STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

రామచిలుక - కాకి

రామచిలుక - కాకి

1 min
399

అప్పుడే వర్షం ఆగినట్లుంది. డాబా మీదకి వెళ్లి కూర్చున్నాను. డాబా మీదకి చేరి సముద్రాన్ని చూస్తూ ఎంతసేపయినా కూర్చోవచ్చు.


సముద్రం. అప్పుడే చేరిన చెలిని ముద్దాడుతూ ఉన్నట్లు అలల పైన సూర్యుని కిరణాలు. ఎంత బాగుందో కదా అని అనుకున్నాను.


ఇంటి పక్కనే ఉన్న రెండు అశ్వత్థ చెట్లు అవునన్నట్లు ఊగాయి. అప్పుడు గమనించాను. ఒక చెట్టు మీద రామ చిలుక. పచ్చికబయళ్ళంత ఆకు పచ్చగా మెరిసిపోతోంది.

నేనూ ఇక్కడే ఉన్నా అన్నట్లు మరో చెట్టు మీద ఉన్న కాకి కావ్ కావ్ అంది.

అమావాస్య రాత్రంత చిక్కని చీకటి రంగులో ఉంది కాకి. 


ఏమ్మా కాకమ్మా ఎవరొస్తారు మా ఇంటికి ఈవేళ అని అడిగాను. కాకి ఇంటి మీదకు వచ్చి అరిస్తే ఆ రోజు బంధువులు వస్తారని అంటారు కదా.


రామ చిలుకా అందంగా ఉంది. కాకి కూడా బానే ఉంది.

కాదు కాదు. దేని రంగు దానిదే. అసలు ఈ రంగు బాగోలేదు. ఫలానా రంగు ప్రాణినే అందంగా ఉంది అని మనం ఎందుకు అనుకుంటామో.


బహుశా చిన్నప్పట్నుంచీ మనం విన్న మాటలు అలానే ఆలోచింపజేస్తాయేమో. ఫలానా రంగులో ఉంటే అందంగా ఉన్నట్టు. లేకుంటే ఏదో వెలితి. 


అందరమూ ప్రకృతిలో భాగమే. ఏ ప్రాణీ మరో ప్రాణి కంటే అందమైంది కాదు అనే విజ్ఞత ఓ వైపూ, అందంగా ఉన్న వాళ్ళనే ఇష్టపడే సమాజంలో ఉంటూ అందం కోసం క్రీములు రాసే నా అవసరమూ, కాసేపు పోట్లాడుకున్నాయి.


ఇక చాల్లెద్దూ అని క్రిందికి దిగాను రామచిలకా పెళ్లి కొడుకెవరే అని పాడుకుంటూ.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract