Triveni K

Drama

2  

Triveni K

Drama

తనలో సగం

తనలో సగం

3 mins
416


సిరి ఊరికి వచ్చానని ఫోన్ చేసింది. వెంటనే తయారయ్యాను.బయట నిలబడి ఎవరితోనో మాట్లాడుతున్న తనతో చెప్పాను "సిరివచ్చిందంట కలిసి వస్తానని"."అయ్యో ఇప్పుడే నవీన్ ఫోన్ చేసాడు.అర్జంట్ పని ఉంది రమ్మని.అరగంట ఆగకూడదు నేనే వచ్చి దింపుతా.అసలే ఎండగా ఉంది.నడిచి ఎలా వెళ్తావ్"."నేనేమీ నిన్ను రమ్మని చెప్పట్లేదు.నేను వెళ్తున్నా అంటూ" పెడసరి సమాధానం ఒకటి చెప్పేసి తాళం అక్కడే పెట్టి బయలుదేరాను.ఇంటర్ అయ్యీఅవడంతోనే మేనమామ కొడుకుతో పెళ్ళయిపోయింది నాకు.అప్పటివరకు ఎన్నో కలలుకన్నాను.బాగా చదువుకోవాలి.చదువుకొని ఉద్యోగం చేస్తున్న వ్యక్తి ని పెళ్ళాడాలని.కానీ కనీసం నా అభిప్రాయం అడగకుండానే పెళ్ళిచేసేసారు.అన్ని విషయాలలో నన్ను బాగానే చూసుకుంటున్నా అతడిపట్ల ఎందుకో అసంతృప్తి.అత్తయ్యా వాళ్ళది అదేఊరు కావడంతో సిరి వచ్చినప్పుడల్లా కలుసుకుంంటుంటాం.చిన్నప్పటినుండి నేను, సిరి ఇంటర్లో వరకు కలిసే చదువుకున్నాం.ఆలోచనలలోనుండి బయటకొచ్చేసరికి సిరీ వాళ్ళ ఇళ్ళొచ్చేసింది.పేరుకే కాదు ఇటు పుట్టింట్లో అటు అత్తారింట్లో కూడా సిరికలిగినదే.ఉద్యోగస్తుడైన భర్తతో సిటీలో కాపురం. పురిటికని వచ్చిన భార్యని విడిచిఉండలేక మూడవనెలలోనే తీసుకువెళ్ళిపోయాడు తన భర్త.


అందుకే మళ్ళీ ఆలస్యం చేస్తే కలవకుండానే ఎక్కడ సిరి వాళ్ళ ఆయన వచ్చి తీసుకువెళ్ళిపోతాడోనని భయంతో వెంటనే ఎండలో పరుగెత్తుకొచ్చాను.దానిని చూస్తే ఎప్పుడూ నాలో నాకే తెలియకుండా ముడుచుకుపోతాను.వాళ్ళ స్థాయికి మాకు పోలికపెట్టుకుని చిన్నతనంగా ఆలోచిస్తాను.కానీ అదంతా సిరిని కలిసేవరకే.కలవగానే ప్రేమగా పలకరించే దానిమాట గాని,చూపుగాని క్షణంలో స్నేహం అనే ప్రేమతో తడిపేస్తుంది.మాటలవర్షంతో సమయమే తెలియనంతగా కాలం గడుస్తుంది. నేను కష్టం అనుకునే నా గోడంతా వెళ్ళబోసుకుంటాను.సాంత్వన వాక్యాలతో తను నన్ను ఓదార్చుతుంది.నేనెప్పుడూ తనని ఎలా ఉన్నావ్ అని అడగను. ఎందుకంటే తను రాజభోగాలు అనుభవిస్తుంది.ఉద్యోగస్థుడైన భర్త తనకేం తక్కువ అని.కానీ ఈసారి ఎందుకో అడగాలనిపించింది.


నేను కనిపిస్తూనే ఆత్మీయంగా ఎదురొచ్చి నా చేయిపట్టుకొని మంచం పక్కనే ఊయలలో పడుకున్న వాళ్ళ పాపని చూపిస్తూ మంచంపై తన పక్కన కుర్చోపెట్టింది."చెప్పవే ఎలా ఉన్నావ్? అంటూ నన్నడుగుతున్న సిరి ముఖం పీక్కుపోయిఉంది.ఎప్పుడూ చేపపిల్లల్లా కదలాడే తన కళ్ళు కళావిహీనంగా అయిపోయాయి. నేను గమనిస్తున్నానని తలవంచుకొని పాప వైపే చూస్తున్న తనకళ్ళలో కన్నీటి పొర.ఒక్కక్షణం నానేస్తాన్ని అలా చూసేసరికి గుండెపట్టినట్టయింది.తన చుబుకంపట్టి నా వైపు తిప్పుకుంటూ ఏమైంది సిరీ ఇలా ఉన్నావ్?.ముఖం కళతప్పింది.మనిషివి కూడా బాగా పాడయిపోయావ్.ఏమైందే? అంటుంటే అప్పటివరకు దాచుకున్న దుఃఖం రూపంలో బయటకు వచ్చింది. "ఏమని చెప్పనే ఉద్యోగస్థుడైన అల్లుడుకావాలని ఏరికోరి చేసారు.నా ఆస్థి తప్ప నా ఆనందం తో అతడికి సంబంధంలేదు.ఇంట్లో అన్నీఉన్నాయిగా ఇంకేం కావాలి అంటాడే కాని నాతో గడపడానికి సమయం ఉండదు.పనిమనిషిలా తప్ప మనసుతో పనిలేదు.


