STORYMIRROR

Dinakar Reddy

Abstract Action Inspirational

4  

Dinakar Reddy

Abstract Action Inspirational

రేపన్నది నీదో నాదో

రేపన్నది నీదో నాదో

1 min
458

నేను గెలవాలి. అంటే విశాల్ ఓడిపోవాలి అన్నాడు కుమార్.

అతడు టెన్నిస్ బంతిని వేగంగా బ్యాట్ తో కొట్టాడు. 

అంత కోపం పనికిరాదు. విశాల్ గురించి వదిలిపెట్టి గేమ్ మీద ఫోకస్ చేయి అన్నాడు శ్రీధర్. 


లేదు సార్. మీరు నన్ను టెన్నిస్ ఛాంపియన్ ని చేస్తానన్నారు. మీ కోచింగ్ లో నేను చాలా నేర్చుకున్నాను. కానీ ఆ విశాల్.. అంటూ ఆగాడు కుమార్.


శ్రీధర్ అతని పక్కనే వచ్చి కూర్చున్నాడు. టెన్నిస్ కోర్టు చుట్టూ చూడమని చెప్పాడు. 


కుమార్ చుట్టూ చూశాడు. ఇప్పుడు కళ్ళు మూసుకో.

రేపన్నది నీకు ప్రజల ప్రశంసల్ని గుర్తుకు తేవాలి. టెన్నిస్ ఆడినప్పుడు నీకు గుర్తు రావాల్సింది విశాల్ కాదు. అతడు కేవలం నీకు ఒక ఆటలో ప్రత్యర్థి. అంతే.


అసలు నువ్వు ఆట ఆడుతున్నది అతనితో కాదు. నీతో. నిన్నటి నీతో. రేపటి నీ కోసం. ప్రత్యర్థి ఎంత బలవంతుడైనా నువ్వు లొంగిపోకూడదు.


పోరాటం మాత్రమే నీది. రేపన్నది నీదో కాదో తెలీదు. కానీ పోరాటం నీదే. ఎప్పటికీ నీదే అని చెప్పి శ్రీధర్ బయటికి వెళ్ళిపోయాడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract