పేదరికం వర్థిల్లాలి
పేదరికం వర్థిల్లాలి
ఎవర్రా అది అని నిద్రలో అరుస్తూ లేచాడు మూర్తి. తన మీద తనకే ఓ క్షణం జుగుప్స కలిగింది.
ప్రభుత్వం పేద వారికి ఉచితంగా మరుగు దొడ్లు నిర్మించి ఇచ్చే పథకం అతడి కనుసన్నల్లో నడుస్తోంది.
అన్ని ఊళ్ళల్లో ఎక్కువ మంది పేదవారు ఉన్నట్టు చూపించి, వాళ్లకు ఈ పథకం కింద డబ్బులు మంజూరు చేసినట్లు ఆధారాలు కల్పించాడు. డబ్బు బాగానే మిగిలింది.
ఇంకొక్క ఊరే మిగిలింది. అదేమో తన సొంత ఊరు. ఎలా ఇక్కడ లేని పేదరికాన్ని చూపించడం.
అయినా పేదరికం అంటూ లేకపోతే, ఆ పథకాల డబ్బుల్ని ఎలా నొక్కేయగలం.. పేదరికం వర్థిల్లాలి అంటూ తను అరుస్తున్నట్టు కల గని నిద్రలో లేచి కూర్చున్నాడు. పేదరికం లేని వ్యవస్థ ఉంటే ఎలా అని ఆలోచిస్తున్నాడు మూర్తి..
