తెలుగు మీడియం
తెలుగు మీడియం


ఒక్కసారి ఆలోచించుకో.తెలుగు మీడియంలో చదివితే ఇవ్వాళ రేపు చాలా కష్టం.నాన్న గారు అన్నారు.
నాకేమో ఇంగ్లీష్ మీడియం అంటే ఎందుకో ఇష్టంగా లేదు.
తెలుగు మీడియంలోనే చదివాను.కానీ ఇంగ్లీష్ భాషను నేర్చుకోవడం చాలా ముఖ్యమని అమ్మా నాన్నా
ట్యూషన్ పంపించారు.దానితో ఇంగ్లీషు భాష మీద ఉన్న భయం పోయింది.
తెలుగు ఇంగ్లీషు రెండూ ముఖ్యమేనని అర్థమైంది.
తెలుగు మీడియంలో చదివినా ఇంగ్లీషు నేర్చుకోవడం వల్ల రెండు భాషల్లో కమ్యూనికేట్
చేయడం సులువయింది.
జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నప్పుడు వయసు కన్నా నా తల్లిదండ్రుల ఆసక్తి స్నేహితుల ప్రోత్సాహం చాలా ఉపయోగపడ్డాయి.