ఇంట్లో చిన్నదానికి,పెద్దదానికి పండగలంటూ ఆడపడుచులు వచ్చికూర్చుంటారు.వాళ్ళు ఆడవాళ్ళేగా ఆపరేషన్ అయ్యి ఉన్న నా మీదేవాళ్ళపని ,ఇంటి పనంతా వదిలేసి టి.వీ చూస్తూ కూర్చుంటారు. కనీసం చిన్నపిల్లతో ఏంచేసుకుంటుందనే ఆలోచన ఆయనకి కూడా ఉండదు. పైగా మా చెల్లెల్లకి అదంటే ఇష్టం చేసిపెట్టు, ఇదంటే ఇష్టం వండిపెట్టు అంటూ ఆర్డర్లు.వాషింగ్ మెషిన్ తీసుకుందాం లేదా పనిమనిషి ని పెట్టుకుందాం అంటే నువ్వెందుకు తిని ఒళ్ళు పెంచుతావా అంటాడు.అత్తయ్య గారిని తెచ్చుకుందాం పిల్లని చూసుకుంటారు కొన్నాళ్ళు. నేను అన్ని పనులు చెయ్యలేకపోతున్నాను అన్నానని "మా అమ్మ నీకు పనిమనిషిలా కనిపిస్తుందా "అంటూ చేయిచేసుకున్నాడు.అసలే బాలింతను ఆ దెబ్బలకి ఆరోగ్యం పాడయింది.భయపడి అమ్మావాళ్ళకి ఫోన్చేసి తీసుకెళ్ళమన్నాడు.ఎంతయినా అమ్మానాన్నలు కదా మళ్ళీ అతడితో తీసుకెళ్ళెందుకు మంతనాలు చేస్తున్నారు. వద్దని వదలిపెట్టే బంధంకాదుగా.


అందుకే భరిస్తున్నా" అంటూ కన్నీళ్లు తుడుచుకుంటున్న సిరిని ఆత్మీయంగా హత్తుకున్నాను.కష్టంలో సేదతీర్చే స్నేహితురాలి స్పర్శకంటే ధైర్యం ఏముంటుందో నాకర్థంకాలేదు.అధైర్యపడకు సిరి నీ ప్రేమతో అతడిని మార్చడానికి ప్రయత్నించు.తన కూతుర్ని దగ్గర చెయ్యీ.నెమ్మదిగా ఆయనే అర్థంచేసుకుంటాడు అంటున్న నన్ను "సరెలే అవిఎప్పుడూ ఉండే బాధేలే .శివ ఎలా ఉన్నాడు? అనగానే నా భర్త గుర్తొచ్చాడు"."నా అభిప్రాయానికి విరుద్ధంగా పెళ్ళిచేసినా ఎప్పుడూ నన్ను ప్రేమగానే చూసుకుంటాడు.చిన్న షాపు నడుపుతున్నాడని పెద్దగా చదువుకోలేదని నేనెంత చులకనచేసినా అతడి ప్రేమలో మార్పురాలేదు.ఒక్కోసారి నా ప్రవర్తనకు అత్తయ్య కోప్పడినా వారిస్తాడు.ఎండలో ఏం వెళతావ్ నేను దింపుతా ఉండు అంటున్న అతడు గుర్తురాగానే మనసులో చిన్న బాధ".ఏయ్ నిన్నేనే ఏమాలోచిస్తున్నావ్ అంటూ కుదుపుతున్న సిరి.


చూడు నీకేదో ఫోనొచ్చింది అంటూ ఫోన్ వైపు చూపించింది. ఫోన్ తెరపై శివపేరు కనిపిస్తుంది. ఫోన్ ఎత్తి హలో అనగానే భోజనం చేసావా అంటూ తను.లేదు అన్నాను అక్కడ తింటావా? వచ్చేస్తున్నావా? అన్నాడు .లేదు తినడంలేదు వచ్చేస్తున్నా అన్నాను.అయితే అక్కడే ఉండు బండి తీసుకుని వస్తా. ఎండెక్కువగా ఉంది అనిఫోన్ పెట్టేసాడు. ఫోన్ వైపు నవ్వుతూ చూస్తున్న నావైపు ఏంటే భోజనం చెయ్యకుండా ఎక్కడికి వెళ్తావ్. తినే వెళ్ళు అంటున్న సిరితో "లేదు సిరి.ఇప్పటివరకు నన్ను నా ప్రవర్తనను ఓపికగా భరించే శివను అర్థంచేసుకోలేదు.అన్నీఉన్నా ఏదో లేదనే అసంతృప్తితో రగిలిపోయేదాన్ని.డబ్బు, చదువుకాదు. భార్యను ప్రేమించే భాగస్వామి కావాలి అర్థంచేసుకోకుండా బాధించేవారుకాదు.నీవల్ల నా తప్పుతెలిసింది. తనలోసగమైన నా కోసం ఎదురుచూస్తూ ఆయనకూడా తినిఉండడు.ఆయనతో కలిసితింటానే.ప్లీజ్ ...అంటున్న నన్ను అబ్బో శివ నుంచి ఆయనవరకు వచ్చింది సంగతి.మంచిది. సరే నీ ఇష్టం.ఈసారికి మీ ఏకాంతం చెడగొట్టకూడదని మాత్రం వదిలేస్తున్నా.మళ్ళీసారి శివతోపాటు నువ్వు భోజనం చెయ్యాలి అంటుండగానే బయట బండిహారన్ వినిపించింది. సరే వస్తానే అంటూ ఉయ్యాలలో ఉన్న పాపకు ముద్దుపెట్టి ఆనందంగా ముందుకు నడిచాను.


Rate this content
Log in

Similar telugu story from Drama