STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ట్రాన్స్ఫర్ కావాలి

ట్రాన్స్ఫర్ కావాలి

1 min
679

అయినా అదేం లక్ష్యం. ట్రాన్స్ఫర్ చేయించుకుంటా అని అనగానే సరిపోదు. అది బాసింపట్టు వేసుకుని ఇడ్లీ తినడం కాదు అన్నాడు వాసు.


నేను ఏమీ మాట్లాడలేదు. చాలా మంది చెప్పారు. నాకు ట్రాన్స్ఫర్ అవడం జరగని పని అని. అప్పటికే రెండేళ్లు ఎదురు చూసాను. ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇంకా రాలేదు. ఈ మారుమూల లొకేషన్ లో ఇంటర్వ్యూలు అటెండ్ కాలేను.


అలాగని జాబ్ మానలేని పరిస్థితి. ఇంతకు ముందు జాబ్ మానేసినప్పుడు సంవత్సరం ఖాళీ వచ్చింది. ఇప్పుడు మళ్లీ అంటే కష్టం.


వారానికి నాలుగు రోజులు ఒకే సారి రెండు షిఫ్టులలో పని చేశాను. డ్యూటీ చేసి వచ్చే సరికి కాళ్లు లాగేసేవి. అప్పటికి management ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చింది.


కానీ ఒక షరతు. నా డ్యూటీ చేయడానికి ఎవ్వరూ రావట్లేదు. నా డైలీ వర్క్స్ మొత్తం డాక్యుమెంటేషన్ చేసి ఇస్తే ట్రాన్స్ఫర్ అవుతుంది. 


లేదంటే ఎవరో ఒకరు కొత్తగా నా జాబ్ చేసే వాళ్ళు ఈ లొకేషన్ కి వస్తేనే నాకు ట్రాన్స్ఫర్ అవుతుంది.


నెల రోజులు పట్టింది డాక్యుమెంట్ తయారు చేయడానికి. ఆ నెల రోజులూ నిద్ర బాగా ఇబ్బంది పెట్టింది. రోజుకి ఐదు గంటలు మాత్రమే పడుకునే వాణ్ణి.


కళ్ళు మంటలు పుట్టేవి. అలా శ్రమ పడి డాక్యుమెంట్ చేసి వాళ్లకు అప్పజెప్పి ఇంటికి దగ్గర్లో ఉన్న లొకేషన్ కి వచ్చేశాను.


ఒక్కోసారి మనం నిర్దేశించుకున్న లక్ష్యాల కోసం మన శరీరాన్ని, మనసునూ కష్టపెట్టాల్సి వస్తుంది. ఫలితం నీకు దక్కినప్పుడు ఆ ఆనందంలో ఎంత కష్టం పడినా అంతా నీ మంచికే అనిపిస్తుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract