ఫిగర్ 3
ఫిగర్ 3


కార్తీక్ : అదేదో నువ్వే చెప్పు లహరి?
లహరి : ఐతే రేపు నన్ను ఎవరు పబ్ కి తీసుకొని
వెళ్లి నన్ను హ్యాపీగా ఉంచుతారో వాళ్ళని సెలెక్ట్
చేస్తాను,
ఇద్దరూ సరే ..మరి అని రేపు ఇదే టైమ్ కి.,అని
చెప్పేసి వెళతారు.
తరువాత రోజు అదే సమయానికి పార్క్ లో
లహరి బాగా రెడీ అయి ఉంటుంది. కార్తీక్, వివేక్
ఇద్దరూ అక్కడకు వస్తారు వాళ్ళను చూడ గానే
లహరి : హాయ్ మీకోసం వెయిట్ చేస్తున్న ..
వీళ్ళు ఇద్దరూ కూడా హాయ్ అని అంటూ తమతో
తాము ఇంత అందం నా సొంతం అవ్వ బోతుంది
అనుకొని మురిసి పోతారు.
లహరి : మరి పబ్ కి పోదామా?
పబ్ లో నేను కోరింది ఎవరు ఇస్తారో వాళ్ళ ని లవ్
చేస్తా ఓకే నా?
అందుకు ఇద్దరూ ఓకే అంటారు.
లహరి : సరే మరి వెళ్దామా కార్ బుక్ చేయండి ?
వివేక్ : పబ్ ప్రక్కనే కదా కార్ ఎందుకు?
లహరి : పబ్ కార్ లో పోతేనే వాల్యూ..
కార్తీక్: మొబైల్ లో vola లో కార్ బుక్ చేస్తాడు ,
లహరి: కార్తీక్ బాగా హుషారుగా ఉన్నావ్ మనీ
ఎంత తెచ్చావ్ ?
కార్తీక్ : 2500/-అంటాడు, హా.. గుడ్,
లహరి : మరి నువ్వు ఎంత తెచ్చావ్ వివేక్ ? నేను
కూడా 2500/- ఓహ్.. వెరీ వెరీ గుడ్. మరి ఇంకేం
ఐస్క్రీమ్ పార్లర్ కి వెళ్దాం పదండి ,
వివేక్, కార్తీక్ అదేంటీ ఆలా అంటావ్?
లహరి : మీరు తెచ్చిన మనీ కి ఐస్క్రీమ్ పార్లర్ రే
ఎక్కువ.
కార్తీక్ : మరి ఎంత కావాలి పబ్ కి వెళ్లాలంటే?
లహరి :కనీసం పదివేలు అయినా కావాలి?
వివేక్ : ఐతే రేపు తెస్తాము అని అంటారు.
లహరి : వెరీ గుడ్ వాళ్ళ వంక సెక్సీ గా చూస్తూ ఐ
లవ్ యూ టూ...
కార్తీక్, వివేక్ ఆనందంతో ఓకే రేపు ఇదే టైం కి
వచ్చేస్తాం.. అని అక్కడ నుండి బయలు దేరబోతారు
లహరి : ఒక్క నిమిషం మీకు ఈ మనీ ఎలా
వచ్చింది
కార్తీక్ : కార్తీక్ బుక్స్ కొనాలి అని ఇంట్లో తీసుకున్న,
లహరి : మరి మిగతా మనీ ..?
కార్తీక్ : హా.. అదేముంది ఎదో కోర్స్ చెయ్యాలని
చపుతా ఇంట్లో వాళ్లు పంపిస్తారు.
లహరి : మరి కోర్స్ గురించి అడిగితే
కార్తీక్ : అదేముంది వాళ్లకేం తెలుసు జాబ్ రావాలంటే
కోర్స్ చెయ్యాలి అని చెపుతా ఎంత కావాలన్న
పంపుతారు. ఇదంతా నీకు ఎందుకు నేను మనీ
తెచ్చుకొంటా.
లహరి : ఓకే.. ఓకే ! మరి నీకు వివేక్ ?
వివేక్ : ఎదో ఎంట్రన్స్ రాయాలి అని
అపద్దం చెప్పి ఇంట్లో తీసుకున్న...మిగతా నా ఫ్రెండ్స్
ని అడిగి అప్పు తీసుకొంటాలే...
లహరి : క్లాప్స్ కొడుతూ, నవ్వుతూ నన్ను మీరు
నిజంగా లవ్ చేస్తున్నారా?
అవును అని ఇద్దరూ సమాధానం చెపుతారు.
లహరి : అలాగైతే నేను చెప్పేది వినండి , మీ ఇంట్లో
వాళ్ళని మోసం చేసిన మనీ తోనో , అప్పు చేసిన
మనీ తోనో గాని నేను రాను,మీరు సంపాదించి న
మనీ తో నే నన్ను తీసుకు వెళ్ళాలి.. అలా
అయితేనే ! నన్ను మీరు ట్రూ లవ్ చేస్తునట్టు అలా
కాక పోతే బ్రేకప్ చేసుకోండి . నేను ప్రతి రోజు ఇదే
టైం కి ఇక్కడే ఉంటాను మీరు సొంతగా ఎప్పుడు
సంపాదిస్తే అప్పుడే ? రండి నేను మీ కోసం ఎదురు
చూస్తూ ఉంటాను... ఓకే నా ?
ఇద్దరూ నీరసం గా లహరి వైపు చూస్తారు
లహరి : అమాయకంగా మొఖం పెట్టి ఐ లవ్ యూ
two ...... ము.. ము.. ము..... అని ఫ్లైయింగ్ కిస్సెస్
ఇస్తుంది.
( ఇంకాఉంది )