akhila thogari

Inspirational Others

4  

akhila thogari

Inspirational Others

నీ తోడుగా

నీ తోడుగా

10 mins
601


హ్యాపీ బర్త్ డే రామ్..... హ్యాపీ బర్త్ డే రామ్ అని ఫ్రెండ్స్, బంధువులు అంతా విష్ చేస్తుంటే

5 స్టార్ హోటల్లో అంగరంగ వైభవంగా బర్త్ డే వేడుకలు జరుగుతున్నాయి.

తన ఫ్రెండ్ తో పాటు అక్కడికి వచ్చిన సీత.... పార్టీ లో మిగిలిపోయిన ఫుడ్ నీ పార్సిల్ చేసి తీసుకెళ్ళబోతుంటే

అదంతా గమనించిన రామ్ తల్లి (వాణి) ఏయ్ అమ్మాయి ఆ ఫుడ్ అంతా ఎందుకు తీసుకెళ్తున్నావు. నీకు ఏది తినలనిపిస్తే అది ఇక్కడే తిను అంది.

సీత చిన్నగా నవ్వుతూ ఇది నా కోసం కాదండి.

మరి?

మీ దగ్గర ఉన్న డబ్బుతో ఇక్కడ మీరు సంతోషంగా సంబరాలు జరుపుకుంటున్నారు. కానీ అక్కడ చాలా మంది తినడానికి తిండి లేక అల్లాడిపోతున్న వారు ఉన్నారు. మీరు ఎలాగు ఇవన్నీ వెస్ట్ గానే పడేస్తారు కదా అండి. మీరేం అనుకోకపోతే నేను వీటిని తీసుకెళ్ళచ్చా అని ప్రాదేయంగా అడుగుతుంది సీత.

సీత మాటలు విని వాణి, రామ్ లు ఏం మాట్లాడకుండా ఆశ్చర్యంగా సీత వైపు చూస్తారు.

ఏంటండీ అలా చూస్తున్నారు. మీరేం భయపడకండి ఇవన్నీ వారికి మీ పేరుతోనే అందిస్తాను. మీ సొమ్ము తీసుకెళ్ళి నాది అని చెప్పి పంచలేను. ఎందుకంటే నాకు కూడా అంత స్థోమత లేదు. నేను కూడా ఒక అనాథనీ. ఒక అనాథగా వారి ఆకలి భాధ తెలిసిన దానిగా అడుగుతున్నాను ఇవన్నీ నేను తీసుకెళ్ళనా అండి అని మరోసారి అభ్యర్థనగా వేడుకుంది సీత.

సీత మంచి మనసు నచ్చి అలాగే తీసుకెళ్ళు అంటుంది వాణి.

థాంక్యూ అండి అని పార్టీ లో మిగిలిన భోజనాలు అన్ని తీసుకుని అనాథ పిల్లల దగ్గరికి వెళ్ళి వారి ఆకలి తీరుస్తుంది సీత.

సీత మంచి మనసు...కల్మషం లేని హృదయం .... నిస్వార్థమైన చిరునవ్వు చూసి రామ్ సీతని ఇష్టపడతాడు. అమ్మతో ఈ విషయం చెప్పి సీతతో మాట్లాడి పెళ్ళి చేసుకుంటాడు.

వెనక ముందు ఎవరు లేని సీతకి పాతికేళ్లు రాగానే సీతని చూసి ఇష్టపడి పెళ్ళి చేసుకున్నాడు రామ్.

సీత పెళ్ళి చేసుకుని అత్తారింట్లో అడుగు పెట్టింది. అత్త గారి అభిప్రాయాలు ఏ విధంగా ఉంటాయో, భర్త అభిరుచులు ఎలా ఉంటాయో అని మొదట్లో కంగారుపడుతుంది కానీ రామ్ తల్లి సీతనీ అత్తలా కాకుండా తల్లిలా చూసుకోవడం చూసి.... కొన్ని రోజులకు అన్ని సర్దుకుని సీత ఇంట్లో వారితో కలిసిపోతుంది. అత్తగారిని తల్లిలా చూసుకుంటుంది.


          @::@::@:@:@:@:@::@:@:@:@:@

ఉదయాన్నే 5గంటలకి లేచి చకచక ఇంటి పని పూర్తి చేసుకుని భర్తకి టిఫిన్ చేయడానికి వంట గదిలో దూరిపోతుంది.

నిద్ర లేచిన రామ్ సీతని వెతుక్కుంటూ వంట గదిలోకి వస్తాడు. సీత వంట చేయడం చూసి వెనక నుండి వచ్చి సీతని గట్టిగా హత్తుకుని గుడ్ మార్నింగ్ సీత అంటు ఆమె నడుము చుట్టేస్తాడు.

అబ్బా. ఏంటండీ ఇది వదలండి. అత్తయ్య గారు చూస్తారు.

చూస్తే ఏంటంటా? నేను పట్టుకుంది నా పెళ్ళాన్ని పక్కింటి అమ్మాయిని కాదు. నీకు తెలుసా!! ఈ ప్రాపర్టీ పై ఫుల్ రైట్స్ నావే అమ్మ. పట్టుకోవడం కాదు ముద్దు కూడా పెట్టుకుంటాను ఏంటంటా అంటు సీత మెడపై చిన్నగా ముద్దు పెడతాడు.

రామ్ చేతులు వదిలించుకుని రామ్ కి ఎదురుగా నిలబడి రాను రాను మీ అల్లరి మరీ ఎక్కువై పోతుంది. వెళ్ళండి వెళ్ళి రెడీ అవ్వండి.


రాక్షసి.... అమ్మ ఇంకా నిద్ర లేవలేదే.

అయిన సరే మీ వేశాలన్ని ఇక్కడ కాదు అంటు రామ్ నీ బెదిరిస్తున్నట్లుగా రామ్ వైపు చూస్తూ హు.... వెళ్ళండి అంటు చేతిలోని గరిటతో బయటికి వెళ్ళండి అన్నట్టు దారి వైపు చూపిస్తుంది.

చిరు కోపంగా హు అలాగే అంటాడు రామ్.

అలాగే అంటు ఇంకా ఇక్కడే ఉన్నారు ఏంటి? మీరు వచ్చేలోపు మీకోసం టిఫిన్ రెడీ చేసి ఉంచుతాను. నడవండి అంటు రామ్ వీపుపై చేతులు వేసి వంటగది నుండి బయటికి నెట్టేస్తుంది.

    #:#:#;#;#;#;#;;#;#;#:#:##:#:#:#:#

రామ్ తన గదిలోకి వెళ్ళి స్నానం పూర్తి చేస్తాడు. ఇక్కడ సీత కూడా టిఫిన్ చేయడం పూర్తి చేసి రామ్ ఇంకా రాలేదని రామ్ అని పిలుస్తూ గదిలోకి వెళ్తుంది.

గదిలోకి వెళ్ళి చూసిన సీత రామ్ ఇంకా రెడీ కాకపోవడంతో ఏంటండీ ఇంకా రెడీ కాలేదా? అవతల ఆఫీస్ కి టైమ్ అవుతుంది. అంటు దగ్గరికి వచ్చి గబగబా షర్ట్ బటన్స్ పెట్టీ, మొహానికి పౌడర్ అద్ది, క్రాఫ్ సరి చేసి, చేతికి వాచీ పెట్టీ... హు పర్ఫెక్ట్ మిస్టర్ హీరో ఇక పదండి టిఫిన్ చెద్దురు కానీ అంటు రామ్ మొహం వైపు చూస్తుంది.

సీత తనని రెడీ చేస్తుంటే తననే అలాగే చూస్తూ ఉండిపోయాడు రామ్.

ఏంటండీ! అలాగే చూస్తూ ఉండిపోయారు. పదండి అనే సీత పిలుపుతో సీత వెనక నడుస్తూ వస్తాడు.

సీత రామ్ కి టిఫిన్ వడ్డించి పక్కనే నిలబడుతుంది. రామ్ మెళ్ళి మెల్లిగా తింటుంటే మీరు ఇలా తింటే ఈ రోజు తినడం అయినట్టే అని రామ్ చేతిలో నుండి ప్లేట్ తీసుకుని తన చేతితో గబగబా తినిపించి చెయ్యి కడుక్కుని తన చేతితో రామ్ పెదాలని సున్నితంగా తుడిచి ఇక బయలుదేరండి అంటు రామ్ చేతికి బాక్స్ అందిస్తుంది.

