STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama Tragedy

4  

Dinakar Reddy

Abstract Drama Tragedy

ఒక ప్రయాణం..

ఒక ప్రయాణం..

1 min
627

కొత్తకారు కీస్ తీసుకుని ఇంకా రెండు నిమిషాలే అయ్యింది. కాస్త నెమ్మదిగా వెళ్ళు విజయ్ అని భర్తను హెచ్చరించింది మేఘ.


ఎన్నాళ్ళ డ్రీమ్ ఇది. మనం ఎన్నిసార్లు కారు కొనుక్కుందాం అని పోస్ట్ పొన్ చేసుకున్నాం. కాస్త ఎంజాయ్ చెయ్యనీ డియర్ అని కారు వేగంగా పోనిచ్చాడు విజయ్.


అటు వైపు నీరజ, వెంకట్ ఇద్దరూ బైక్ మీద వస్తున్నారు.

పెళ్లి కార్డులు కాబోయే భార్యతో కలిసి పంచడం నిజంగా బాగుంది అన్నాడు వెంకట్ నీరజతో.

ఆమె అతడి వీపు మీద మెత్తగా కొట్టింది.


మలుపు తిరిగి ముందుకు వెళ్ళబోయి విజయ్ సడెన్ బ్రేక్ వేశాడు.


ఆ రోడ్డులో లైటింగ్ సరిగ్గా లేకపోవడం వల్ల బైక్ దగ్గరికి వచ్చేంతవరకూ విజయ్ కి తెలీలేదు. సడెన్ బ్రేక్ వేసినా అప్పటికే బైక్, కారు రెండూ ఢీకొన్నాయి.


ఐదు నిమిషాల్లో ఆ ప్రదేశం మొత్తం అంబులెన్స్ సైరెన్ తో, చుట్టూ మూగి చూసే గుంపుతో నిండిపోయింది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract