akhila thogari

Drama Inspirational

4.7  

akhila thogari

Drama Inspirational

ఒకరికొకరం

ఒకరికొకరం

7 mins
518


దడేలున తలుపు తోసుకొని వచ్చింది కాంతమ్మ. తను ఇంట్లోకి వచ్చేసరికి కోడలు దీప్తి తన కొడుకుతో కాకుండా మరొక అబ్బాయిని గుండెలకు హత్తుకుని అతనితో మాట్లాడటం చూసి అతను ఎవరు? విషయం ఏమిటో తెలుసుకోకుండా ఒక్కసారిగా అగ్ని పర్వతం విస్పోటనం చెంది లావా ఉప్పొంగినట్టు కోపం కట్టలు తెంచుకుని అపరభద్రకాలిలా కోడలు మీద విరుచుకుపడిపోతుంది.

ఒసేయ్ దీప్తి అంటు అరుస్తూ వెళ్ళి దీప్తి జుట్టు పట్టుకుని పక్కకి లాగి ఏం చేస్తున్నావే? అని గుండెలు బాదుకుంటూ అమ్మో అమ్మో అమ్మో!! ఎంతకు భరితెగించావే నా కొడుకుని ఎంత మోసం చేస్తున్నావే. ఏడి వాడెక్కడ?? రేయ్ రిషి... రిషి... ఎక్కడ చచ్చావురా అని కేకలు వేస్తుంది.

గదిలో ఉన్న రిషి అమ్మ అరుపులు వినగానే వచ్చి రాగానే అమ్మ దీపుతో గొడవకి దిగిపోయినట్టుంది. అసలు అమ్మ చెప్పా పెట్టకుండా ఎందుకు వచ్చింది. అనుకుని రిషి పరుగు పరుగున కిందికి వస్తాడు.

అయ్యో అత్తయ్య గారు!.. ఏం మాట్లాడుతున్నారు. నేను చెప్పేది కాస్త వినండి అంది భాదగా.

ఇంతలో రిషి పరుగున కిందికి వస్తాడు.

రిషిని గమనించని కాంతమ్మ ఏం వినమంటావే. హా.... రోజు నా కొడుకు ఆఫీస్ కి వెళ్ళగానే వీడిని ఇంటికి రప్పించుకుని వీడితో రంకు సంబంధం పెట్టుకున్నానని చెప్తావా.

దీపు నెత్తిన మొట్టికాయ వేస్తు ముదనష్టపు దాన కొంచమైనా సిగ్గు ఉండక్కర్లేదా. అక్కడ వాడు పొద్దంతా కష్టపడి పని చేసి ఇంటికి వస్తే ఇక్కడ నువ్వు వాడికి తెలియకుండా మరోకడితో కులుకుతున్నాను అని చెప్తావా?

అత్త గారి మాటలు విని ఆవిడని ఏమి అనలేక దీప్తి ఉన్న చోటే కుప్ప కూలిపోయి బోరున ఏడుస్తుంది.

కిందికి వచ్చిన రిషీ పరుగున వెళ్ళి దీపు లేరా లే దీపు. ఏడవకు అంటు తన కన్నీరు తుడిచి దీప్తిని లేపి తన గుండెలకు హత్తుకున్నాడు.

రిషినీ చూసిన కాంతమ్మ ఏంట్రా రిషి నువ్వు ఇంట్లోనే ఉన్నావా. ఇంకా దానితో ఏంట్రా మాటలు నువ్వు ఇంట్లో ఉండగానే నీ పెళ్ళాం మరొకడితో కులుకుతుందారా.

ఇంకొకడి మీద మోజు పడి ఇదిలా చేస్తుంటే నువ్వు చూస్తూ ఎలా ఉంటున్నావురా. ఇంకా దానితో ఏంటి మాటలు. దాన్ని వదలరా. అంటు రిషి చేతిలో నుండి దీపుని పక్కకు నెట్టేస్తుంది.

ఒసేయ్ దరిద్రపుగొట్టుదాన. నా కొడుకు నీకు ఏం అన్యాయం చేశాడే. నీకు ఏం తక్కువ చేసాడనే ఇంతకి తెగించావు. ఒక చెయ్యి నడుముపై వేసుకుని మరో చేతి చూపుడు వేలు గడ్డం కింద పెట్టుకుని ఓహో....ఎలాగూ నీకు పిల్లలు పుట్టరు అనుకుని ఎవడితో పడుకుంటే మాత్రం ఏం జరిగిపోతుంది అని నీ సుఖం నువ్వు చూసుకుంటున్నావానే.

ఇలాంటి సుఖం కావాలి అనుకున్న దానివి నా కొడుకుని ఎందుకు పెళ్ళి చేసుకున్నావే. పైట ఎగరేసి బజారున వెళితే పూటకొకడు వస్తాడు. చి... ఛీ.... సిగ్గు లేని జన్మ సిగ్గు లేని జన్మ.


అత్తగారి మాటలు భరించలేక ఏడుస్తూ పరుగెత్తుకుంటూ గదిలోకి వెళ్ళి ఏడుస్తూ కులబడిపోతుంది.

దీపు...దీపు....అంటు రిషి కూడా భార్య వెనకే పరుగెడుతాడు.

భార్య వెనకే వెళ్ళిన రిషి దీపు ఓపెన్ ది డోర్. ప్లీస్ దీపు ఒక్కసారి డోర్ ఓపెన్ చెయ్యి అంటు డోర్ ఎంత కొట్టినా దీపు డోర్ ఓపెన్ చేయకపోవడంతో ఒకవేళ దీపు ఏదైనా అఘాయిత్యం చేసుకోవడం లేదు కదా అని అనుమానం వచ్చి బలవంతంగా డోర్ బద్దలుకొట్టి లోపలికి వెళ్ళాడు రిషి.

రిషి లోపలికి వెళ్ళే సరికి అత్తగారి మాటలు ఒక్కొక్కటిగా గుర్తొస్తుంటే భరించలేని దీపు సూసైడ్ చేసుకోవడానికి డిసైడ్ అయ్యి స్లీపింగ్ పిల్స్ వాటర్లో

కలుపుకుని తాగబోతుంది.

అది గమనించిన రిషి పరుగున వెళ్ళి దీపు చేతిలోని వాటర్ గ్లాస్ పక్కకు నెట్టేసి కోపంగా దీపు ఆర్ యు మ్యాడ్. ఇలా ఎలా ఆలోచించావు దీపు. నువ్వు లేకుండా నేనేమైపోవాలి అనుకున్నావు. ఇలా చేసే ముందు ఒక్క క్షణం నీకు నేను గుర్తురాలేదా దీపు. చెప్పు దీపు చెప్పు. మాట్లాడు అంటు తన భుజాలు పట్టుకుని ఊపుతూ అడిగాడు.

ఏం మాట్లాడమంటారు అండి . నా మనసు ఇప్పుడు మౌనాన్ని కోరుతుంది. మంచికి చెడుకు మధ్య మూగగా మూలుగుతుంది. అవేదనో ఆందోళనో తెలియక సతమతమవుతోంది. అత్తయ్య నన్ను అన్నేసి మాటలు అంటుంటే మౌనంగా ఉండిపోయిన నాది భాదో భాధ్యతో తెలియక అల్లాడిపోతున్నాను. కానీ బాధని మాత్రం భరించలేకపోతున్నాను . బాధ్యత అని మీ దగ్గర కూడా మౌనంగా ఉండలేకపోతున్నాను.

అలా అంటావెంటి దీపు ఈ మాత్రం దానికే ఇలా చేయాలా. నీకు నేను లేనా?

అత్తయ్యగారు అన్న మాటల కంటే మీ మౌనం నన్ను మరింత భాదపెడుతుంది. భర్త కళ్ళముందే భార్యని అన్నేసి మాటలు అంటుంటే నా భార్య అలాంటిది కాదు అని తల్లి ముందు నోరు తెరిచి ఒక్క మాట మాట్లాడలేని భర్తను చూస్తూ సంతోషం ఉప్పొంగుతూ ఏరులై ప్రవహిస్తూ వస్తుంది. అందుకే అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.

రిషి ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు.

మాట్లాడండి... నన్ను చూసి ఇష్టపడి ప్రేమించి 3సంవత్సరాలు నా వెంట తిరిగి నన్ను వదులుకోలేక మరొకరిని పెళ్ళి చేసుకోలేక కష్టమైన ఇంట్లో వాళ్ళని ఒప్పించి మరి నన్ను పెళ్ళి చేసుకున్నారు. మరి నేను ఎలాంటి దాన్నో మీకు తెలీదా? నేను మిమ్మల్ని మోసం చేయగలనా? మిమ్మల్ని కాదని మరొకరితో ఛీ...ఆలోచించడానికే అసహ్యంగా ఉందండి. కలలో కూడా నేను ఆ తప్పు చేయలేను.

ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని కట్నం ఏం తీసుకురాలేదని అత్తయ్య గారికి ముందు నుండే నేనంటే పడదు. ఏదో ఒక విషయంలో నన్ను తిడుతూనే ఉంటుంది. కానీ ఏ రోజు అత్తయ్య గారి మాటకు ఎదురు చెప్పలేదు. ప్రేమించి పెళ్ళి చేసుకున్నాను. కష్టమైనా సుఖమైనా మీతోనే అనుకుని అన్ని భరిస్తూ వచ్చాను.

కానీ ఈ రోజు ఏ ఆడది కూడా భరించలేని నింద మీ అమ్మ నా మీద వేసింది అండి. అదంతా చూస్తూ బెల్లం కొట్టిన రాయిలా నిలబడిపోయారు తప్ప నా భార్య అలాంటిది కాదని చెప్పలేకపోయారు. అంటే నేను ఏమనుకోవాలి అండి. మీరు నన్ను నమ్ముతున్నారు అని ఎలా అనుకునేది.

కళ్ళ నుండి ధారలుగా కారుతున్న కన్నీరు తుడుచుకుని ఈ రోజు అత్తయ్య గారు మీతో అంటుంటే మీరు మౌనంగా ఉండిపోయారు. రేపు నలుగురిలో అదే మాట అంటే అప్పుడు కూడా మీరు ఇలాగే మౌనంగా ఉండిపోతే!! లేదు...లేదు... నలుగురిలో ఆ నింద భరించడం కన్నా పుణ్య స్త్రీ గా మీ చేతులతోనే నన్ను చంపేయండి.... చంపేయండి... అంటు రిషి చేతులతో తన గొంతును పట్టుకుని అరుస్తుంది

దీపు... దీపు.... దీపు వదులు బలవంతంగా దీపు చేతులు వదిలించుకుని ఏడుస్తున్న దీపు మొహాన్ని చేతిలోకి తీసుకుని కన్నీరు తుడిచి నువ్వు లేకుండా నేను ఎలా ఉండగలను అనుకుంటున్నావు దీపు నువ్వు నా ప్రాణంరా. నీ మీద నాకు ఎలాంటి అనుమానాలు లేవు. లవ్ యూ రా... లవ్ యూ సో మచ్...ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు అని దీపుని గుండెలకు హత్తుకుని


అమ్మ మాటకి ఎదురు చెప్పలేక మౌనంగా ఉండిపోయాను తప్ప నువ్వంటే ఇష్టం లేకనో నీ మీద అనుమానంతోనో కాదు దీపు. అయిన తప్పు నాదే దీపు. ఆమ్ సారి... పదా వెళ్దాం

ఎక్కడికి అండి??

చెప్తాను పదా అంటూ దీపు చెయ్యి పట్టుకుని కిందికి వస్తాడు.

ఇక్కడ కాంతమ్మ ఏంట్రా ఇంకా చూస్తున్నావు. ముందు నువ్వు బయటికి నడువు. అంటు మధు కాలర్ పట్టుకుని అతన్ని బయటికి నెట్టేయబోతుంది.

అప్పుడే కిందికి వచ్చిన రిషి అమ్మా అని గట్టిగా అరుస్తూ స్టాప్పిడ్ అమ్మ జస్ట్ స్టాప్పిడ్ అన్నాడు ఆవేశంగా. ఎప్పుడు తన మాటకి ఎదురు చెప్పని రిషి అంత గట్టిగా అరుస్తూ మాట్లాడడం చూసి కాంతమ్మ బిత్తరపోయి చూస్తుంది.

అమ్మా అసలు మధు ఎవరు అనుకుంటున్నావు? మధు దీపు వర్క్ చేసే అఫీస్ లోనే వర్క్ చేస్తాడు. మధును దీపు హగ్ చేసుకుందని తప్పుగా అర్ధం చేసుకుని మాట్లాడావు కదు? మధునీ దీపు హగ్ చేసుకోవడమే కాదు కిస్ చేసిన తప్పు లేదు. ఎందుకంటే ఎందుకంటే మధు గే అమ్మ.

ఆ మాట విని షాక్ అయిన కాంతమ్మ ఏంట్రా నువ్వు చెప్పేది??

అవును అమ్మ మధు ఒక గే. తను దీపుకి మంచి ఫ్రెండ్. అప్పుడప్పుడు మా దగ్గరికి వస్తూ ఉంటాడు. తనకేదో ప్రాబ్లెమ్ వచ్చిందని చెప్తే దీపు అతన్ని ఓదార్చి నచ్చచెప్తుంది అంతే తప్ప నువ్వు అనుమానపడ్డట్టు వారిద్దరి మధ్య ఎలాంటి సంబంధం లేదు.

దీపుకి పిల్లలు పుట్టరు అని తనకి విడాకులు ఇచ్చి నన్ను వేరే అమ్మాయిని పెళ్ళి చేసుకొమ్మన్నావు కదా అమ్మ. నేను వేరే పెళ్ళి చేసుకున్న నాకు పిల్లలు పుట్టరు కావొచ్చు. ఎందుకంటే పిల్లలు పుట్టకపోవడానికి లోపం నాలో ఉంది దీపులో కాదు.

పిల్లలు పుట్టడం లేదని నువ్వు తనని నానా మాటలు అంటున్న భరించిందే కానీ లోపం నాది కాదు నా భర్తది అని చెబితే ఈ సమాజం నన్ను తక్కువ చేసి చూస్తుందని నింద తన మీద వేసుకుని నీ దగ్గర మాటలు పడిందే కానీ నన్ను వదులుకోవాలి అనుకోలేదు. మనకి పిల్లలు లేకపోయినా నువ్వే నా బిడ్డవి నువ్వుంటే చాలు నాకింకెం వద్దు అనుకున్న పిచ్చిది.

ఏంటిరా నువ్వు చెప్తుంది??

అవును అమ్మ పిల్లలు పుట్టడం లేదని ఎన్నో హాస్పిటల్స్ తిరిగాము...కానీ పిల్లలు పుట్టకపోవడానికి లోపం నాలో ఉంది... దాని కోసం టాబ్లెట్స్ కూడా వాడుతున్నాను.

ఇంకో విషయం నేను సంపాదించి పెడుతుంటే తను ఎంజాయ్ చేస్తుంది అన్నావు కదా. అసలు నేను ఆఫిస్ కి వెళ్ళక 9నెలలు అవుతుంది. నా జాబ్ పోయింది. వేరే జాబ్ కోసం వెతుకుతున్నాను. ఇన్ని రోజులుగా తనే జాబ్ చేస్తూ ఇంటి ఖర్చులన్ని భరిస్తుంది. నెల నెలా మీకు పంపిస్తున్న డబ్బు కూడా దీపు కష్టార్జితమే

నెల రోజుల క్రితం నాన్నకి ఆరోగ్యం బాగోలేకపోతే ఆపరేషన్ చేయించాము గుర్తుందా? 24 గంటల్లో ఆపరేషన్ చేయించకపోతే నాన్న చనిపోతాడు అని డాక్టర్ చెప్తే ఆ ఆపరేషన్ చేయించడానికి నా దగ్గర డబ్బులు లేక బాధపడుతుంటే నా భాధని చూడలేక దీపు తన మంగళసూత్రం తాకట్టు పెట్టి నాన్నకి ఆపరేషన్ చేపించింది. ఈ రోజు నీ మెడలో మాంగల్యం వేలాడుతు నువ్వు సుమంగళిగా ఉన్నావంటే కారణం కూడా దీపునే. 

అలాంటి దాన్ని ఎన్నేసి మాటలు అన్నావు అమ్మ. ఇన్నాళ్లు నువ్వేమన్న భరిస్తూ వచ్చింది. కానీ ఈ రోజు నువ్వన్న మాటలు భరించలేక సూసైడ్ చేసుకోవాలి అనుకుంది పిచ్చిది. దానికి తెలీదు అది చనిపోతే ఆ మరుక్షణమే నేను కూడా తనతో పాటే చనిపోతాను అని

నాన్న రిషి అంది కాంతమ్మ భాదగా.

అవును అమ్మ దీపు లేని నేను లేను. మాకు జీవితాంతం పిల్లలు పుట్టకపోయిన తనకు నేను నాకు తను ఒకరికొకరం ఉంటే చాలు. నువ్వు మమ్మల్ని చూడడానికి రాకపోయినా పర్వాలేదు. ఇంకెప్పుడు నీ సూటి పోటి మాటలతో దాన్ని ఇలా వేదించకు. దానికేమైన జరిగితే ఈ ప్రాణం తట్టుకోలేదు. నీకు దండం పెడతాను అంటు రెండు చేతులు జోడించి వేడుకున్నాడు రిషి.

రిషి మాటలు విన్న కాంతమ్మ తను చేసిన తప్పు తెలుసుకుని జోడించి ఉన్న రిషి చేతులు పట్టుకుని సారీ నాన్న తప్పు చేసాను అని పచ్యతాపంతో కన్నీరు కారుస్తుంది.

నువ్వు సారీ చెప్పాల్సింది నాకు కాదు అమ్మ దీపుకి అన్నాడు రిషి.

దీపు దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి తప్పైంది అమ్మ నన్ను క్షమించు. ఇక నుండి నిన్ను నా కూతురిలా చూసుకుంటాను. ఇంకెప్పుడు నిన్ను భాధ పెట్టను. నన్ను క్షమిచు అమ్మ. క్షమించు అని కన్నీటితో రెండు చేతులు జోడించి వేడుకుంది కాంతమ్మ.

కాంతమ్మ మాట్లాడుతూ ఉండగానే దీపు కళ్ళకు మైకం కమ్మినట్టు అయ్యి ఒక్కసారిగా కుప్పకూలిపోతుంది.

రిషి కంగారుగా దీపు దగ్గరికి వచ్చి దీపు ఏమైంది లే దీపు అంటు చెంపలపై తడుతు పిలుస్తాడు . ఎంతసేపటికీ దీపు స్పృహలోకి రాకపోయేసరికి

అరేయ్ ఏమైందిరా ఎందుకు ఇలా పడిపోయింది అని కాంతమ్మ రిషీని అడుగుతుంది.

ఏమో అమ్మ అదే అర్థం కావడం లేదు అని డాక్టర్ కి ఫోన్ చేయబోతు దీపు స్లీపింగ్ పిల్స్ మింగాలనుకున్న విషయం గుర్తు తెచ్చుకుంటాడు.