ఓకే అంటు సీత మొహాన్ని తన చేతుల్లోకి తీసుకుని నుదిటిని ముద్దాడి ఆఫీస్ కి బయలుదేరుతాడు రామ్


        @:@:@:@:@:@:@:@:@:@@::@

రామ్ ఆఫీస్ కి వెళ్ళగానే అత్తయ్య గారినీ నిద్ర లేపి టిఫిన్ పెట్టి, తను కూడా టిఫిన్ చేసేసి గిన్నెలన్ని కడుగుతుంది.

కాసేపటికి గదిలో ఉన్న అత్త గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారు ఇదిగో టాబ్లెట్స్ (ఆస్తమా టాబ్లెట్స్) వేసుకోండి అంటు అత్తయ్య ముందు నిలబడుతుంది.


నీకెందుకు అమ్మ శ్రమ నేను వేసుకుని ఉండేదాన్ని కదా! ఇప్పడికే ఇంటి పని అంతా నీ నెత్తిన వేసుకుని చేస్తు ఒక్కదానివే అలసిపోతున్నావు. కాస్త నీ ఆరోగ్యం గురించి కూడా శ్రద్ద తీసుకో అంది వాణి.

ఆరోగ్యంది ఏముంది అత్తయ్య. టైమ్ కి తిని వేలకు నిద్రపొతే ఏ అలసట ఉండదు. అయిన రోజంతా ఇంట్లో చేసే పని ఏముంటుంది అత్తయ్య. ఆయన్ని ఆఫీస్ కి పంపించేసాక తిని పడుకుంటే మళ్ళీ ఆయన వచ్చే టైమ్ కి గాని నిద్ర లేవను. నాకేమవుతుంది.

అయిన దీంట్లో శ్రమ ఏముంది అత్తయ్య. నా భర్త, అత్తగారి పనులు చూసుకోవడం కూడా పెద్ద కష్టమేనా. ముందు మీరు టాబ్లెట్స్ వేసుకోండి అని చేతికి మాత్రలు అందించి మరో చేతితో వాటర్ ఇస్తుంది.

అత్తయ్య మాత్రలు వేసుకున్నాక సరే అత్తయ్య కాసేపు రెస్ట్ తీసుకోండి అంటూ తన గదికి వెళ్ళబోతుంటే కళ్ళకు మైకం కమ్మినట్టు అనిపించి ఉన్న చోటే కుప్ప కూలిపోతుంది.

సీత పడిపోవడం చూసిన వాణి కంగారు కంగారుగా వచ్చి సీతనీ తన ఒళ్ళో పడుకిబెట్టుకునీ అమ్మ సీత ఏమైంది అమ్మ.... లే సీత... కళ్ళు తెరువు... కళ్ళు తెరిచి నన్ను చూడు సీత అంటు బుగ్గలపై తడుతూ పిలుస్తుంది.

ఎంతకీ సీతలో చలనం కనిపించకపోయే సరికి పరుగున వెళ్ళి వాటర్ గ్లాస్ అందుకుని సీత మొహం పై వాటర్ చల్లి సీత.... సీత... అంటు మళ్ళీ పిలుస్తుంది.

సీత నెమ్మదిగా కళ్ళు తెరిచి చూస్తుంది.

సీతకి ఏమి కానందుకు గట్టిగా ఊపిరి పీల్చుకుని... ఏమైంది సీత ఎందుకు అలా పడిపోయావు అని అడుగుతుంది.

ఏమో అత్తయ్య కళ్ళు తిగినట్టు అయింది.

సరే...సరే...ముందు లెగు... హాస్పిటల్కి వెళ్దాం పదా.

అయ్యో!! ఈ మాత్రం దానికే హాస్పిటల్ కి ఎందుకు అత్తయ్య... ఒంట్లో కాస్త నీరసంగా ఉండి అలా పడిపోయి ఉంటాను... కాసేపు పడుకుంటే అదే సెట్ అవుతుంది. మీరేం కంగారు పడకండి.

అదేం కుదరదు. నువ్వు నాకేం చెప్పకు సీత. ముందు పద హాస్పిటల్ కి అని బలవంతంగా సీతని హాస్పిటల్ కి తీసుకుని వస్తుంది. వస్తు వస్తు రామ్ కి ఫోన్ చేసి విషయం చెప్తుంది వాణి.


రామ్ ఆఫీస్ నుండి అటు నుండి అటే హాస్పిటల్ కి వస్తాడు.

   *:*:*:*:*::*:*:*:*:*:***:*:*:*:*:*:*::**:**

హాస్పిటల్ కి వెళ్ళి వాణి, సీత ఇద్దరు వెయిటింగ్ హాల్ లో కూర్చున్నారు. కాసేపటికి వారి దగ్గరికి రామ్ కూడా వచ్చాడు.

రామ్ వెళ్ళి సీత పక్కన కూర్చుని సీత చేతిని తన చేతిలోకి తీసుకుని ఏమైంది సీత నీకేం కాలేదు కదా అంటు కంగారుగా అడిగాడు.

అబ్బా.... ఏమి కాలేదు అండి. వద్దంటున్న వినకుండ అత్తయ్య గారే హాస్పిటల్ వరకు తీసుకొచ్చారు.

మరో చేతితో సీత తలని నిమురుతూ... సర్లే... టెస్ట్ చేపించుకోడం మనకే మంచిదే కదా సీత... నేను రెండు మూడు రోజులుగా చూస్తున్నాను... నువ్వు ఎప్పడిలా లేవు.. చాలా నీరసంగా ఉంటున్నావు అన్నాడు రామ్.

భర్త ప్రేమని చూసి మురిసిపోయి రామ్ భుజంపై తల వాల్చుతుంది. కాసేపటికి డాక్టర్ గారు పిలవడంతో వాణి, సీత ఇద్దరు లోపలికి వెళ్తారు.

సీతని చెక్ చేసిన డాక్టర్ నవ్వుతూ భయపడాల్సిన అవసరం లేదు.... మీరు తల్లి కాబోతున్నారు అని చెప్తుంది.

అది విన్న వాణి సంతోషంతో వచ్చి ఆ విషయాన్ని కొడుకుతో చెప్పి సంబరపడిపోతుంది. రామ్ సీత మొహాన్ని చేతిలోకి తీసుకుని నిజమేనా అని కళ్ళతోనే అడుగుతాడు. నిజమే అన్నట్టు కళ్ళతోనే చెప్తుంది.

రామ్, వాణి సంతోషంగా ఇంటికి బయలుదేరుతారు. కానీ సీతకి ఒక వైపు సంతోషంగా ఉన్న మరో వైపు కాస్త భయంగా కూడా ఉంది... గతం గురించి ఆలోచిస్తూ వుండగానే ఇంటికి చేరుకుంటారు.

      @::@;@;@;@;@;@;;@;@;@;@:@:@:@

ఇంటికి చేరుకున్నాక వాణి సీతనీ ఒక్క పని కూడా చేయనివ్వకుండ అన్ని పనులు తనే చేసుకుంటుంది. రాత్రికి భోజనానికి సీతకి ఇష్టమైన వంటకాలు ఏర్పాటు చేసి సీతని,రామ్ నీ భోజనానికి పిలుస్తుంది.

ముగ్గురు కలిసి భోజనం చేసాక సీత గిన్నెలు సర్దబోతుంటే... వాణి సర్దనివ్వకుండా అమ్మ సీత నీకెందుకు ఈ పనులన్నీ నువ్వు వెళ్ళి పడుకో... ఇక నుండి ఇంటి పనులన్నీ నేను చూసుకుంటానులే అంది వాణి.

అదేంటి అత్తయ్య అలా అంటారు.. మీరొక్కరే అన్ని పనులు ఎలా చేసుకుంటారు. కాస్త నన్ను కూడా సహాయం చేయనివ్వండి.

బలే దానివే నువ్వసలే వట్టి మనిషివి కాదు... నీతో ఎలా పనులు చేపించుకుంటాను.... నీకు అంతలా చేసి పెట్టాలి అని ఉంటే నీకు డెలివరీ అయ్యి నా చేతిలో మనువడినో మనవరాలినో పెట్టీ అప్పుడు చేసుకో అంది వాణి నవ్వుతు.

అప్పడి వరకు నువ్వు రవ్వంత పని చేయడానికి కూడా నేను ఒప్పుకోను. వెళ్ళు గదిలోకి వెళ్ళి పడుకో.

      #:#:#::##::#:#:#:#:#;#:#:#:#:#:#:#

సరే అని పడకగదిలో వచ్చిన సీత పడుకోకుండా ఏదో ఆలోచిస్తూ ఉండడం గమనించిన రామ్... సీత భుజంపై చెయ్యి వేసి సీత ఏమైంది ఎందుకు అలా ఉన్నావు???

అబ్బే... ఏమి లేదండి. నేను బానే ఉన్నాను.

నిజం చెప్పు సీత.

అత్తయ్య గారు నేను తల్లిని కాబోతున్నారు అని చాలా సంతోషంగా ఉన్నారు అండి. కానీ ఇదివరకు కూడా 2సార్లు ఇలాగే ప్రగ్నెన్సి వచ్చినట్టే వచ్చి కడుపులో బేబీ సరిగ్గా లేదని అబార్షన్ చేసారు. కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే ఈ సారి కూడా అలాంటిది ఏదైనా జరిగితే అని భయంగా ఉందండి.

సీతని తన గుండెలకి హత్తుకుని లేదు సీత... లేదు... నువ్వు భయపడకు... అలాంటిదేం జరగదు... ఈ సారి మన బిడ్డ క్షేమంగా ఉంటుంది... ఆ క్షణం కోసం నువ్వు ఎదురుచూస్తూ ఉండు....నువ్వు ఖచ్చితంగా తల్లివి అవుతావు. ఆ దేవుడు ఈ సారి మనకి అన్యాయం చేయడు సీత... చేయడు.

రామ్ మాటలు వినగానే కాస్త దైర్యంగా అనిపించి రామ్ ఒడిలో తల పెట్టీ పడుకుంటుంది.

రామ్ సీతకి దైర్యం చెప్పాడే కానీ అతని మనసులో కూడా అదే భయంగా ఉంది...సీత మొహాన్ని చూస్తూ ఈ సారి కూడా అలా జరిగితే సీత తట్టుకుంటుందా అని బాధపడతాడు.

అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ... బెడ్ కి నడుము ఆనించి అలాగే పడుకుంటాడు.

      #:#:#;;#;#;#;#;#;;#;#;:#:#:#:#::#:#:#

రోజులు గడిచిపోతున్నాయి... తల్లి లేని సీతని వాణి తల్లి కన్నా ఎక్కువగా చూసుకుంటుంది... సీతకి ఏది కావాలంటే అది చేసిపెడుతు... కాలు కింద పెట్టకుండా చూసుకుంటుంది.

చూస్తూ వుండగానే సీతకి నెలలు నిండాయి.... 3రోజులుగా ఉరుములు మెరుపులతో కూడిన తీవ్రమైన వర్షం కురుస్తుంది..... గాలి తీవ్రతకు చెట్లు విరిగిపడుతున్నాయి. ఎక్కడికక్కడ ట్రాఫిక్ నిలిచిపోయింది.

అలాంటి సమయంలో సీతకి పురిటి నొప్పులు స్టార్ట్ అయ్యాయి... నొప్పులతో బాధపడుతున్న సీతని రామ్, వాణి హాస్పిటల్ కి తీసుకెళ్లారు. ట్రాఫిక్ ఇబ్బందుల వలన కాస్త ఆలస్యంగా హాస్పిటల్ కి చేరుకుంటారు.

సీతని చూసిన డాక్టర్ వెంటనే ఆపరేషన్ థియేటర్ కి తీసుకెళ్తుండగా సీత గట్టిగా రామ్ చెయ్యి పట్టుకుని ఏవండీ నాకు భయంగా ఉంది అంది.

సీత నువ్వు భయపడకు అంతా మంచే జరుగుతుంది అని భాధగా సీత చేతిని ముద్దాడుతాడు.

ఇంతలో స్త్రెచ్చర్ పై ఉన్న సీతని ఆపరేషన్ థియేటర్ లోపలికి తీసుకెళ్తారు.

     *:*:*:*:*::*:*:*:*:*:**:*::*:*::***:*::*:

లోపల ఏం జరుగుతోందో అని వాణి, రామ్

భయ భయంగా ఎదురుచూస్తున్నారు.

కాసేపటికి డాక్టర్ బయటికి వచ్చి ఆడపిల్ల పుట్టింది...కానీ

కానీ ఏంటి డాక్టర్ గారు? అన్నాడు రామ్ సిత్యకి ఏమయ్యిందో అని కంగారుగా

పాప పురిట్లోనే చనిపోయింది.... వీక్ గా ఉండడంతో గర్భసంచి కూడా తీసేసాము... ఇక తనకి పిల్లలు పుట్టే అవకాశం లేదు. సారీ మిస్టర్... అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది.

    #;#:#:#:#::#:#:##:#:#:#::##::#:#:#

డాక్టర్ గారి మాటలు విన్న సంధ్య ఒక్కసారిగా కుప్పకూలిపోయి శోకం మొదలెడుతుంది. తల్లిని అలా చూసిన రామ్ వెళ్ళి... అమ్మ అమ్మ ప్లీస్ అమ్మ ఎడవకు... నువ్వే ఇలా ఏడిస్తే అక్కడ సీత పరిస్థితి ఏమిటి? తనని ఓదార్చేది ఎవరు అమ్మ? అంటు కళ్ళలో సుడులుగా తిరుగుతున్న కన్నీటిని అమ్మ కంటికి కనిపించకుండ తుడుచుకుంటాడు.

రామ్ మాటలు విన్న వాణి లేచి నిలబడి నాన్న రామ్ పదా... వెళ్ళి సీతని చూద్దాం అంటు భాధగా సీత దగ్గరికి వెళ్తారు.


లోపల స్పృహలోకి వచ్చిన సీత నిజం తెలుసుకుని... ఏడ్చి ఏడ్చి ప్రాణం లేని బొమ్మలా మారిపోతుంది. సీతని ఆ పరిస్థితిలో చూసి రామ్ తట్టుకోలేకపోతాడు.

జీవచ్ఛవంలా ఉన్న సీతని తీసుకుని రామ్, వాణి ఇంటికి వస్తారు.

      *:*:*::*:*:*:*:*:*:*:*:*::*:*:*::*::*:*:*:*:*

సీత బాధని చూడలేక రామ్ నెల రోజులు ఆఫీస్ కి సెలవు పెట్టీ సీతని కంటికి రెప్పలా చూసుకుంటాడు.

కొన్ని రోజుల తరువాత సీత కోలుకుని ఎప్పడిలా ఇంటిపనులు చేయడం మొదలెడుతుంది. అలా ఎప్పడిలానే ఒకరోజు అత్తయ్య పక్క సర్దాడానికి గదిలోకి వెళ్తుంది. సీత పక్క సర్దాక వాణి బెడ్ పైన కుర్చుని అమ్మ  సీత ఇలా వచ్చి కూర్చో అంటుంది.

సీత వెళ్ళి వాణి పక్కన కూర్చుని ఏంటి అత్తయ్య? అంది.

మరేం లేదు సీత... నీకు జీవితంలో పిల్లలు పుట్టే అవకాశం లేదనీ డాక్టర్ గారు చెప్పారు. కానీ నా వంశం ఇక్కడితో ఆగిపోవడం నాకు ఇష్టం లేదు.

ఆ మాట వినగానే సీత కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే కానీ అత్తయ్య నేనేం చేయను. మాతృత్వం అనేది దేవుడు ఇచ్చే గొప్ప వరం.. కానీ నాకు ఇచ్చినట్టే ఇచ్చి నా దగ్గరి నుండి లాగేసుకున్నాడు. నేను మీ వంశానికి వారసుడిని ఇవ్వలేను. ఆ దేవుడు నాకు ఆ అదృష్టాన్ని దూరం చేసి అన్యాయం చేసాడు అని బోరున ఏడుస్తుంది.

అది తెలిసే ఈ విషయం అడగబోతున్నాను. దీనికి రామ్ నీ నువ్వే ఒప్పించాలి అంది వాణి.

అత్తగారీ మాటలు అర్థం కాని సీత అయోమయంగా వాణి వైపు చూస్తుంది.

చూడు సీత... నా వంశం ముందుకు నడవాలి అంటే ఒకటే మార్గం. రామ్ మరో పెళ్ళి చేసుకోవాలి. దానికి నువ్వే రామ్ నీ ఒప్పించాలి.

వాణి

మాటలు విని షాక్ అయిన సీత అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు?? ఆయన నన్ను వదిలిపెట్టి మరో పెళ్ళి చేసుకోవడమా? దానికి స్వయంగా నేనే ఆయన్ని ఒప్పించడమా?


నిజమే మాట్లాడుతున్నాను సీత... నేను చెప్పిన దానికి నువ్వు అంగీకరించక తప్పదు. ఒకసారి నా వైపు నుండి కూడా ఆలోచించు సీత.

సీత ఏడుస్తూనే కానీ అత్తయ్య నేను ఆయన్ని వదిలేసి ఉన్న కూడా ఆయన నన్ను వదిలేసి ఉండలేడు. నేనుండగా రెండో పెళ్ళి చేసుకోవడానికి ఆయన ఒప్పుకోడు.

ఇన్నాళ్ళు ఎవరు లేని నిన్ను ఒక తల్లిగా చూసుకున్నాను... నువ్వేదడిగిన కాదనకుండా ఇచ్చాను. ఒక్కసారి ఈ తల్లి బాధని అర్థం చేసుకుని నా మాట కాదనకు అమ్మ. నీకు దండం పెడతాను అని రెండు చేతులు జోడిస్తుంది.

అయ్యో!! అత్తయ్య ఏంటిది? సరే మీరు చెప్పినట్టుగానే చేస్తాను. ఆయన్ని...ఆయన్ని ఒప్పించడానికి ప్రయత్నిస్తాను అంటు ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోతుంది.

         #:#:#:#::##::#;#;#;#;#;#;#::#:#

గదిలోకి వెళ్ళిన సీత కాసేపు ఆలోచించి ..... రామ్ పడుకోగానే తన బట్టలు బ్యాగ్ లో సర్దుకుని.... రామ్కి ఒక ఉత్తరం రాసి పెట్టీ ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది.

సీత తన గదిలో నుండి వెళ్ళిపోయాక వాణి ఆలోచిస్తూ ఆలోచిస్తూ అలాగే నిద్రపోతుంది. ఉదయాన్నే రామ్ నిద్ర లేచి ఎప్పడిలానే సీతని వెతుకుతూ వంట గదిలోకి వెళ్తాడు.

కిచెన్ లో భార్య కాకుండా తల్లి ఉండడం చూసిన రామ్.... అమ్మ నువ్వేంటి ఇక్కడ? సీత ఏం చేస్తుంది?

ఏమోరా పడుకుని ఇంకా లేవ్వనట్టుగా ఉంది. నీకు ఆఫీస్ కి టైమ్ అవుతుంది అని నేనే వంట చేస్తున్నాను అంది వాణి.

పడుకోవడం ఏమిటి అమ్మ? నేను ఇప్పుడే లేచి వస్తున్నాను. తను గదిలో లేదు.

అవునా!! మరి ఎక్కడికి వెళ్లినట్టు?

నేను చూస్తాను ఉండు అమ్మ అని సీత సీత అంటు ఇల్లంతా వెతుకుతాడు.

వెతికి వెతికి అలిసిపోయిన రామ్ కళ్ళకి సీత తన కోసం రాసి పెట్టిన ఉత్తరం కనిపిస్తుంది. రామ్ కంగారు కంగారుగా వెంటనే అది చేతిలోకి తీసుకుని చదువుతాడు.

       *:*:*:*:*:*:*:*:*::*:*:*:*:*:*::*:*:**::*:*

ప్రియమైన శ్రీవారికి, నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. అందుకు కారణం నేనే. నాకు పిల్లలు పుట్టరని.... మీ వంశం మీతోనే ఆగిపోకూడదని అత్తయ్య గారు మీకు మరో పెళ్ళి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నేను మీ ఎదురుగా ఉంటే మీరు మరో పెళ్ళికి ఒప్పుకోరు. అందుకే  ఇళ్ళు వదిలి వెళ్ళిపోతున్నాను.

ఇన్నేళ్ళ మన వైవాహిక జీవితంలో నేను మిమ్మల్ని, అత్తయ్య గారు నన్ను ఏ కోరిక అడిగింది లేదు. మొదటిసారి అత్తయ్య గారు నోరు తెరిచి నన్నొక కోరిక కోరారు. అది నెరవేర్చడం మీ చేతిలోనే ఉంది.

