STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

ఒక అసంపూర్ణ ప్రేమ కథ

ఒక అసంపూర్ణ ప్రేమ కథ

1 min
640

పిచ్చి మొహమా! ఇంకా ఎందుకే వాడి కోసం చూస్తావు. వాడు రాడు. ఇక ఏడ్చింది చాలు అంటూ వర్షంలో నిలబడి ఏడుస్తున్న ఫ్రెండ్ కి చెప్పింది కళ్యాణి.


మాధురి అలానే రోడ్డు మీద నిలబడి దిక్కులు చూస్తోంది. రా. నీకు బ్రేకప్ చెప్పిన ప్రియుడు నిన్ను వదిలేసి ఏం చేస్తున్నాడో చూపిస్తాను అంటూ తన స్కూటీ మీద మాధురిని ఎక్కించుకుని సతీష్ రూం దగ్గరికి తీసుకెళ్ళింది.


రూం లో సతీష్ ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన పార్టీ జరుగుతోంది. అయినా ఇప్పటికి రెండు సార్లు బ్రేకప్ చెప్పినా నీ చుట్టూ తిరుగుతుందేంట్రా అది.. అంతగా ఏం చెప్పావ్ అన్నారు ఒకరు.


మనవాడి స్మైల్ కే పడిపోతున్నారు అందరూ. ఆ అమ్మాయి కూడా అంతే అన్నాడు మరొకరు.


సతీష్ మందు తాగుతూ నవ్వుతున్నాడు. మనదంతా సింపుల్ మచ్చా. మాట్లాడామా? మేటర్ జరిగిందా? రెండు రోజులు ఇద్దరికీ షో ఆఫ్ చేసుకోవడానికి అవకాశం దొరికిందా. అంతే. 


ఈ పిల్ల మరీ ఎక్కువ అటాచ్ అయ్యింది. అందుకే రెండు సార్లు బ్రేకప్ చెప్పినా ఇంకా తనకి అర్థం కావట్లేదు అని చెప్పాడు.


ఇవన్నీ పెంట్ హౌస్ బయట నుంచే వినిపించి మాధురిని వెనక్కి తీసుకెళ్ళిపోయింది కళ్యాణి.


కానీ... అతను మళ్లీ నన్ను వెతుక్కుంటూ వస్తాడు అని అంది మాధురి. కళ్యాణి తల బాదుకుంది.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract