పెళ్ళిచూపులు..
పెళ్ళిచూపులు..
ప్రశాంత్ వస్తాడంటావా? స్నేహితురాలు అడిగిన ప్రశ్నకు చిత్ర సమాధానం చెప్పలేదు.
అంతలో విక్రమ్ వస్తాడు. చిత్రా! నా వల్ల తప్పు జరిగింది. జరిగింది మర్చిపో. మనం ఎప్పటిలానే ఉందాం అంటాడు.
విక్రమ్ మాటలు విని చిత్ర స్నేహితురాలు అతడి మీద కోప్పడుతుంది.
విక్రమ్ మాటలకి చిత్ర కొంచెం ఆలోచిస్తుంది. విక్రమ్ డబ్బులు తాను ఇన్వెస్ట్ చేస్తాననీ, ఫుడ్ ట్రక్ గురించి గుర్తు చేస్తాడు.
చిత్ర కొంచెం ముందుకు వెళుతుంది. తన కోసమే వస్తోంది అనుకున్న విక్రమ్ సంతోషంగా చేయిని ముందుకు చాపి నవ్వుతాడు.
అంతలో చిత్ర అతడి వెనుక ఉన్న ప్రశాంత్ కి షేక్ హ్యాండ్ ఇస్తుంది.
ఏంటి చిత్ర గారూ! నేను రానని ఫిక్స్ అయ్యారా అంటాడు.
నీకు వేరే ఆప్షన్ లేదని నాకు తెలుసు అని నవ్వుతుంది.
చిత్ర స్నేహితురాలు విక్రమ్ ని ఇక వెళ్ళమని చెబుతుంది.