అత్తయ్య గారి కోరిక ప్రకారం మీరు మరో పెళ్ళి చేసుకుని పిల్లా పాపలతో సంతోషంగా ఉండండి.

                                              ఇట్లు

                                      ప్రేమతో మీ సీత.


        @@:@::@@::@:@:@:@:@:@:@::@

ఉత్తరం చదివిన రామ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఎదురుగా ఉన్న అమ్మనీ పట్టించుకోకుండా సీత కోసం వెతుకుతూ బయల్దేరుతాడు.

వెతికి వెతికి సీతని మళ్ళీ ఇంటికి తీసుకొస్తాడు.

ఏడుస్తు ఉన్న సీత ముందు నిలబడి తన రెండు చేతులు పట్టుకుని సీత ఎందుకు ఇంత పని చేసావు. నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకున్నావు. నిన్ను కాదని మరో పెళ్ళా?? అది జరగదు సీత. కలలో కూడా నిన్ను తప్ప మరెవరినీ ఊహించుకోలేను... నాకు నువ్వే కావాలి. మనకి పిల్లలు లేకపోయిన పర్వాలేదు. జీవితాంతం నీకు తోడుగా నేనుంటాను.

రామ్ మాటలు విని సీత బోరున ఏడుస్తుంది.

ఏంటమ్మా ఇది. సీతకి పిల్లలు పుట్టరని తనని వదిలేసి మరో పెళ్ళి ఎలా చేసుకోగలను. నీకు పిల్లలే కావాలి అంటే దేశంలో ఎంతో మంది అనాథ పిల్లలు ఉన్నారు అమ్మ. ప్రేమగా వారిని చేరదిస్తే వాళ్ళు మన వారసులే అవుతారు. ఇప్పడి వరకు నీకు ఈ విషయం చెప్పలేదు. ఇప్పుడు విను అమ్మ. నేను ఇప్పుడే వెళ్ళి అనాథ ఆశ్రమం నుండి బాబునీ దత్తత తీసుకుంటాను. కానీ సీతని మాత్రం వదిలే ప్రసక్తే లేదు అమ్మ.


రామ్ మాటలకి వాణి మౌనంగా ఉండిపోతుంది.

ఏంటమ్మా నన్ను చూస్తే కోపంగా ఉందా? పెళ్ళాం కోసం తల్లికి ఎదురు మాట్లాడుతున్నాను అంకుంటున్నావా? అన్నాడు రామ్.

రామ్ మొహాన్ని చేతిలోకి తీసుకుని లేదు నాన్న నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉంది.. నీకు వచ్చిన ఆలోచన నాకెందుకు రాలేదు అని సిగ్గుగా ఉంది.

అర్థం చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది అమ్మ. ఇప్పుడే నేను సీత వెళ్ళి ఒక బాబు నీ తీసుకుని వస్తాము. అని వెంటనే ఆశ్రమానికి వెళ్ళి అక్కడి ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసి బాబు నీ తీసుకుని ఇంటికి వచ్చి.... తల్లి దగ్గరికి వెళ్ళి


వీడిని నీ వారసుడిగా అంగీకరిస్తావా అమ్మ?

వాణి

కళ్ళలో నీళ్ళు తిరుగుతుంటే ముందుగా సీతని దగ్గరికి తీసుకుని క్షమాపణలు చెప్పి.... ఆ తరువాత బాబుని ఎత్తుకుని ముద్దాడుతుంది.


ఆ తరువాత నుండి వాణి ఎంతో సంతోషంగా రామ్ తీసుకొచ్చిన బాబుని తన మనవడిగా ప్రేమగా చూసుకుంటుంది. సీత రామ్ లు కూడా పిల్లలు పుట్టారనే భాదను మర్చిపోయి ఆ బాబునే తమ సొంత బిడ్డగా చూసుకుంటారు.


    @:@:@;;@;@;@;@;@:@:@:@:@::@:@:@:@

ధన్యవాదాలు🙏🙏🙏🙏🙏🙏🙏🙏


Rate this content
Log in

Similar telugu story from Inspirational