STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

నేనెవరు?

నేనెవరు?

1 min
466

అయ్యా! నేనెవర్ని. అసలు మనిషంటే ఎవరు? ఆత్మ పరమాత్మ నుండి వచ్చినదే అయితే మరలా ఆ పరమాత్మనే చేరుకుంటుంది అనుకుంటే మనకు ఈ కష్టాలెందుకు? సుశీల నిద్దట్లో కలవరిస్తోంది.


పక్క బెడ్ మీద ఉన్న నీలిమ లేచి సుశీల ముఖం మీద నీళ్ళు చల్లింది. సుశీల ఉలిక్కిపడి లేచి ముఖం మీద పడిన నీటిని చేత్తో తుడుచుకుంది.


ఈసారి ఏ సినిమా చూసావే? నీలిమ లైట్ వేసి సుశీల పక్కనే కూర్చుంది. "దేవీ లలితాంబ" అని పాత బ్లాక్ అండ్ వైట్ పిక్చర్ అంది సుశీల.


అందులో లలితాంబ ఇలానే అసలు మానవుడు ఎందుకు పడుతున్నాడు, ఎందుకు చనిపోతున్నాడు అంటూ ఒక డైలాగ్ భలే చెప్తుంది అంది తనే మళ్లీ.


ఇంతకీ నువ్వెవరో తెలిసిందా? నీలిమ నిద్ర కళ్ళతో అడిగింది.


లేదే. నీగ్గానీ తెలుసా? అంది సుశీల. హా తెలిసింది. నువ్వు రూమ్మేట్ కాదు. కాలేజ్ మేట్ కూడా కాదు. పాత సినిమాలు చూసి నన్ను చావగొట్టి, నా నిద్ర చెడగొట్టే భూతానివి అని తన బెడ్ మీదకు వెళ్లి పడుకుంది నీలిమ.


హమ్మయ్య. ఇంకా నేను మనిషిని అని అంటావేమో అనుకున్నాను. రేపట్నుంచి విఠలాచార్య సినిమాలు చూసి నీకు భూతం కథలు చెప్తానే అని లైట్ ఆఫ్ చేసి పడుకుంది సుశీల.


దేవుడా! నన్ను కాపాడు అని నీలిమ దణ్ణం పెట్టుకుంది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract