akhila thogari

Romance Others


4.5  

akhila thogari

Romance Others


ఆ రోజుల్లో

ఆ రోజుల్లో

6 mins 312 6 mins 312

ఆదిత్య ఉదయాన్నే నిద్ర లేచేసరికి రోజు లానే తన గుండెలపై పడుకుని ఉన్న సిరిని చూసి తెలీకుండానే చిరునవ్వు వస్తుంటే చిన్నగా నవ్వుకొని నెమ్మదిగా తనపై నుండి బెడ్ పై పడుకోబెడుతుంటే సిరి కళ్ళు మూసుకునే అప్పుడే లేపుతున్నావేంటి బావ అంటుంది.


ఉఫ్ఫ్... లేచేసింది రాక్షసి... ఎంత జాగ్రత్తగా పడుకోబెట్టిన మెలుకువొచేస్తుంది. దీనికి ఇలా పడుకోవడం బాగా అలవాటు అయిపొయింది అని మనసులో అనుకుని నిన్ను లేపడం లేదు బంగారం నేను లేస్తున్నాను అంటు సిరి తల నిమురుతాడు. తల వెంట్రుకలు తడిగా ఉన్నాయి. దుప్పటి కాస్త కిందికి జరిపి చూస్తాడు. సిరి డ్రెస్ కూడా వేరే ఉంది.


సిరి కళ్ళు తెరవకుండానే కాసేపు పడుకో బావ అని ఆదిత్య బుగ్గపై చెయ్యి వేస్తు నువ్వేటు వెళ్ళకు అంటుంది.


ఓహ్ పీరియడ్స్ వచ్చాయా ఆ రోజుల్లో మాత్రమే ఇలా అడుగుతావు అనుకుని విషయం అర్థమయ్యి సిరి చేతిపై తన చెయ్యి వేసి సరే పడుకో నేనేటు వెళ్ళను అని సిరినీ దగ్గరికి తీసుకుంటాడు.


కాసేపటికి సిరిని బెడ్ పై పడుకోబెట్టి సిరి టైమ్ 8 అవుతుంది. నువ్వు పడుకో నేను ఫ్రెష్ అయ్యి వస్తాను.


హు ఓకే.


ఆదిత్య ఫ్రెష్ అయ్యి వచ్చి సిరి నేను కిందికి వెళ్ళి కాఫీ తీసుకొస్తాను. జస్ట్ 5 మినిట్స్ ఇప్పుడే వస్తాను అని కిందికి వెళ్ళి  కాఫీ తీసుకుని మళ్ళీ సిరి దగ్గరికి వస్తాడు. కాఫీ కాప్పు పక్కన పెట్టీ సిరి సిరి లేవ్వు లేచి కాఫీ తాగు అని సిరి భుజాలు పట్టుకుని పైకి లేపి కాఫీ కప్పు చేతికిస్తాడు.


సిరి కాఫీ తాగేసి ఆదిత్య ఒళ్ళో పడుకుంటుంది.


ఆదిత్య కాసేపటికి వెళ్ళి టిఫిన్ చేసి తీసుకొచ్చి సిరి నువ్వు టిఫిన్ చెయ్యి అంటాడు.


ఇప్పుడే కాఫీ తాగాను కదా ఆదిత్య... ఇప్పుడేం వద్దు.


అలా అంటే ఎలా... తినకుంటే ఇంకా వీక్ అవుతావు. ఇంకేం చెప్పకుండా తిను అంటు సిరికి తినిపిస్తాడు.


ఆదిత్య టిఫిన్ తినిపిస్తుంటే అతని ప్రేమని చూస్తూ మురిసిపోతు ఆదిత్య ఎడమ చేతిని తన రెండు చేతులతో చుట్టేసి పట్టుకుంటుంది.


ఆది టిఫిన్ పూర్తిగా తినిపించేసి సిరి పెదాలు తుడిచి ప్లేట్ పక్కన పెట్టేసి హామ్ ఇక పడుకో బంగారం.. మళ్ళీ ఆఫ్టర్నూన్ లంచ్ వరకు నిన్ను డిస్టర్బ్ చేయను.


నువ్వు ఆఫీస్ కి వెళ్ళడం లేదా?


సిరి తల నిమురుతు నువ్వే కదా ఎటు వెళ్ళకు అన్నావు. అయిన నిన్నొక్కదాన్నే ఇలా వదిలేసి ఎలా వెళ్లగలను బంగారం.


ఆది ప్రేమకి మురిసిపోయి అవును టిఫిన్ తినిపించావు. వాటర్ ఎవరు ఇస్తారు? అని కను బొమ్మలు ఎగరెస్తుంది.


ఇంకెవరిస్తారు. వాటర్ కావాలి అని అడగొచ్చు కదా... ఈ డైలాగ్స్ ఎందుకు అని వాటర్ గ్లాస్ తీసుకుని సిరి నోటికి అందిస్తాడు. సిరి వాటర్ తాగడం అయ్యాక వాటర్ గ్లాస్ పక్కన పెట్టడానికి పక్కకి తిరుగుతుంటే ఆదిత్య బుగ్గ మీద చటుక్కున ముద్దు పెడుతుంది.


ఆదిత్య చేతితో బుగ్గపై నిమురుకుని సిరి వంక చూసి ప్రేమగా చిరునవ్వు విసిరి... ఏంటిది?


హు... తినిపించినందుకు.


టిప్పా .


టిప్పు హోటల్ లో బేరర్ కి కదా ఇస్తారు.


అంటే ఇప్పుడు నన్ను బేరర్ నీ చేసావా?


ఛీ... నేనలా అన్నానా బావ. అయిన వాడు సర్వ్ చేస్తాడు కాని ఇలా ప్రేమగా తినిపిస్తాడా ఏంటి?


హుమ్... తినిపిస్తే తినేస్తావా?


చి... ఛీ... ఎవడు పడితే వాడు తినిపిస్తే తింటానా? అయిన టిప్పుగా మనీ ఇస్తారు... నేను నీకు మనీ ఇవ్వలేదు ఆదిత్య .


మరేం ఇచ్చావు?


నీకు తెలీదా?


ఎలా తెలుస్తుంది... నేను చూడనప్పుడు ఇస్తే... నేను చూళ్ళేదు కదా ఏమిచ్చావో.


బుంగ మూతి పెట్టి అంటే నేనిచ్చిన దానికి విలువే లేదా?


ఊరికే అన్నానులే బంగారం.. జస్ట్ కిడ్డింగ్... అని సిరి గడ్డం పట్టుకుంటాడు.


ఛీ పో టిప్పిచ్చానట టిప్పు... నికిచేదేదొ ఆ హోటల్ లో బేరర్ కి ఇచ్చుంటే ఎగిరి గంతేస్తాడు తెలుసా అనేసి... తనేమందొ గుర్తు తెచ్చుకుని నాలుక కరుచుకుంటుంధి.


ఏంటమ్మా ఏమన్నావ్?


ఫేక్ స్మైల్ ఇస్తు హి హి హి.. ఏం లేదు.. ఏం అనలేదు.


సూది దారం తీసుకొచ్చి ఆ నోటిని కుట్టేస్తా తింగరిదానా... అసలు నీకు హెల్త్ బాలేదు అంటే ఎవరైనా నమ్ముతారంటే... నోరు మూసుకుని రా వచ్చి ఇలా పడుకో.


బుంగ మూతి పెట్టుకుని నాకు బాలేదని నీతో నేను చెప్పానా?


హామ్ కట్టుకున్నాను కదా చెప్పక్కర్లేదు. అలా

తెలిసిపోతుందిలే... అని సిరిని ఒళ్ళో పడుకోబెట్టుకుంటాడు.


సనువ్వు కట్టుకోవడం ఏంటి?.. నేనే కట్టించుకున్నాను.


ఏంటి?


సిరి మెడలో వేలాడుతున్న మంగళసూత్రాలు రెండు చేతులతో పట్టుకొని పైకెత్తి ఆదిత్యకి చూపిస్తూ ఇవి అంటుంది.


అచ్చా... అవి కట్టింది ఎవరు కన్నా.


చెప్పనా?


హు .


సరే కిందికి వంగు .


ఎందుకే?


చెప్తాను కదా... తినబోతు రుచెందుకు అడగడం.


అబ్బో సర్లే అని కిందికీ వంగుతాడు.


సిరి తల పైకెత్తి ఆదిత్య కళ్ళలోకి చూస్తూ కనురెప్పలు వాల్చూతు ఇంకా కిందికి... నా ఫేస్ కి దగ్గరగా.


ఓకే అని ఇంకాస్త కిందికి వంగి సిరి కళ్ళలో కళ్ళు పెట్టీ చూస్తాడు.
సిరి ఆదిత్య మొహాన్ని చేతిలోకి తీసుకుని ప్రేమగా ఆదిత్య కళ్ళలోకి సూటిగా చూసి తన పెదవులను ఆదిత్య పెదాలకు దగ్గరగా తీసుకొచ్చి కిస్ చేయకుండా ఆదిత్య చెవి దగ్గరికి వెళ్ళి నా బావని అని మెల్లిగా చెప్పి నవ్వుతు ఆదిత్య మొహాన్ని వదిలేస్తుంది.


ఆదిత్య హిహిహి అని వెటకారంగా నవ్వి... అది చెప్పడానికి ఇంత సీన్ చేయాలా... నార్మల్ గా కూడా చెప్పచ్చు.


సిరి నవ్వుకునీ చెప్పచ్చనుకో... గడ్డం కింద వేలు వేసుకుని అవును ఇంతకి నా బావ ఎవరో తెలుసుకోవా? అతనెవరో అడగవేంటి?


ఎవరో అతగాడు? (సాగదీస్తూ)


అదిగో అటు చూడు అంటు చూపుడు వేలు ఎదురుగా ఉన్న మిర్రర్ వైపు చూపిస్తుంది.


ఆది మిర్రర్ లో వాళ్ళిద్దరినీ చూసి నవ్వుకునీ... హు.. పర్లేదు.. నాట్ బ్యాడ్... అందంగానే ఉన్నాడే.


మనిషి మాత్రమే కాదు... మనస్సు ఇంకా అందంగా ఉంటుంది.


ఓహ్ అలాగా... ఇంతకి ఎక్కడ ఉన్నాడేంటి నీ బావ.


చూస్తావా?


హమ్.. విత్ యువర్ పర్మిషన్ మేడమ్.


హూ ... ఓకే పర్మిషన్ గ్రాంటెడ్... ఇదిగో ఇక్కడ అని గుండెల మీద చెయ్యి వేసుకుని చూపించి... ఇలార వచ్చి ఈ గుండె చప్పుడు విను అని ఆదిత్య తలని సిరి గుండెకు దగ్గరగా ఉంచి ఏం వినిపిస్తుంది అని అడుగుతుంది.ఆది సిరి తల నిమురుతు నీ బావంటే నీకెంత ఇష్టమో ఈ గుండె చప్పుడు చెప్తుంది మేడమ్. నిజంగా నీ బావ అదృష్టవంతుడు.ఓహ్... నీకు అలా అర్థమయిందా... ఇంకో విషయం చెప్పనా....


చెప్పండి మేడమ్.


నా బావకి నా మీదున్న ప్రేమ ముందు నా ప్రేమ (బొటన వేలితో చూపుడు వేలు చివరని చూపిస్తూ) చాలా... చాలా అంటే చాలా చిన్నది.


ఆది సిరి చేతిని చేతిలోని తీసుకుని ముద్దాడి.... నిజమా ఇది... నాకెప్పుడూ అలా అనిపించలేదే.


నిజం ఆదిత్య... ఆడపిల్ల బాధ్యత పెళ్ళికి ముందు తండ్రిది... పెళ్లయ్యాక తన బాధ్యత భర్తది... కాని తండ్రితో చెప్పుకోలేనివి కొన్ని తల్లితో చెప్పుకుంటుంది. కాని పెళ్లయ్యాక తల్లిని వదిలి ఉండక తప్పదు. అలాంటి పరిస్థితుల్లో భర్తే తల్లి అయితే అంతకన్న సంతోషం ఇంకోం కావాలి.పెళ్ళికి ముందు ఈ టైమ్ లో మామ్ పక్కనే ఉండి తినిపించి తన ఒళ్ళో పడుకోబెట్టుకునేది. ఇప్పుడు నువ్వు.... నువ్వు కూడా అచ్చం అమ్మ లాగే ప్రేమని చూపిస్తు... బాధ్యతతో పాటు తల్లి ప్రేమను కూడా పంచుతున్నావూ బావ.


నువ్వేటు వెళ్ళకు అని చెప్పిన ఒక్కమాటతో నా ప్రాబ్లెమ్ అర్థం చేసుకుని నాతో పాటే ఉన్నావు. తినిపించావు... ఒళ్ళో పడుకుబెట్టుకుని కబుర్లు చెప్తున్నావూ... కట్టుకున్న వాడు కన్న తల్లిలా చూసుకోవడం కన్నా అదృష్టం ఇంకేం కావాలి.


ఇందాక ఒక మాట అన్నావు కదా బావ... నిన్ను చూస్తే ఎవరైనా ప్రాబ్లెమ్ ఉందంటే నమ్ముతారా అని.... నిజమే బావ ప్రాబ్లెమ్ ఉంది అంతకు మించి పెయిన్ ఉంది.... కాని నువ్వు పక్కనుంటే ఏంటో ఏ భాద గుర్తురాదు. దైర్యంగా ఉంటుంది. నీతో ఉన్నంత సేపు సంతోషంగా ఉంటాను.


నిన్ను పెళ్ళి చేసుకుని నీతో నేను ఇంత సంతోషంగా ఉంటున్నాను బావ... నువ్వు పక్కనుంటే ఎంత బాధనైన మర్చిపోయి సంతోషంగా ఉండగలను.


ఆది ప్రేమగా నవ్వుతు సిరి తల నీమురుతాడు.


లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ కామన్.... దైర్యంతో నిలబడి వాటిని ఫేస్ చేయాలే తప్ప వాటికీ భయపడి ఆగిపోలేము కదా... సమస్యలతో పోరాడటమే కదా జీవితం.


హామ్... ఇప్పుడు ఈ పిలాసఫి ఎందుకు చెప్తున్నావూ మేడమ్.


సిరి ఆదిత్య బుగ్గపై చెయ్యి వేసి బావ హార్ట్ ఫుల్లీ ఐలవ్యూ.. ఐ లవ్ యూ ఫరెవర్... నేను నీతో సంతోషంగా ఉన్నాను. ఇది పై పై సంతోషం కాదు బావ నిజమైన సంతోషం....నువ్వు కూడా నాతో ఇంతే సంతోషంగా ఉన్నావా?


అది నీకు తెలీదా?


చెప్పు బావ. సంతోషంగా ఉన్నావా? లేక నాతో అడ్జెస్ట్ అవుతున్నావా?


ఏంటి సిరి... నేను నీతో సంతోషంగా లేకపోవడం ఏమిటి? నిన్ను ముందుగా కోరుకున్నది నేను... నా జీవితంలోకి నువ్వు రావాలని ఆశపడింది.. కళలు కన్నది నేను... అలాంటి నేను నీతో సంతోషంగా ఉండకపోవడం ఏమిటి? అడ్జెస్ట్ అవ్వడానికి నాకు ఇష్టం లేని పెళ్ళి చేసుకున్నానా...


సిరి చిన్నగా నవ్వుతూ నాకే డౌట్ వచ్చింది బాస్.


ఆది కోపంగా అమ్మగారికి ఇలాంటి డౌట్ ఎందుకు వచ్చిందో. ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నానే... అది నీకు అడ్జెస్ట్ అవుతున్నట్టు కనిపిస్తుందా.


అది కాదు ఆదిత్య.


ఏంటి కాదు... ఒకటి చెప్పు... పెళ్ళికి ముందు పెళ్ళికి తరువాత నేను చూపించే ప్రేమలో ఏమైనా మార్పు ఉందా... పెళ్ళికి ముందు కేరింగ్ తీసుకుని పెళ్లయ్యాక పట్టిచుకోడం మానేసానా?


నేనంటుంది నీ ప్రేమలో మార్పు గురించి కాదు బాస్... నా గురించి...


ఉఫ్ఫ్.. సిరి... అలా అని నేను ఎప్పుడైనా అన్నానా. నీ మనసులో నా స్థానం ఏమిటో నువ్వు నాకు చెప్పక్కర్లేదు..పిచ్చి పిచ్చిగా ఆలోచించి బ్రెయిన్ పాడు చేసుకోకు... కళ్ళు మూసుకుని కాసేపు రెస్ట్ తీసుకో.


కాని ఆదిత్య... ఎంత ప్రేమ చూపించిన  చిన్న భాద.


ఎందుకు?