ఓహ్ మై గాడ్ ఒక వేళ నేను వెళ్ళకముందే దీపు స్లీపింగ్ పిల్స్ తీసుకోలేదు కదా?

రిషి నాకు ఎందుకో కంగారుగా ఉంది. వెంటనే హాస్పిటల్ కి వెళ్దాం పదా నాన్న

ఓకే అమ్మ పదా అంటు రెండు చేతులతో దీపుని ఎత్తుకుని హాస్పిటల్ కి తీసుకెళ్తాడు రిషి.

హాస్పిటల్ కి వెళ్ళగానే డాక్టర్ టెస్ట్ చేసి బయటికి రాగానే ఏమైంది డాక్టర్ నా భార్యకి ఏమి కాలేదు కదా?? తను బానే ఉందని చెప్పండి అని కంగారుగా అడుగుతాడు.

షి ఈజ్ ఫైన్ మిస్టర్... ఆండ్ కంగ్రాట్స్.

డాక్టర్ ఎందుకు కంగ్రాట్స్ చెబుతున్నాడో అర్థం కాక చూస్తుంటే

కంగ్రాట్స్ మిస్టర్ . షి ఈజ్ ప్రెగ్నెంట్ అనే గుడ్ న్యూస్ చెప్పగానే సంతోషంతో మనసులోనే ఎగిరి గంతేసి....నిజమా డాక్టర్ మీరు చెప్తుంది నిజమా అన్నాడు సంతోషంతో.

యస్ మిస్టర్ రిషి.

 థాంక్యూ డాక్టర్... థాంక్యూ సో మిస్ మేము వెళ్ళి చుడొచ్చా అని అడుగుతాడు.

తప్పకుండా.... వెళ్ళి చూడండి అని చెప్పి డాక్టర్ వెళ్ళిపోతాడు


రిషి పరుగెత్తుకుంటూ వెళ్ళి దీపునీ చూస్తాడు. అప్పడికే దీపు మొహం సంతోషంతో వెలిగిపోతుంది. రిషి వెళ్ళి పడుకుని ఉన్న దీపు నుదిటిపై కిస్ చేసి పొట్టపై చెయ్యి వేసి సంతోషంతో నోట మాట రాక దీపు కళ్ళలోకి చూస్తూ మాటల్లో చెప్పలేనంత సంతోషపడుతాడు.

కాంతమ్మ కూడా దీపు దగ్గరికి వచ్చి దీపు కాళ్ళు పట్టుకుని నన్ను క్షమించు అమ్మ అంటుంది.

అయ్యో! అత్తయ్యగారు అని గబ గబ లేచి కూర్చుని మీరు నా కాళ్ళు పట్టుకోవడం ఏంటి ? అంటు తన చీర కుచ్చిల్లను కాళ్ళకు నిండుగా కప్పేస్తుంది. ఇప్పటికైనా అర్థం చేసుకున్నారు అది చాలు అత్తయ్య గారు. మీరు అలా అన్నారు అనే భాధే కానీ నాకు మీ మీద ఎలాంటి ద్వేషం లేదు.

అది నీ మంచి మనసు తల్లి అని దీపు తల నిమురుతూ ఇన్నాళ్లు నిన్ను చాలా కష్టపెట్టాను తల్లి. ఇక నుండి నిన్ను కాలు కింద పెట్టకుండా చూసుకుంటాను. నీకు తల్లి లేని లోటు లేకుండా అన్ని నేనే చూసుకుంటాను. 


అమ్మ మాటలు విన్న రిషి సంతోషం మరింత రెట్టింపు అవుతుంది. సంతోషంగా భార్యని తల్లిని ఇంటికి తీసుకెళ్తాడు

   @:@:@::@:@:@@::@:@:@:@:@:@::@

      ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏🙏


Rate this content
Log in

Similar telugu story from Drama