సత్యభామ topic 5
సత్యభామ topic 5
బామ ....నా సత్యభామ...అందాల అరుణావని నాపై అలక నికు న్యాయమా.,.
హ్మ్మ్....అక్కడే ఆగండి..మీరు మాత్రం నన్ను తక్కోవ చెయ్యడం సబబేనా...చెప్పండి..
సతీ...నా ప్రాణ సఖి ఇష్టసఖి నువ్వు ఇలా అనడం నిజంగా నేను భరించ లేకున్నాను నీకు మించినది నాకు మరి ఇది కూడా లేదు అలా ఆలోచించడం కాదు నీవు లేనిదే నేను వెన్నల లేని ఆకాశం వలే మిగిలిపోతాను నువ్వు లేకుంటే నా జీవితంలో ఏమీ లేదు సఖి
చాలు చాలు మీ నాటకాలు ఈ మాటలే 16 వేల మందితో చెప్తున్నారు. మా 16 మంది తో కూడా చెప్తున్నారు ఇకనైనా మీ మాటలు చాలించి నను విడువండి.
సఖి సత్యభామ నువ్వే నన్ను పొమ్మని అంటే నేను ఎక్కడికి పోను
మీకు నేను మాత్రమే ఉన్నానా పదహారు వేల మంది గోపికలు ఉన్నారు 16 మంది బామలు ఉన్నారు. ఇంకా ఎందుకు నా వెనకే మీ ప్రాకులాట
అని అంటూ అలక పానుపు పై పడుకుంది సత్యభామ
అప్పుడు శ్రీకృష్ణుడు
నా ప్రాణ సఖి ....నువ్వు అలకలో అతిలోక సుందరిగా నా కంటికి ఆగుపడుచున్నవు.నిను మించిన అందం మరేది లేదు..అని అంటారు..
సత్యభామ చిరు కోపం గా చూస్తుంది...
నీకు అలక ఆభారణం సఖి....నను మన్నించవా అని అంటారు...
అయ్యే...స్వామి మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏమిటి...వలదు స్వామి..
మరి నాపై అలక తిరినదా....
ఎప్పుడో అంటూ చిరునవ్వు నవ్వింది సత్యభామ..
దయచేసి తప్పుగా అనుకోకండి.బార్య భర్తలు అన్నాక గొడవలు సహజం.అలకని పోగొట్టే పరిష్కారం వెతికితే గొడవలు త్వరగా సద్దుమ నుగుతాయి.అమ్మాయిని కాస్త పోగడండి.త్వరగా కూల్ అవుతారు..అన్ని సమయాల్లో కాదండోయ్..
సత్యభామ ఎంత అలక వున్న తన మనస్సు చిన్న పిల్లల మనసు...శత్రువును చిల్చే అపర భద్రకాళి...ఆకలి తీర్చే అన్నపూర్ణ...
వారి ఇద్దరి మధ్య సంభాషణ ఇలా వుంటుంది అని ఊహించి అల రాసాను...తప్పుగా అనుకోకండి.

