ఋతుపవనం..
ఋతుపవనం..
వర్షం ఇంకా రాలేదు. వస్తే బావుణ్ణు. అదే పనిగా బట్టలు నానబెట్టి ఆకాశానికి సిగ్నల్ ఇచ్చాను. బట్టలు ఉతికి
ఆరేసినప్పుడు నన్ను ఉడికించడానికన్నా వాన పడుతుందేమో అని.
ఇంకొంచెం ఆలోచించి వడియాలు ఆరబెట్టాను. పాత్రలు కడిగి బయట పెట్టాను. అయినా వాన పడలేదు.
ఇంక విసిగిపోయి రాత్రి దోమ తెర కట్టుకుని పడుకున్నాను. మధ్య రాత్రిలో చినుకులు పడ్డాయి. ఆ.. ఇదంతా మామూలే. నాలుగు చినుకులు పడి పోతాయి. అంతే కదా అనుకున్నాను.
ఉన్నట్టుండి దోమతెర కింద పడిపోయేలా పెద్ద పెద్ద చినుకులు పడ్డాయి. లోపలికి వెళ్ళే లోపు తడిసి ముద్దయ్యేలా వర్షం పడింది. ఋతుపవనం నాతో జత కట్టింది.
