Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win
Turn the Page, Turn the Life | A Writer’s Battle for Survival | Help Her Win

M.V. SWAMY

Inspirational

3  

M.V. SWAMY

Inspirational

మహర్షి

మహర్షి

3 mins
385


'మహర్షి' సినీమా చూసి వచ్చిన తరువాత మనోడు బాగా మారిపోయాడు.వేకువజామునే నిద్రలేచి,పుస్తకాలు ముందేసుకొని చదువుతున్నాడు,మారాం చెయ్యకుండా బడి బస్సుకి బయలుదేరుతున్నాడు, బడిలో టీచర్లును అడిగా ఇంతకుముందులా కాదు ఇప్పుడు మీ వాడు క్రమశిక్షణతో బుద్ధిగా పాఠాలు చదువుతున్నాడు,రోజూ హోమ్ వర్క్ చేస్తున్నాడు,ఆట పాటల్లో సృజనాత్మక కార్యక్రమాల్లో చురుకుగా ఉంటున్నాడు అని వాళ్ళు చెబుతున్నారు,సినీమాలు పిల్లల్ని పాడుచేస్తాయి అనుకున్నాం కానీ కొన్ని సినిమాలు పిల్లల్ని బాగుచేస్తాయి అనిపిస్తుంది"అని అన్నాడు చంద్రం తండ్రి మోహన్ భార్య సురేఖతో


      "సినీమా చూసిన తరువాత కాదుగానీ ఈ మద్య వాడిలో చాలా మార్పు వచ్చిందండి,ఆ మద్య స్కూల్ వాళ్ళు ఫీల్డ్ ట్రిప్ కి లంబాడీ తండాలకు తీసుకొనివెళ్లారు కదా అక్కడ నుండి వచ్చాక,"తండాల్లో పిల్లలు బడికి శ్రద్దగా వెళ్తున్నారమ్మా...ఇంట్లో ఎన్ని కష్టాలున్నా బడిమానకుండా బడిలో చక్కగా చదువుకుంటున్నారు" అని,ఆ రోజు నుండి అల్లరి తగ్గించాడు,ఇంతకు ముందులా పిజ్జాలు బర్గర్లు కావాలని పట్టుబట్టడంలేదు, ఇంట్లో పెసరట్లు,మినపట్లు పుష్టిగా తింటున్నాడు"అని అంది సురేఖ భర్తతో


        మోహన్ సురేఖ దంపతుల పెద్దల స్వస్థలం విశాఖపట్నం,కానీ మోహన్ తలిదండ్రులు,సురేఖ తలిదండ్రులు సుమారుగా 40 సంవత్సరాలు క్రితమే బ్రతుకుతెరువుకై హైదరాబాద్ వలసవచ్చి, బ్రతుకు బాగుండటంతో ఇక్కడే స్థిరపడిపోయారు,ఇరు కుటుంబాలకీ దూరపు బంధత్వము ఉండటంతో వీళ్ల పెళ్లితో రెండు కుటుంబాలూ మరంత దగ్గరయ్యాయి.


             మోహన్ సురేఖ దంపతుల ఒక్కగానొక్క కొడుకు 'చంద్రం' చిన్నప్పటి నుండి అల్లారుముద్దుగా పెరిగాడు, అటు అమ్మమ్మ ఇంటిలో ఇటు నానమ్మ ఇంటిలో ఎవ్వరూ చిన్నపిల్లలుగానీ పెద్దపిల్లలుగానీ లేకపోవడంతో 'చంద్రం' పట్ల అందరికీ గారాభం ఎక్కువై,అల్లరి చిల్లరగా తిరగడం, పెద్దలు చెప్పినమాట వినకపోవడం, చదువుపట్ల శ్రద్ద చూపకపోవడం చేస్తుండేవాడు.స్కూల్ నుండి నిత్యం ఫిర్యాదులు వస్తుండేవి,"అసలు వీడితో వేగడం ఎలా" అని అందరూ తలలు పట్టుకుంటున్న సమయంలో సడన్ గా వాడిలో మంచి మార్పు వచ్చింది.


              " 'చంద్రం' ఇప్పుడు 9 వ తరగతి చదువుతున్నాడు, రేపు పదో తరగతిలోకి వచ్చిన తరువాత వాడు ఎప్పటిలాగే అల్లరి చిల్లరగా తిరిగితే వాడి భవిష్యత్తుకు మంచి పునాది పడేదెప్పుడు" అన్న దిగులుతో వుండేవారు ఇంట్లో ఉండేవారు.చంద్రం కూడా బాధ్యత లేకుండా ఉండేవాడు."వీడిని దారిలో పెట్టడం ఎలారా బాబూ"అని అందరూ తలలు పట్టుకుంటున్న తరుణంలోనే చంద్రంలో మార్పురావడం అందరినీ ఆశ్చర్యపరిచింది,అదే సమయంలో ఆనంద పరిచింది కూడా.ఇప్పుడు చంద్రం మంచి క్రమశిక్షణగల విద్యార్థి కావడం అందరినీ సంతోష పెడుతుంది.


               తెలంగాణా పల్లెలో ఉన్న చంద్రం మిత్రుడు తండ్రి నుండి చంద్రం తండ్రి మోహన్ కి ఫోన్ వచ్చింది."అయ్యా నా పేరు యాదగిరి, నా కొడుకు మీ పిల్లాడి దోస్త్ ,ఆ మద్య మీ పిలగాడు మా ఇంటికి వచ్చిండు, మీకు గుర్తుందా మన పిలకాయలు బడి బృందంతో లంబాడీ తండాల్లో టూర్ వేసినప్పుడు మీ వాడు మా ఇంట్లో ఒక రోజు మకాం వేసాడు,ఈ ఊరంతా తిరిగాడు, ఇక్కడ పిల్లల్ని చూసి ,"అంకుల్ ఇక్కడ పిల్లలు కూడా వ్యవసాయం, కూలి పనులు చేస్తారా ! " అని ఆడిగిండు, నే జెప్పా "ఇక్కడ పిలగాండ్రు బడి వేళకు బడికిపోయి ,శ్రద్దగా చదువుకుంటారు, బడి వేళ తక్కిన సమయంలో రైతు పని చిన్న చిన్న కూలి చేసుకుంటారు, తలిదండ్రులకి సాయపడతారు అన్నా... ఇక్కడ మా వీధిలో ఓ పిలగాడు ఉన్నాడులే, మల్లన్న... ఆడికి నాయన లేడు తాతయ్య, నాయనమ్మ, అమ్మ అక్క చెల్లి వున్నారు, ఇంట్లో ఆడవాళ్లు పైసా రాబడి తేలేరు,తాతయ్య ఒక గిడ్డంగి దగ్గర వాచమన్, మల్లన్న పదో తరగతి చదువుతున్నాడు, తరగతిలో ఫస్ట్ వాడే, బడి లేనప్పుడు నల్గొండబోయి కార్ల మెకానిక్ షాప్ లో పనిచేస్తాడు, దురదృష్టమేటంటే, నాన్నమ్మ పండు ముసల్ది, తల్లికి గుండెజబ్బు, అక్క చెల్లెల్లు పోలియో వ్యాధిగ్రస్తులు,అందుకే మల్లన్న ఇంట్లో పనులు కూడా చేస్తాడు,బాబూ నమ్మండి ఆ మల్లన్న పది పరీక్షల్లోబడిలో ఫస్ట్,ఏదో పదికి పదికి మార్కులట అదీ సాధించాడు. ఊరివారు మల్లన్నకి సత్కారాలు చేశారు,మల్లన్నను చూసి మీ చంద్రం మెచ్చుకున్నాడు,"నేనూ మల్లన్న మాదిరి మంచి పిల్లొడ్ని అవుతా...మా ఇంట్లో సంతోషం నింపుతా"అన్నాడు ,అయ్యా ఇప్పుడు మీ పిలగాడు బాగుండే కదా"అని పరామర్శించాడు యాదన్న.


    మోహన్ ఆనందానికి అవదులులేవు,"మనం ఎన్ని బుద్ధులు చెప్పినా వినని చంద్రం,లంబాడీ తండా పిల్లల జీవన శైలి,ముఖ్యంగా మల్లన్న జీవనం తీరు,ఫైనల్ గా 'మహర్షి' సినీమా చంద్రంలో మంచి మార్పు తెచ్చాయి, 'ఇనుము కొలిమిలో కాలి వేడిలో ఉన్నప్పుడే మనం కోరుకున్న వస్తురూపంలోకి మలుచుకోవాలని',చంద్రం ప్రాణ స్నేహితులుగా ఇంట్లోవారిని మారమని "మందలింపుతో కాదు పిల్లల్ని మందహసంతో మనమనుకున్న మంచి దారిలోకి తెచ్చుకోవాలి"అని వాళ్ళ ఇరు కుటుంబాలకూ చెప్పి చూసాడు.కాలం కరిగింది,చంద్రం భవిత వెలిగింది,చంద్రం పదో తరగతిలోనే కాదు అన్నిపరిక్షల్లోనూ నంబర్ వన్ అనిపించుకుంటున్నాడు నేడు చంద్రం జిల్లాకలెక్టర్.Rate this content
Log in

More telugu story from M.V. SWAMY

Similar telugu story from Inspirational