ప్రేమించడం కూడా విజయమే
ప్రేమించడం కూడా విజయమే


విశేష్! నేను నిన్ను ప్రేమించట్లేదు.
నూట ఇరవయ్యో సారి అతను మెసేజ్ చూసుకున్నాడు.
ఆమె ఎప్పుడూ ఒకటే చెప్పేది.ఎవ్వరి కోసమూ నువ్వు చదువును నిర్లక్ష్యం చేయకు అని.
అతనది తు.చ. తప్పకుండా పాటించాడు.
ప్రేమలో విఫలమైనా ఎంట్రన్స్ పరీక్షలో మంచి మార్కులు సాధించి అనుకున్న జాబ్ పొందాడు.
తన తొలి ప్రేమ గురించి ఎప్పుడూ ఎవరికీ చెప్పలేదు.విఫలమైనదని కాదు.ఆమె ప్రైవసీకి భంగం వాటిల్లకూడదని.
ప్రేమలో ఓడిపోయినా అతను జీవితాన్ని గౌరవించడం మానలేదు.
తన తల్లి తండ్రులు కుదిర్చిన అమ్మాయిని పెళ్లి చేసుకుని ఆమెను మరింత ప్రేమించడం.
ప్రేమలో గెలుపొందడమే కాదు.ప్రేమించడం కూడా విజయమే అనే స్ఫూర్తితో ముందుకు సాగాడు.