Director Kashi

Romance

2.8  

Director Kashi

Romance

ఫిగర్ 1

ఫిగర్ 1

2 mins
508


కార్తీక్, వివేక్ ఇద్దరూ మంచి స్నేహితులు, ఇద్దరూ ఇంజినీరింగ్ పూర్తి చేసి జాబ్ ట్రైల్స్ లో ఉంటారు. ఒకరోజు ఇద్దరూ కలిసి ఒక పార్క్ కి వెళతారు,

వివేక్ : అరేయ్ ! కార్తీక్ లైఫ్ చాలా బోర్ కొడుతోంది రా !

కార్తీక్ : అవునా ! బోర్ కొడితే బోర్లు వెయ్యచ్చు గా !

బాగా ప్రాఫిట్ వస్తుంది.

వివేక్ : అబ్బా ! పంచా?

కార్తీక్ : కాదు ! జీన్స్ ప్యాంటు...

వివేక్ : అబ్బో ! ఏమి బ్రాండో?

కార్తీక్ : ఆటో రాంప్రసాద్ బ్రాండ్ అని ఈ మధ్య

మార్కెట్ లో బాగా నడుస్తుంది లే !

వివేక్ : ముక్కు కట్చెఫ్ తో మూసుకొంటూ ఇక

ఆపరా !నువ్వు, నీ కుళ్ళు జోక్స్ ! మరీ కుళ్ళు వాసన

వస్తున్నాయి.

వీళ్ళు ఇద్దరూ ఇలా మాట్లాడు కొంటున్నారు, వీళ్ళ

చుట్టూ అక్కడ అక్కడ ప్రేమజంటలు వాళ్ళ పనిలో

వాళ్ళు ఉన్నారు ! అప్పుడే ఒక అందమైన అమ్మాయి ,

కార్తీక్, వివేక్ వాళ్లకి ఎదురు గా నిలబడి ఉంటుంది. ఆ

అమ్మాయి వైపు ఇద్దరూ చూస్తారు !ఆ అమ్మాయి

వీళ్ళ వైపు చూసి ఒక చిరునవ్వు నవ్వుతుంది.

వివేక్ : ఆ అమ్మాయి నాకు పడేటట్లు ఉంది రా! కార్తీక్ !

కార్తీక్ : అబ్బా ! చ్ఛా !నీకు పడేటట్లు అనిపిస్తుందా !

ఏమో? నాకు అయితే ఆల్రెడీ పడిపోయింది.

కావాలంటే నన్నే చూస్తుంది చూడు !

వివేక్ : ఏం కాదు! నన్నే చూస్తోంది! మాది వెయ్యి

జన్మల బంధం లాగా! అనిపిస్తుంది.

కార్తీక్ : అరేయ్ ! అమ్మాయి కోసం మన ఫ్రెండ్ షిఫ్

చెడిపోకూడదు రా ! ఆ అమ్మాయి ని నువ్వే

చూసుకో ! నీ కోసం దానం చేస్తున్న నా పర్సనాలిటీ

కి ఎంత మంది అమ్మాయిలు అయినా పడతారు ,

నీకు ఏ అమ్మాయి పడదు కదా !

వివేక్ :అబ్బా !చ్ఛా ! నేనే నీకు వదిలేస్తా తీసుకో !నాకు కో ... అంటే ! కోటీ మంది అమ్మాయిలు క్యూ లో

నిలబడతారు.

కార్తీక్ : అలాగైతే ఒక్కసారి కో అనరా! బాబు , ఆ

క్యూ లో వెతుకు కుంటాను !

వివేక్ : క గుణింతం మర్చిపోయా లే రా! గుర్తుకు

వచ్చాక అంటాను.

కార్తీక్ : సోది ! ఆపి ఈ అమ్మాయి సంగతి ఏమిటో

చూద్దాం !

వివేక్ : ఆ అమ్మాయి నే అడుగుదాం ? ఆ అమ్మాయి !

ఎవరిని ఇష్టపడితే వాళ్ళకే ! నువ్వు వెళ్లి ట్రై చెయ్ !

నీ వల్ల కాకపోతే నేను ట్రై చేస్తాను !

కార్తీక్ : సరే ! రా ! అని లేచి ఆ అమ్మాయి దగ్గరికి

వెళతాడు, హాయ్ ! అండీ నా పేరు కార్తీక్, ఆ

అమ్మాయి సీరియస్ గా కార్తీక్ వైపు చూస్తుంది,కార్తీక్

భయపడతాడు, తనలో తాను ఈ అమ్మాయి ల

చూపులో ఏఁవుంద్దో కనుక్కోవడం చాలా కష్టమే?

ఇప్పటి వరకు జన్మ జన్మ ల బంధం లాగా

చూసింది ! ఇప్పుడు దగ్గరికి వచ్చాక అసలు తెలీనట్టు

బిహేవియర్ చేస్తుంది. ఇంతకీ నన్ను కాకుండా వివేక్

ని చూసిందేమో ! అనుకొంటూ ఆ అమ్మాయి వైపు

చూస్తాడు. ఆ అమ్మాయి వివేక్ కూర్చున్న వైపు

చూస్తూ నవ్వుతూ ! ఉంటుంది. కార్తీక్ ,వివేక్ వైపు

చూస్తాడు ! వివేక్ కాలర్ ఎగరవేసి హ.. హ. అంటూ

అక్కడ నుండి లేచి అమ్మాయి దగ్గరకు హుషారుగా

వస్తాడు !వివేక్ దగ్గర కు వస్తున్నాడు అనగానే ఆ

అమ్మాయి చేతులు ఛాసుతుంది వివేక్ దగ్గర కి వచ్చి

హగ్ ఇద్దామనే టైం లో వివేక్ వెనకాల నుండి ఒక

అబ్బాయి వచ్చి ఆ అమ్మాయి ని హగ్

చేసుకొంటాడు!ఇది ఒక్క క్షణం ముందు గమనించి

అమ్మాయి పక్కన ఉన్న కార్తీక్, వివేక్ ని హగ్

చేసుకొంటాడు.

వివేక్ : వామ్మో ! ఎంత ప్రమాదం తప్పింది !అరేయ్

కార్తీక్ నువ్వు వచ్చి హగ్ చేసుకోకుంటే నేను

ఆ అమ్మాయి ని హగ్ చేసుకునేవాడిని నన్ను కుళ్ళ

పొడిసేవారు . మన మొఖాలకు యే అమ్మాయి

పడదు మనం లైఫ్ లాంగ్ బోర్లు వేసుకొని

బ్రతకాలసిందే ? రా ! ఇంక మనం యే అమ్మాయి

జోలికి వెళ్లొద్దు ! బుద్ధి గా జాబ్ చూసుకొందాం !

అనిఒకరిని ఒకరుపట్టుకొని , అనుకొంటూ ఉండగా ,

కిల కిల మని నవ్వు వినిపిస్తుంది ఇద్దరికీ , ఇద్దరూ

ఒక్కసారి గా అటు చూస్తారు? అప్సరస లాంటి

అమ్మాయి వీళ్లనే చూస్తూ నవ్వుతూ ఉంటుంది.

(ఇంకా ఉంది )


Rate this content
Log in

Similar telugu story from Romance