Tanmayi Sudha

Abstract

4.6  

Tanmayi Sudha

Abstract

ఒక్క క్షణం !!!

ఒక్క క్షణం !!!

2 mins
334


జీవితం మనకి ఎన్నో ఇస్తుంది...తీపి జ్ఞాపకాలు...చేదు అనుభవాలు... కానీ కొన్ని జ్ఞాపకాలు జీవితం లో నుంచి తీసేయాలి అనుకునే కొద్ది ఇంకా మన గుండె లోతుల్లోకి గుచ్చుకుంటాయ్... అలాంటి వాటిలో నుండి ఒకటి.....


ఎప్పుడు చురుకు చలాకీగా ఉండే నాకు నిశ్శబ్దం అంటే ఏమిటో తెల్సింది తన వల్ల .....అందర్నీ నవ్విస్తూ ఉండే నాకు బాధ అంటే ఏంటో తెల్సింది తన వల్ల.... ఎప్పుడు ప్రేమ అలికిడి రాని గుండెల్లో ప్రేమ పుట్టినది తన వల్ల.....


అడగనదే అమ్మ ఐన పెట్టదు అన్న సామెత ఎలా ఉన్నా...... నేను ప్రేమిస్తూన్న అని చెప్పనిదె మనకి తిరిగి ప్రేమను ఎవరు ఇవ్వరు.... ఇది తెలియకే కదా నా కళ్లల్లో సమస్త సముద్రాన్ని.... నా మనసులో ఒక పర్వతాన్నె మోస్తున్న....


అనుకోని ఒక రాత్రి..... ఒంటరి గా భయం తో వెళ్తున్న నాకు తోడు నడిచావు..... భయం తో నిండిన మనసులో ధైర్యాన్ని నింపావు ..... నా పక్కనున్న నీలో మా నాన్న ని చూసేలా చేసావు.... ఏ అమ్మాయి ఐన తన నాన్న ల చూసేవాడినే గా కావాలి అనుకుంటాది....


అప్పటి నుండి ఏదో తెలియని ఆనందం నిన్ను చూస్తే.... ఏదో తెలియని భయం తిరిగి నువ్వు నన్ను చూస్తే..... ఏమిటో ఈ ప్రేమ దగ్గర అయితే బావుంటాది అనిపిస్తుంది కానీ పక్కకి వచ్చినా గుండె భయం తో గట్టిగా కొట్టు కుంటుంది......


ఎన్నో సార్లు చూసా నీకు చెప్పుధామూ అని కానీ చెప్పాలేక పోయా........అప్పటికే నా మనసు నాకు ఏదో చెప్పింది..... కానీ నేనే వినలేదు..... ఆ రోజు రానే వచ్చింది..... నా ఆశ లని ముంచే స్తూ.....నా మనసులో ఉన్న అమ్మమాయ్ పేరు చెపు తాను అన్నాావు.....ఎవరో అమ్మాయి పేరు చెప్పి... ఎన్నో ఆశల తో చూస్తున్నా కళ్లలో కన్నీళ్ళు నింపావు.... నా గుండెల్లో భారం పెంచావు..... నా మనసు మాట విన నందుకు ...... దాని ముందు నన్ను తల వంచేలా చేసావు.....


నాకు తెలుసు నువ్వు నా సొంతం కావు అని..... కానీ ఈ పిచ్చి మనస్సు కి అర్ధం కావట్ల..... నాకు తెలుసు ని మనసులో నేను ఉండలేను అని....కానీ ఈ గుండెకి చెప్పలేక పోతున్న..... ని జ్ఞాపకాలను చెరప లేక పోతున్నా...... పిచ్చి ప్రేమ.... నువ్వు వస్తావు అని ఇంకా ఎదురు చూస్తుంది.....


ఒక్కక్షణం నా మనసు మాట విని నీకు నా మనసులో ఉన్న మాట చెప్పి ఉంటే నువ్వు ఇప్పుడు నా పక్కన ఉండే వాడివి ఏమో....... ఇప్పుడు మన ప్రేమ కథని ఇలా ఫోన్ లో బాధతో రాయడం కాకుండా ని నా చేతితో మన భవిష్యత్తు ని రాసె వాళ్ళము......


Rate this content
Log in

Similar telugu story from Abstract