STORYMIRROR

Director Kashi

Romance

3.8  

Director Kashi

Romance

ఫిగర్ 2

ఫిగర్ 2

3 mins
410



దివినుండి భూమి కి దిగివచ్చిన వచ్చిన దేవకన్య లా,

చూడగానే కళ్ళు తిప్పుకోలేంత ఆకర్షణ, ఇద్దరూ ఆ

అమ్మాయి వైపు చూస్తూ ఇద్దరూ ఒక్కసారి గా

అబ్బా... ! సూపర్ .......... ఫి.....గ....ర్..

అని గట్టిగా అరుస్తారు? ! అరచి చుట్టూ జనాలని

చూసి సైలెంట్ గా ఆ అమ్మాయి వైపే చూస్తూ

ఉంటారు. ఆ అమ్మాయి సీరియస్ గా వీళ్ళ వైపే

వస్తూవుంటుంది , అది గమనించిన ఇద్దరికీ ప్యాంటు

తడిసి పోయేట్టు ఉంటుంది.

వివేక్ : అరేయ్ ! కార్తీక్ ఇక్కడ నుండి పోదాం రా !

కార్తీక్ : నిమిషానికి వెయ్యి కిలోమీటర్స్ వేగం తో

పోదాం .....

అని అంటూ ఉండ గా అమ్మాయివాళ్ళ వద్దకు వస్తుంది,వచ్చి వాళ్ళను సీరియస్ గా చూస్తూ

అమ్మాయి : ఏమి అన్నారు? ఇంకో సారి

చెప్పండి? అని అరుస్తుంది, చెప్పండి మర్యాద గా ,

కార్తీక్ , వివేక్ ఇద్దరూ వణుకుతూ.... మేము ఏమి

అనలేదు మేడం.

అమ్మాయి : లేదు మీరు నన్ను ఎదో అన్నారు?

మర్యాద గా చెప్పండి?

కార్తీక్ : నేను అబ్బా.. ! అన్నాను....

వివేక్ : సూపర్... . ఫిగర్ ..... అని నేను అన్నాను!

అంతే మేడం !

ఆ అమ్మాయి వాళ్ళ వంక చూస్తూ

అమ్మాయి : నేను అంత సూపర్ గా ఉన్నానా?

వివేక్ : తల పై కెత్తి ఆమె వంక చూస్తూ .. మీరేమి

అనుకోనంటే కత్తి లాంటి ఫి...గ....ర్ అండీ..

ఆ అమ్మాయి వాళ్ళ వైపు చూస్తూ

అమ్మాయి : డేర్ వచ్చినట్టు ఉందే?

కార్తీక్ : నిన్ను చూస్తుంటే .. డేర్ ఏమిటి ..ఏదైనా

వచ్చేస్తది అంతే !

ఆ అమ్మాయి వాళ్ళ వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వి

అమ్మాయి : మై నేమ్ ఈస్ లహరి అని చెయ్

ఇస్తుంది

ఇద్దరూ ఆమె చేయి ని గట్టిగా పట్టుకొని ఐ యామ్

కార్తీక్, ఐ యామ్ వివేక్ అని లహరి చేతులు ని

పట్టుకొని ఉంటారు..

లహరి : ఇంక చాలు వదలండి అని ముగ్గురు అక్కడే

పచ్చని గడ్డిలో కూర్చొంటారు.

లహరి : మీరు ఏమి చేస్తుంటారు?

కార్తీక్ : నేను టైమ్ సెట్టర్ ని

లహరి : అంటే?

కార్తీక్ : అన్నీ వాచెస్ లో టైమ్ కరెక్ట్ టైమ్ పోతుంది

లేదో చూస్తూ ఉంటా...

లహరి : హో.. గ్రేట్ జాబ్..

వివేక్ : నేను ఎయిర్ ఫోర్స్ లో ట్రాఫిక్ కంట్రోల్ చెస్తూ

ఉంటా !

లహరి : ఎయిర్ ఫోర్స్ లో ట్రాఫిక్?

వివేక్ : అదేనండి ఫ్లైట్ లు పైన ట్రాఫిక్ జాం కాకుండ,

ఆపి పంపిస్తూ ఉంటాను.. మరి మీరేం చేస్తారు?

లహరి :హా.. నాదేముంది లెండి మీ జాబ్స్ తో

పోలిస్తే, ఎదో ఫ్రీ లాంచర్..

కార్తీక్ : ఫ్రీ లాంచర్ ?

లహరి : అదేనండి ఇక్కడ ఎవరు తప్పులు ,పాపాలు

చేస్తున్నారో, వాళ్ళ డీటెయిల్స్ యమధర్మరాజు కి

మెయిల్ చేస్తూ ఉంటా...

వివేక్ : ఇంక ఆపండి అందరూ అందరమే ! అని

అందరూ. నవ్వు కుంటారు ! మేము ఇద్దరం

చిన్నపటి నుండి ఫ్రెండ్స్, ఇద్దరం బీటెక్ చేసాము.

జాబ్ ట్రైల్స్ లో ఉన్నాము.

లహరి : హో... ఇంట్రస్టింగ్....

ఇంత లో

కార్తీక్ : నేను ఇప్పుడే వస్తా? అని ప్రక్కకు వెళ్లి ఫోన్

తీసి టీవీ లో వచ్చే

స్వామీజీ ! కి కాల్ చేస్తాడు.

