నిన్ను అర్థం చేసుకో
నిన్ను అర్థం చేసుకో


అదో చిత్రమైన స్థితి.నేనేం చెప్పినా ప్రతి ఒక్కరికీ నవ్వులాటలా ఉండేది.
ఎంత సీరియస్ గా ఉన్నా నా అభిప్రాయాల్ని నా ఆశయాల్ని ఎవ్వరూ గౌరవించేవారు కాదు.
నా ప్రతి అలవాటుకూ ప్రతికూలత బహుమతిగా లభించేది.చాలా నెలలు ఏడుస్తూ గడిపాను.
మొట్టమొదట నన్ను నేను గమనించుకున్నాను.నేను ఎదుర్కొంటున్న సమస్య అతిగా ప్రక్క వారి మీద ఆధారపడడం.
డబ్బు కోసం కాదు.ఆనందం కోసం.ఎప్పుడూ అవతలి వారి గురించే ఆలోచించి వారు ఏమనుకుంటారో వారి దగ్గర నా పేరు చెడిపోతుందేమో అనే ఆలోచనలతో ఎవరేది చెప్పినా చేసేవాడిని.
నాకంటూ పర్సనల్ టైం లేకుండా చేసుకోవడం అవతలి వాళ్ళు ఏ కాస్త అవాయిడ్ చేసినా నాలోనే తప్పుంది అని బాధపదేవాడిని.ఎప్పుడూ ఆందోళనగా ఉండేవాడిని.
మొదట నాతో నేను ఒంటరిగా గడపడం నేర్చుకున్నాను.వ్రాయడం నాకు మంచి రిలాక్స్ చేసే అలవాటుగా అనిపించింది.
నాతో నేను ఆనందంగా ఉండడం అలవాటు చేసుకున్నాక ప్రక్క వారి మూడ్స్ మీద ఆధారపడడం మానేశాను.
దాంతో నా ఆందోళన తగ్గింది.ఆలోచనల్లో చురుకుదనం పెరిగింది.