సిరి భారంగా ఒక నవ్వు నవ్వి... మన 4th అనివర్సరీ కూడా రాబోతుంది... అప్పుడే పెళ్ళయ్యి 3 ఇయర్స్ గడిచిపోయాయి. కడుపుపై చెయ్యి వేసుకుని చూసుకుంటూ కాని


ఆది సిరి చెయ్యి వైపు చూసి... సిరి మాట పూర్తి కాకముందే... అర్థమైంది... మనకింకా పిల్లలు లెరనా నీ భాధ... అయిన దానికి నువ్వు బాధపడడం ఎందుకు... దాంట్లో నీ తప్పేం ఉంది చెప్పు.


అంటే... జాబ్ కారణంగా నేను నీతో సంతోషంగా ఉండలేకపోతున్నానేమో అని అత్తయ్య వాళ్లు అనుకుంటున్నారు బావ. కిందటి సారి వాల్లిక్కడికి వచ్చినపుడు మాట్లాడుకుంటుంటే విన్నాను. నేను నిన్ను దూరం పెట్టడం వల్లే ...


ఆది సిరి నోటికి తన చెయ్యి అడ్డు పెట్టీ... చాలు సిరి... ఉన్న భాధలు చాలవు అన్నట్టు... కొత్త వాటి గురించి ఆలోచించి మనసు పాడుచేసుకోకు... మన మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో అది నాకు తెలుసు.. అయిన ఎవరో ఎదో అన్నారని పడక గది విషయాలు పది మందితో పంచుకొలేము కదా.


చూడు సిరి...మా అన్నయ్య వదినలకి కూడా పెళ్లయ్యాక 5 ఇయర్స్ వరకు బాబు పుట్టలేదు. అలా అని ఆ ఐదేళ్ళు వాళ్ళ మధ్య సఖ్యత లేదని అర్థమా. కాదు కదా.


ఓసారి నువ్వే అన్నావు కదా సిరి... మాతృత్వం అనేది భగవంతుడు ఇచ్చే గొప్ప వరం అని... ఆయన మనల్ని కరునించే వరకు ఎదురు చూడడం తప్ప మనం చేసేదేముంది.


ఆదిత్య కళ్ళలోకి చూస్తూ బావా అంటుంది.


ముయ్యి....ఇక నోరు మూసుకుని పడుకో. ఈ సారి నోరు తెరిస్తే నిజంగానే కుట్టేస్తాను.


సర్లే... ఇక తెరవను కానీ నువ్వు మర్చిపోయినట్టున్నావు... నువ్వింకా టిఫిన్ చేయలేదు... కనీసం కాఫీ కూడా తాగలేదు. నేను పడుకుంటాను నువ్వెల్లి టిఫిన్ చెయ్యి బాస్.


లేదు... నువ్వు పడుకున్నాకే వెళ్తాను. నేను తొందరగా టిఫిన్ చేయాలంటే నువ్వు తొందరగా పడుకోవాలి బంగారం.


హు సరే...


పడుకో


బావా....


మళ్ళీ ఏంటి?


బావ ఒక కిస్ ఇవ్వవా?


ఏంటి సిరి?


ముద్దు పెట్టవా అంటున్నాను బావ.


ఆది చిన్నగా నవ్వి తల వెంట్రుకలను పైకి జరిపి నుదిటి పైన ముద్దు పెడతాడు.సిరి ఆదిత్య కిస్ చేస్తూంటే తెలీకుండానే కళ్ళు మూసుకుంటుంది... అలాగే నిద్రలోకి జారిపోతుంది.


పిచ్చిది చిన్న చిన్న వాటికే మురిసిపోతుంది. ఇంత ఇన్నోసెంట్ గా ఇంత క్యూట్ గా ఉన్న నిన్ను చూస్తుంటే ఆకలి కూడా అవసరం లేదు బంగారం... నిన్ను చూస్తూ బ్రతికేస్తాను.


కాసేపు సిరిని అలాగే చూసి కాసేపటికి తన ఒళ్ళో నుండి బెడ్ పై పడుకోబెట్టి వెళ్ళి టిఫిన్ చేసి వచ్చి ఆరోజంతా సిరితో పాటే ఉండి తనని ప్రేమగా చూసుకుంటాడు.సమాప్తం🙏🙏🙏Rate this content
Log in

More telugu story from akhila thogari

Similar telugu story from Romance