స్వామీజీ : హలో...

కార్తీక్ : నా పేరు కార్తీక్ స్వామీజీ !నాకు ఈరోజు ఒక

అమ్మాయి పరిచయం అయినది ఆ అమ్మాయి నాకు

పడుతుందా? స్వామీజీ?

స్వామీజీ : నువ్వు ఏమి చేస్తూ ఉంటావురా?

కార్తీక్ : బీటెక్ అయిపోయింది స్వామీజీ. జాబ్ ఇంకా

రాలేదు.

స్వామీజీ : మీ నాన్న ఏమి చేస్తూ ఉంటాడు? మీకు

డబ్బులు బాగా ఉన్నాయా? నువ్వు అడిగినంత

డబ్బులు మీ వాళ్లు ఇస్తారా? బైక్ ఉందా? అది

కూడా లేటెస్ట్ మోడల్ ఉందా?

కార్తీక్ : హా .. అన్నీ ఉన్నాయ్ గురువుగారు..

స్వామీజీ : ఐతే ఆ అమ్మాయి నీకు పడుతుందిరా!

కానీ... నువ్వు ఆ అమ్మాయికి అడిగినవన్నీ

తీసివ్వాలి..నువ్వు ఏది తక్కువ చేసినా .. నీ

జాతకం లో, నీ లైఫ్ లో ఉండదు..

కార్తీక్ : సరే ! గురూజీ.....

స్వామీజీ : అడిగినవన్నీ ఇస్తుంటే యే అమ్మాయి

అయినా పడక ఎక్కడ కి పోతది?

కార్తీక్ వాళ్ళ దగ్గరికి వచ్చి కూర్చొంటాడు.

వివేక్ : నేను ఇప్పుడే వస్తాను అని ప్రక్కకు

వెళతాడు,వెళ్లి స్వామీజీ కి ఫోన్ చేస్తాడు, హలో

స్వామీజీ ! నా పేరు వివేక్ ఈరోజు ఒక అమ్మాయి ని

కలిసాను , ఆ అమ్మాయి ! నాకు సొంతం

అవుతుందా?

స్వామీజీ : నీలో కొన్ని దోషాలు లేకుండా చేసుకో..

నీకు ఆ అమ్మాయి సొంతం అవుతుంది నాయనా !

వివేక్ : ఏమి దోషాలు గురూజీ?

గురూజీ : చెపుతాను గుర్తుపెట్టుకో .. ఆ అమ్మాయి

పుట్టినరోజు కి గిఫ్ట్ నువ్వే ఇవ్వాలి, వాళ్ళ నాన్న

పుట్టినరోజు కీ, వాళ్ళింట్లో వల్ల అందరి పుట్టినరోజు

లూకి నువ్వే గిఫ్ట్స్ ఇవ్వాలి, నీ పుట్టినరోజు కీ

కూడా ఆ అమ్మాయి కే గిఫ్ట్, నైట్ రైడ్స్

బ్యూటీ పార్లర్ బిల్లు, రోజూ చాటింగ్, ఫోన్ ఎప్పుడు

చేస్తే అప్పుడే ఫస్ట్ రింగు కే ఎత్తాలి, షాపింగ్, ఆన్

లయన్ ఫుడ్ ఆర్డర్స్ అన్నీ ఇవన్నీ తప్పకుండా

పాటించు దోషాలు పోయి నీ సొంతం అవుతుంది.

వివేక్ : అలానే ! గురూజీ ! నాకు సొంతం అవుతుంది

కదా?

గురూజీ : (గురూజీ తనలో తాను ఇవన్నీ చేస్తే

సన్నీలియాన్ .... కూడా సొంతం అవుతుంది ).

వివేక్ వచ్చి వాళ్ళతో కూర్చోటాడు. వివేక్, కార్తీక్

ఇద్దరూ మొఖాలు సుర్యకాంతి లాగా మెరిసి

పోతుంటాయి , అదే పనిగా లహరి ని చూస్తూ

ఉంటారు.

లహరి : ఏమిరా ! నన్ను కళ్ల తోనే తినేస్తారా !

అనగానే ఇద్దరూ ఈ లోకం లో కి వస్తారు.

లహరి : మీరు నన్ను తిని ఆకలి తీర్చుకున్నారు మరి

నాకు ఐస్క్రీమ్ కావాలి?

అడగగానే ఇద్దరూ వెళ్లి ఐస్క్రీమ్ తెస్తారు .

ఐస్క్రీమ్ తింటున్న లహరి ని కార్తీక్ ఒక చేతిని

వివేక్ ఇంకో చేతిని పట్టుకొని ఒకేసారి ఐ లవ్ యూ.

అని చెపుతారు ! లహరి ఇద్దరి వంక సీరియస్ గా

చూస్తుంది,.చూసి

లహరి : ఐ 2 లవ్ యూ... అని అంటుంది.

కార్తీక్,వివేక్ ఒక్కసారి గా అదేంటి? లవ్ అంటే

ఒక్కరినే చెయ్యాలి గా ?.. ఐ two లవ్ అన్నావ్?

లహరి : అది మీరే డిసైడ్ అవ్వండి ఎవరిని

చెయ్యాలో?

( ఇంకాఉంది )


Rate this content
Log in

Similar telugu story from Romance