STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

నాన్న - కొడుకు - సూపర్ హీరో

నాన్న - కొడుకు - సూపర్ హీరో

1 min
726

నాన్నా. నీకు తెలిసిన సూపర్ హీరో ఎవరు? అని అడిగాడు చింటూ. ఆరేళ్ళ వయసులో వీడికి సూపర్ హీరోల మీద ఆసక్తి ఉండడం మామూలే అనుకున్నాడు మాధవ్.


నేనూ చిన్నప్పుడు చాలా సూపర్ హీరోల కార్టూన్స్ చదివేవాణ్ణి. బ్యాట్ మ్యాన్. సూపర్ మ్యాన్. హీ మ్యాన్.

ఇలా చాలా మంది సూపర్ హీరోలంటే ఇష్టం ఉండేది.


వాళ్ళు పెద్ద పెద్ద విలన్లను కొడుతుంటే అవి చదివి వారి మీద ఆరాధనా భావం ఉండేది. అదంతా చిన్నప్పుడు అని చెప్పాడు మాధవ్.


మరి పెద్దయ్యాక? అన్నాడు చింటూ.


హహా అని నవ్వేశాడు మాధవ్. పెదయ్యాక మా నాన్న నాకు సూపర్ హీరోల కంటే ఎక్కువ అనిపించాడు.


ఎందుకు నాన్నా అన్నాడు చింటూ. అది పెద్దయ్యాక తెలుస్తుంది చింటూ. ఇప్పుడు నేను కూడా సూపర్ హీరోనే అన్నాడు మాధవ్.


అమ్మా. నాన్న సూపర్ హీరో అంట. గాల్లో ఎగురుతాడు ఇప్పుడు. అని చింటూ వాళ్ళ అమ్మని పిలిచాడు.

మాధవ్ నవ్వుకున్నాడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract