Dinakar Reddy

Abstract Drama

4.5  

Dinakar Reddy

Abstract Drama

రైల్వే రాజు - క్రికెట్ అకాడమీ (అప్పట్లో ఒకడుండేవాడు)

రైల్వే రాజు - క్రికెట్ అకాడమీ (అప్పట్లో ఒకడుండేవాడు)

1 min
708


అకాడెమీ గురించి తెలిసిన తరువాత విఠల్ రాజుని కలుస్తాడు.

రియా అతని కూతురు అని చెప్పిన తరువాత రాజు దూరంగా జరుగుతాడు.


గ్రౌండ్ లో మొత్తం వెలుగు. రాజు కళ్లలో చీకటి. ఎందుకు సేటూ నా కూతురికి నన్ను చూపించావ్.


ఏదీ సాధించలేని నాన్నను నేను.నమ్మి వచ్చిన నిత్యకు నేనేం న్యాయం చేసాను. క్రికెటర్ అవ్వాలన్న కలను నెరవేర్చుకోలేక ఎంత బాధ పడ్డానో నీకు తెలుసు కదా అన్నాడు.


రియా అతణ్ణి నాన్నా అని పిలిచింది. అతడు తల దించుకున్నాడు. ఆమె తండ్రి దగ్గరిగా వెళ్లి అతడి కాళ్ళ దగ్గర కూర్చుంది.


నాన్నా. మీ గతంలో మీపై బలవంతంగా నక్సలైట్ అనే ముద్ర వేయాలని చూసిన పోలీసులు ఉన్నారు. మిమ్మల్ని క్రిమినల్ గా మార్చిన మనుషులూ ఉన్నారు.


కానీ మీరు చివరికి మంచినే ఎన్నుకున్నారు. ఎంతో మంది టాలెంట్ ఉన్న క్రికెటర్లను ప్రోత్సహించి వారిని ప్రపంచానికి పరిచయం చేస్తున్నారు.


మీరు తల దించుకుని బాధపడడం కన్నా తల ఎత్తుకుని నా కూతురు కూడా ఒక క్రికెటర్ అని చెప్పుకుంటే నాకు సంతోషం అంటుంది.


రాజు సంతోషంగా ఆమె తల మీద చెయ్యి పెట్టి దీవిస్తాడు.


నాన్నా ఇప్పుడు ఆరు బాల్స్ వేస్తాను. సిక్స్ కొడతావా అంటుంది రియా.


రాజు బ్యాట్ పట్టుకుంటాడు. టెస్టర్ ఇంకా విఠల్ చప్పట్లు కొడతారు.


Rate this content
Log in

Similar telugu story from Abstract