STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

సమయం ఉంది..

సమయం ఉంది..

1 min
547

నా దగ్గర అస్సలు టైమ్ ఉండట్లేదు అన్నాడు గౌరవ్. నితిన్ తన ఫేవరెట్ టీవీ షో చూస్తున్నాడు.


ఒరేయ్ అన్నయ్యా! నేను చెప్పేది కాస్త వినరా. అయినా జాబ్ చేస్తూ నువ్వు ఇంత బాగా టైమ్ ఎలా మేనేజ్ చేస్తున్నావ్ అన్నాడు గౌరవ్.


నితిన్ టీవీ సౌండ్ తగ్గించి రిమోట్ పక్కన పెట్టాడు. అసలు నీ బాధేంటి అని అడిగాడు.


ఏముందీ. స్టడీస్ కి టైమ్ సరిపోవట్లేదు. నైట్ పడుకోవడం లేట్ అవుతోంది. నిద్ర సరిగ్గా పట్టట్లేదు అని గౌరవ్ చెప్పుకుంటూ పోతుంటే నితిన్ ఆపాడు.


రేయ్. ఆపరా బాబూ. ఇంకాసేపు ఉంటే నాకు పెళ్ళి కావాలి అనేటట్లు ఉన్నావ్ అన్నాడు నితిన్ నవ్వుతూ.


ముందు నువ్వు చేసుకోరా. నాదింకా చదువే పూర్తి కాలేదు అన్నాడు గౌరవ్.


సరే సరే. ముందు నేను చెప్పేది విను. ఉదయం ఐదు గంటలకే నిద్ర లేవడానికి ప్రయత్నించు. కాస్సేపు ఎక్సర్సైజ్ చేసుకుని, ఫ్రెష్ అయ్యి చదువుకో.


నైట్ ఆటోమేటిగ్గా అదే పడుతుంది నిద్ర. స్టార్టింగ్ కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది. క్లాసులో నిద్ర వస్తుంది. కొద్ది రోజులు ప్రయత్నించు. ఒక్కసారి ఉదయాన్నే నిద్ర లేవడం అలవాటు చేసుకుంటే ఎన్ని పనులు కాలేజ్ కి వెళ్ళే ముందే కంప్లీట్ చేసేయొచ్చు అనిపిస్తుంది అని చెప్పాడు నితిన్.


నువ్వు ఎన్ని గంటలకి లేస్తున్నావ్ రా అన్నాడు గౌరవ్.


వీకెండ్స్ లో ఏడింటికి లేస్తాను. ఆఫీసు ఉన్నప్పుడు ఐదు గంటలకే లేచేసి అన్ని పనులూ చేసుకుంటాను.


అందుకేరా వీకెండ్ లో ఇంత టైమ్ దొరుకుతోంది. నేను కూడా కొన్ని అలవాట్లు మార్చుకోవాలి. వీకెండ్స్ లో ఏదైనా కొత్త కోర్సులు నేర్చుకుంటే హెల్ప్ అవుతుంది అంటూ రిమోట్ చేతిలోకి తీసుకున్నాడు నితిన్.


గౌరవ్ ఆవులించాడు.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract