Praveena Monangi

Tragedy

4.1  

Praveena Monangi

Tragedy

లేత మనసులు

లేత మనసులు

3 mins
425


అమ్మా! బాయ్ బాయ్.. ఇంక సెలవు ఈ స్మశానం నుండి నేను వెళ్ళిపోతున్నా... నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను అమ్మానాన్న ఉన్న అనాధను నేను. మీ ఇద్దరూ నాకు తోడుగా ఉన్న నేను ఒంటరిని తినడానికి అన్నీ ఉన్నా ఏమీ లేని అనాధ ని నేను. అక్క చెల్లెలు ,అన్నదమ్ములు లేని ఒంటరి జీవితం నాది. మీది ప్రేమ వివాహం అన్నావు పెద్దలు ఎవరూ అంగీకరించకపోవడంతో గు డిలో పెళ్లి చేసుకున్నాము అన్నావు, నాకు తోడుగా చెల్లి గాని తమ్ముడు గాని లేడా అంటే ఇద్దరిని పెంచడం కష్టమని చెప్పి నన్ను ఒంటరిని చేశారు. పెద్దలు అంగీకారం లేకున్నా పెళ్లి చేసుకుని అమ్మమ్మ నాన్నమ్మ ప్రేమ వాత్సల్యం లకు నన్ను దూరం చేశారు. మా స్నేహితులు అందరూ సెలవులకి అమ్మమ్మ ఊరికి వెళ్తారు నాకు ఆ సరదా లేదు నాన్నమ్మ ఎలా ఉంటుందో కూడా తెలియదు మీరు ఏ పెళ్లికి పేరంటానికి వెళ్లరు ఒక వేళ వెళ్ళినా.. నన్ను తీసుకు పోరు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నువ్వు, నాన్న ఆఫీసులో బిజీగా ఉంటారు ఇంటికి వచ్చిన తర్వాత నాన్న అలిసిపోయి చిరాకుగా ఉంటారు నేను ఏం మాట్లాడినా హుమ్.. హూమ్.. అంటారే తప్ప సమాధానం ఇవ్వరు, ఇంక నువ్వు ఆఫీస్ నుంచి వచ్చి ఇంటి పనుల్లో బిజీగా ఉంటావు నేను మాట్లాడదామని ప్రయత్నించినా తర్వాత మాట్లాడదాం లే అంటావు ఆదివారం వస్తే నాన్న ఫ్రెండ్స్ ని కలవడానికి వెళ్ళిపోతారు నువ్వేమో వారానికి ఒకరోజు సెలవు కదా అని ఇల్లు శుభ్రం చేసే పనిలో మునిగి పోతావు నీకు నాతో గడిపే సమయమే లేదు నా మాటలు వినే ఓపిక నీకు లేదు పోనీ హాస్టల్ లో నన్ను వేసేయండి అంటే ఉన్నది నువ్వు ఒక్కదానివే నిన్ను కూడా హాస్టల్ లో వేసి మేము ఎలా ఉండగలము అంటావు కనీసం హాస్టల్లో అయితే స్నేహితులైన ఉంటారు వాళ్లతో మాట్లాడొచ్చు మీరిద్దరూ ఇంట్లో ఉన్నా నేను ఏకాకిని. అసలు నువ్వు, నాన్న సరిగ్గా మాట్లాడుకోవడం నేను చూడలేదు. ఎప్పుడూ భోజనం రెడీ చేశాను.. బాక్స్ రెడీ చేశాను.. తినడానికి రండి.. కాఫీ తాగుతారా.. మంచినీళ్లు ఇవ్వమంటారా! ఇలాంటివి తప్పితే ఏమీ వినలేదు నేను. నాతో కూడా నీవు చదువుకో, టిఫిన్ తిని పడుకో ఇలాంటి మాటలు తప్పితే ప్రేమగా ఎప్పుడైనా మాట్లాడావా! అసలు మీ ఇద్దరికీ ఇంట్లో నేను, ఒక అమ్మాయి ఉంది అది మీ కూతురు అని గుర్తుకు వచ్చిందా! అసలు నన్ను ఎందుకు కన్నారు అమ్మ? నాది ఒంటరి బ్రతుకు అయిపోయింది. కిందకి వెళ్లి ఆడుకుందాం అంటే అందరూ ఎవరి ఇళ్లలో వాళ్ళు గడీ పెట్టుకొని ఇంట్లోనే ఉంటున్నారు పోనీ వాళ్ళ ఇంటికి వెళ్దామా అంటే