బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

పుట్టిల్లేె లేదనుకుంటా

పుట్టిల్లేె లేదనుకుంటా

3 mins
472


స్రవంతి కొంచం ఆ మిరపకాయల బుట్ట అందుకో....


ఫోన్ లో ముఖ పుస్తకం చూస్తూ పిచ్చి కబుర్లతో మునిగిన స్రవంతి కి ఆ పిలుపు వినబడిన కాస్త బద్ధకమో లేక ఎం కాదు లే తానే తెచ్చుకుంటుంది లే అనే ఆలోచన నో...తెలియదు కానీ ఇంకా వినపడలే అని అన్నట్లు అందులోనే మునిగి పోయింది...


వినపడింద ....!అని మళ్ళీ ఒక కేక....


హా.....వినపడింది అని అంటూనే ఫోన్ లో అలానే టైప్ చేస్తూ నడుస్తూ వెళ్ళి అడిగింది ...ఎం కావాలి అమ్మ ఎందుకు అరుస్తున్నవ్..కొంచం నిదానం గా చెప్పవచ్చు గా...అని విసుగ్గా...


నేనేం అన్నానే నిన్ను ఇప్పుడు...కాస్త అవి అందుకో అన్నాను అంతే గా ... అత్తగారి ఇంట్లో కూడా ఇలానే వుంటవా నువ్వు ఎప్పుడు చూసిన ...ఆ ఫోన్ పట్టుకొని ...


ఆ మాట వినగానే స్రవంతి కి ఎక్కడ లేని కోపం వచ్చింది....ఏమిటి అమ్మ వచ్చినప్పటి నుంచీ ఇలానే అంటున్నావు...అక్కడ అన్ని పనులు నేనే చెయ్యాలి....ఇక్కడికి వచ్చాక అయిన కాస్త విశ్రాంతి తీసుకుందామని అనుకుంటే నువ్వేమో ఇలా అంటున్నావు...మొన్న వచ్చిన రోజు కూడా ఇలానే అన్నావు... పిల్లల కి అన్నం తినిపించవ లే ఎంత సేపు ఆ టీవీ చూస్తూ కూర్చోవడం ఏమిటి...అని ..


నేను ఇంటికి రావడం ఇష్టం లేకుంటే చెప్పు ...నా పిల్లలకి అమ్మమా గారి ఇల్లు లేదు అని అనుకుంటా..సెలవులకి అని వస్తె నువ్వు ఇలా చేస్తున్నావు...అని కోపంగా అంటుంది స్రవంతి...


ఆ మాటలు విని లోపల పేపర్ చదువుతూ వున్న స్రవంతి తండ్రి బయటకి వచ్చి ఎం అయ్యింది అని అడిగాడు...ఒక పక్క బార్య కంట్లో కన్నీలని చూస్తూ కూతురి మొహం లో వున్న కోపం చూస్తూ....


చూడు నాన్నా వచ్చిన అప్పటి నుంచి అమ్మ నన్ను ఎదో ఒకటి అంటూనే వుంది....


నువ్వు లోపలికి వెల్లు అని భార్యతో అని...తన గరాల పట్టి నీ తన పక్కన కూర్చో బెట్టుకున్నాడు....


చిట్టి తల్లి ....అమ్మకి నీ మీద కోపం కాదు రా...ఒక సారి పిల్లల వైపు చూడు అని చూపించాడు...ఇద్దరు సోఫాలో కూర్చుని ఒకరేమో టీవీ చూస్తూ వుంటే...మరొకరు ఫోన్ లో గేమ్ ఆడుకుంటు వున్నారు....మొన్న నువ్వు చిన్న దాన్ని ఎప్పుడు టీవీ నే నా చదువుకో అని అంటే రెండు రోజులు తిండి మానేసింది అని చెప్పింది గుర్తు వుందా....


హ్మ్మ్...


నువ్వు వాళ్ళ ముందు గంటలు గంటలు టీవీ చూస్తూ వుంటే వాళ్ళు కూడా అదే చేస్తారు...నువ్వు ఫోన్ పట్టుకొని నీ బిజీ లో నువ్వు వుంటే నీ సుపుత్రుడు కూడా అలానే గేమ్స్ ఆడుతూ వుంటాడు...గేమ్స్ అడవద్దు అని అంటే కోపం తో సెల్లు పగల గొట్టాడు అని నువ్వు చెప్పింది గుర్తు వుందా...


హ్మ్మ్...


నువ్వు పిల్లల ముందు ఎం అయితే చేస్తావు అవే పిల్లలు కూడా చేస్తారు...వాళ్ళు ఏదయినా నీ నుంచే నేర్చుకుంటారు....కోపం అయిన ప్రేమ,నిజాయితీ,సంస్కారం ఏదయినా సరే...నువ్వు వాళ్లపై కోప పడి..అంత కోపం పనికి రాదు మంచిది కాదు అని అనటం ఎంత వరకు సబబు నువ్వే చెప్పు...మనం చెప్పే ముందు ఆచరించడం మంచిది...నువ్వు చదువుకున్న పిల్లవి నికు నేను చెప్పక పోయినా అర్ధం చేసుకొనే తెలివి తేటలు వున్నాయి....నీ పిల్లల్లని ఏ మార్గం వైపు నడిపించాలి అని ఆలోచించవలసినది నీవే తల్లి....నువ్వు టీవీ చూడవద్దు ఫోన్ వాడవద్దు అని నేను అనడం లేదు...కానీ ప్రతి దానికీ ఒక సమయం కలదు....ఒక నియమం పెట్టుకో...అల అయితే సమయము వృధా కాదు.... అస్సలు టైమ్ వుండడం లేదు అనే నీ ప్రశ్న కి కూడా సమదానం దొరుకుతుంది...


అందుకే తల్లి ఆది గురువు అని అంటారు....అని లేచి లోపలికి వెళతాడు...


స్రవంతి ఆలోచనలో పడింది...ఒక ఆధునిక తల్లిగా నేను నా పిల్లలకి మంచి నీ నేర్పుతున్న నా...లేక చెడు నా...తల్లి గా ఒక టీచర్ గా అన్ని నాకు తెలుసు అయినా ఎందుకు నేను ఇలా ఆలోచించలేదు....నేను పెరిగిన వాతావరణం నాకు నేర్పిన జ్ఞానం నీ నా పిల్లలకి నేను కల్పించడం లో విఫలం అయ్యనా....రేపటి నుంచి నా పిల్లల నీ సరయిన దిశలో నడపాలి...కాదు కాదు....ఆలస్యం అమృతం విషం అన్నారు పెద్దలు ఇప్పుడే మొదలు పెట్టాలి...అని అంటూ....పిల్లల వైపు అడుగులు వేసింది స్రవంతి...


పిల్లల వైపు అడుగులు వేస్తున్న స్రవంతి నీ కిటికీ నుంచి చూసి సంతోషించారు అమ్మమ తాతయ్యలు...

మరి ఈ సారి సెలవులకి అమ్మామ గారి ఇంటికి వెళితే మీరేం చేస్తారు....🤔🤔📲 లేక🏃

🙏🙏🙏🙏🙏మీ కీర్తి



Rate this content
Log in

Similar telugu story from Drama