న్యాయం జరిగిందా???
న్యాయం జరిగిందా???


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య ఉదంతం భాగ్యనగరం తో పాటు మనల్ని కూడా ఉలికిపడేటట్లు, భయభ్రాంతులకు గురిచేసింది ఎప్పటిలాగానే ప్రజలు నిరసనలతో న్యాయం జరగాలంటూ ర్యాలీలు నిర్వహించారు సోషల్ మీడియాలో నిరసనలను అభిప్రాయాలను తెలుపుతూ మన మద్దతును కూడా ప్రకటించాము. దిశ కాపాడండి... కాపాడండి... అని దీనంగా మొరపెట్టుకున్నా వినని ఆ దేవుడు మన అందరి మొరలను విని సజ్జనార్ రూపంలో నిందితులను ఎన్కౌంటర్ చేయించి తన బాధ్యతను పూర్తి చేసాడు మంచి పని జరిగింది, న్యాయం చేశారు అంటూ అందరూ ఆనందం వ్యక్తం చేశారు కానీ ఆలోచిస్తే ఎక్కడో ఒక అసంతృప్తి, చిన్న భయం,దిగులు మనసులో తిరుగుతూనే ఉన్నాయి.దిశను ఆ నలుగురు నరరూప రాక్షసులు అంత చిత్రహింసలు పెట్టి నరకం చూపించి కాల్చిచంపారు మరి అటువంటి వాళ్ళు చిన్న తూటాతో సునాయాస మరణం పొందారని నాతో పాటు మీ అందరికీ బాధ ఉందని అనుకుంటున్నాను ఎందుకంటే ఎన్కౌంటర్ జరిగింది అని వార్త పేపర్లో చదవగానే అంత సంతృప్తి కలగలేదు చచ్చారు వెధవలు శిక్ష పడింది ఇలా అనిపించిందే తప్ప పూర్తిగా న్యాయం జరిగింది అన్న భావన నాకు కలుగ లేదు. ఎన్కౌంటర్ కరెక్టా! కాదా? ఉరిశిక్ష వేయాల్సింది, నడిరోడ్డు మీద కాల్చి చంపాలి ఇలా ఏవేవో చర్చలు అభిప్రాయాలు మీడియాలో వినిపిస్తున్నాయి అసలు సమస్యకు మూలం వదిలేసి అనవసరమైన చర్చ జరుగుతుంది ఏమో అనిపిస్తుంది అన్యాయం జరిగింది... నిరసనలు... ఎన్కౌ
ంటర్... చర్చలు... అంతే అందరూ విషయాన్ని మరిచిపోతున్నారు. మళ్లీ ఇలాంటిది ఏదైనా జరిగితేనే మరల గొంతు ఎత్తుతున్నారు. నా ఉద్దేశం ప్రకారం సమస్యకి మూలమైన వ్యవస్థ, చట్టాల్లో మార్పులు తీసుకురావాలి ఆ మార్పు చర్చలు, ర్యాలీలు, నిరసన, బందులు చేస్తే వచ్చేది కాదు ప్రజలలో విప్లవం రావాలి ఏమి చేస్తే ఈ వ్యవస్థ మారుతుంది ఇలాంటివి పునరావృతం కాకుండా ఉం టాయి అని ఆలోచించి మూలానికి మందు వేయాలి. మార్పు వచ్చేవరకూ విప్లవం ఆగకూడదు చర్చలతో ఉపయోగం లేదు చట్టాలలో మార్పు రావాలి. నిరక్షరాస్యతను నిర్మూలించాలి. విద్యావిధానంలో మార్పులు రావాలి. నీలి చిత్రాలను నిషేధించాలి. చట్టాలు చుట్టాలు కాదు మన అందరికీ సమానమే అని నిరూపించాలి. ఎన్కౌంటర్ వలన తాత్కాలిక ఉపశమనం కలిగినా మళ్ళీ ఇలాంటి చీడ పురుగులు పుట్టి చిగురుటాకులను చిదిమేస్తునే ఉంటాయి.తప్పు చేస్తే శిక్ష కఠినంగా ఉండాలి అవి ఆడపిల్లలలో ఆత్మస్థైర్యాన్ని నింపాలి.
దిశా ఘటన ఆ నలుగురు చేసిన తప్పు వలన ఐదు కుటుంబాలు చిన్నాభిన్నం అయిపోయాయి వాళ్ల ఇళ్లల్లో, మనసుల్లో తీవ్ర విషాదం నెలకొంది వాళ్ళ పై ఆధారపడిన బ్రతుకులు చింద్రం అయిపోయాయి వేలెత్తి చూపే సమాజంలో తలదించుకుని బ్రతికేలా ఆ కుటుంబాలకు పరిస్థితి ఏర్పడింది.జీవితాంతం వాళ్ల జీవితాలలో ఈ విషాదం తాలూకా చీకట్లు అలుముకునే ఉంటాయి..నేరం చేసింది ఎవరు?? శిక్ష పడింది ఎవరికి?? మరి న్యాయం జరిగింది అంటారా???