిస్తూ ఉంది."ఏడి వీడు?" అడిగాను."అటు పరిగెత్తాడు.చూస్తాను"అంది అమ్మాయి."ఇలా కాదు కానీ ఉపాలయాలు చూసి వెళ్లి పోదాము.ఇంకోసారి వచ్చినప్పుడు పైకి వెళ్లి చూద్దాము"చెప్పాను.అందరం వెనుక ఉన్న ఉపాలయాలు కు వెళ్ళాము.లింగం వెనుకనే గోడకు పార్వతి దేవి.చిత్రంగా ఉంది.అన్నీ చూసుకొని తీర్ధం,శఠగోపం పెట్టించుకున్నాము."ఏమండీ,డ్రైవర్ కి ఫోన్ చెయ్యి.మనం బయటకు వెళ్ళేసరికి కార్ వస్తుంది.".సరే అని జేబులో చెయ్యిపెట్టి ఉలిక్కిపడ్డాడు."ఫోన్ ఏది?" "లేదా?"అడిగాను.ఈ మధ్యే కొన్న నోకియా 16000 ఫోన్."లేదులే అమ్మాయి మాట్లాడి కార్ లో పెట్టి ఉంటుంది"చెప్పారు.సరే అని అందరం బయటకు వచ్చాము.ఇప్పుడు మొదలు అయింది కార్ కోసం వెతుకులాట.పిల్లలు ట్రాఫిక్ లో నిలవనీకుండా పరిగెత్తుతూ ఉన్నారు."వదినా, నంబర్ తెలిస్తే చెప్పు.నా ఫోన్ నుండి చేద్దాము"చెప్పింది ఆడపడుచు.నంబరా!!!!!ఎవరికి తెలుసు?ఈ స్మార్ట్ ఫోన్స్ వచ్చినాక భార్య,భర్త,పిల్లల ఫోన్ నంబర్స్ కూడా గుర్తు లేవు.ఇక డ్రైవర్ ఫోన్ ఏమి గుర్తు ఉంటుంది?ఆయినా ఎన్ని నంబర్స్ ఒక్కొక్కరికి...సన్1,సన్2,సన్ జియో!ఇలా పెట్టుకుంటున్నాము గుర్తు కోసం.మొన్న ఒకామె ఇలాగే హస్బెండ్1,హస్బెండ్ 2 అని ఫీడ్ చేసుకుంటే ఆ భర్త కి అనుమానం వచ్చి రింగ్ చేసి చూసుకున్నాడు.ఆయనకి మాత్రం ఆయన నంబర్ గుర్తా ఏమిటి పెద్ద! ఒక చుట్టూ తిరిగి వచ్చి కార్ ఎక్కడా లేదు అన్నారు."అత్తమ్మా,అసలు కార్ ఉందా?"మేన కోడలు అనుమానంగా అడిగింది."లేదులే తల్లి కొత్త అయినా నమ్మకస్తులనే తీసుకుని వస్తాము"చెప్పాను.బాధ అంతా ఈయన ఫోన్ గురించే.కార్ లో అన్నా పెట్టారా?!//"ఉండేవే తల్లి"కిందకు జారుతున్న మనవరాలిని వీపు మీద ఒక్కటి వేసాను.ఏమీ లెక్క చెయ్యదు.ఇప్పుడు నడక బాగా వచ్చేసింది.దిగి పరిగెత్తాలి అని పంతం."మీరు ఆటో లో వెళ్లిపోండి. పిల్లలు ఉండనీరు ట్రాఫిక్ లో "పంపేసారు ఈయన.//ఎక్కడ వెతుకుతాడో ఏమో!"ఇక డ్రైవర్ వేచి విసుగు వచ్చి మాకు వెతికితే తప్ప ఇక కార్ దగ్గరకు చేరలేము""వదినా,అన్న ఫోన్ కి చేద్దామా?డ్రైవర్ ఎత్తుకుంటాడు"చెప్పింది.చెయ్యొచ్చు,కానీ ఒక వేళ ఫోన్ కార్ లో లేకుంటే వేరే వాళ్ళు చూస్తే స్విచ్ ఆఫ్ చేస్తారు.సరే కానీ అనుకోని చేసాము ఇంటికి వెళ్లి.ఎన్ని సార్లు చేసినా ఎత్తడం లేదు."సరే,నీ ఫోన్ కి చేస్తాను?"అంది.ఈయన ఫోన్ విడిగా ఉంటేనే ఎత్తలేదు. నా మొబైల్ హాండ్ బ్యాగ్ లో ఉంది తీసి రిప్లై ఇస్తారా? సరే చాన్స్ ఎందుకు వదలడం ,చేసాం.ఎవరూ తియ్యడం లేదు రాత్రి అయిపోతూ ఉంది.కార్ వెతకడానికి వెళ్లిన ఈయన,అన్నయ్య చుట్టూ మళ్లీ తిరిగి ఖాళీగా వచ్చారు.ఇక డ్రైవర్ మా కోసం వేతకాల్సిందే.ఇంటికి ఎప్పటికి పోతామో!//"వదినా,నివాస్ కి చేద్దాము"మంచి ఐడియా.వాడికి ఫోన్ చేసి పాత డ్రైవర్ కి చెపితే,ఆయన కొత్త డ్రైవర్ కి ఫోన్ చేస్తాడు.అంతవరకు నయం బాబు ఫోన్ నంబర్ వీళ్ళ దగ్గర ఉంది. చేసాము.పాపం డ్రైవర్ ఒక్క పరుగున వచ్చేసాడు."ఫోన్ ఎందుకు తియ్యలేదు?"ఆడిగాము."మేడం,మీకు ఎవరు చేసారో అని తియ్యలేదు"చెప్పాడు బాధగా.నిజమే,మన ఫోన్ కి మనమే చేస్తాము అని అనుకోరు కదా.కాకుంటే సార్ ఫోన్ ఇక్కడ ఉంది, నాకు ఎలా చేస్తారు?అనే ఆలోచన రాలేదు తనకి.ఏదోలే కథ సుఖాంతం.హాయిగా ఇంటికి వెళ్లి నిద్రపోయాను.మూడు పూజల పుణ్యం,బ్రహ్మీ ముహూర్త ధ్యానం లో కంచి పెరియవ కనిపించి పూజించిన కుంకుమ తమలపాకులో ఉంచి ఇచ్చారు.మహా భాగ్యం .//ఇప్పుడు మీరు చెప్పండి,మీకు ఎన్ని ఫోన్ నంబర్స్ గుర్తు ఉన్నాయి?మనలోమాట కార్ లో కార్ తాళాలు ఉంచి కూడా మర్చి పోతారు జాగ్రత్త మరి.

         @@@@@Rate this content
Log in

Similar telugu story from Drama