అయిష్టంగా ముఖం పెడుతున్నారు కారణం తెలియట్లేదు క్లాసులో బ్రేక్ వచ్చినప్పుడు ఫ్రెండ్స్ తో మాట్లాడదామంటే ఎవరి సెల్ ఫోన్ లోవాళ్ళు బిజీగా ఉంటున్నారు ఎవరు నాతో మాట్లాడట్లేదు. అందరూ నన్ను ఒంటరిని చేశారు నేను ఏమి తప్పు చేశాను అమ్మ! అన్నీ ఉండి అనాధను అయ్యాను నేను. నా స్నేహితులకి అందరూ ఉన్నారు వాళ్ళకి అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలు, మామయ్యలు అత్తలు, పిన్నులు అందరి తోటి ఆనందంగా గడుపుతున్నారు మరి నాకెందుకు ఎవరూ లేరు? నేను ఏమి తప్పు చేశాను? మీమ్మల్ని ప్రేమ వివాహం నేను చేసుకోమన్నానా! నన్ను ఎందుకు కన్నారు? ఎందుకు నాకు ఏ బంధము లేకుండా  చేశారు! నేను చేసిన తప్పేంటి ఎన్నిసార్లు నా మనసులో బాధ మీతో పంచుకోవాలని.. ఈ ప్రశ్నలన్నీ వేయాలని ప్రయత్నించాను కానీ ఒక్కసారి కూడా నువ్వు నా మాట వినలేదు నువ్వు, నాన్న నా భవిష్యత్తు కోసం నా చదువు కోసం నా జీవితం కోసం డబ్బు సంపాదిస్తున్నారు..నా గురించే మాట్లాడుకుంటున్నారు కానీ అక్కడే ఉన్న నన్ను పట్టించుకోవడం లేదు నా భవిష్యత్తు మీద శ్రద్ధ అంటే డబ్బు సంపాదించడం ఒకటేనా! నేను ఏం చేస్తున్నాను, ఎలా పెరుగుతున్నాను అవి మీకు అక్కర్లేదా నాకు అందరూ,అందరి ప్రేమ కావాలని ఉంటుంది కదా అడిగినవన్నీ కొనివ్వడం ఖరీదైన స్కూళ్లలో చదివించడం ఇవి కాదమ్మా! నన్ను పట్టించు కోండి మీ ఇష్టానికి మీరు ప్రేమ వివాహం చేసుకున్నారు అన్ని బంధాలకు నన్ను దూరం చేశారు మీరు,పెద్దలు పంతాలకు పట్టుదలకు పోయి మాట్లాడుకోవడం మానేశారు మీకు మీ అవసరాలు తీరిపోయాయి మరి నాకు అచ్చట ముచ్చట ఎవరు తీర్చుతారు పోనీ మీ ఇద్దరు ఉన్నారు అంటే మీరు కూడా నన్ను పట్టించుకోకుండా వదిలి వేశారు. ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా గడిపాను ఎవరికీ అక్కర్లేని నేను ఎవరికీ కానీ నేను ఒంటరిగా మిగిలి పోయిన నేను ఎందుకు నేను ఉన్నాను, ఎవరికోసం ఉన్నానో అర్థం కాక నాలో నేను బాధ పడ్డాను ఏడ్చాను అమ్మ అని గట్టిగా అరవాలని పించింది అయినా అరవ లేకపోయాను నాన్నా నన్ను పట్టించుకో.. అని బిగ్గరగా అరవాలి అనిపించింది పెదవి దాటి మాట రానంది. ఈ ఉత్తరం చదవటానికి మీకు సమయం ఉందో లేదో నాకు తెలియదు కానీ నా బాధ అంతా నేను వెళ్ళిపోయే ముందు మీరు తెలుసుకోవాలి కాబట్టి రాస్తున్నాను. నా కోసం వెతక కండి నేను ఎక్కడికి వెళ్తానో నాకే తెలియదు ఈ లోకంలో ఉంటానో లేదో కూడా నాకు తెలియదు దయచేసి నా దారిన నన్ను వదిలేయండి. మళ్లీ ఆ స్మశానంలోకి నేను రాదలుచు కోలేదు స్మశానంలో ఏ విధంగా నిశ్శబ్ధంగా ఉంటుందో మన ఇల్లు కూడా అలాగే ఉంటుంది. మీరు ఎన్ని బొమ్మలు నాకు కొని ఇచ్చినా,ఖరీదైన వస్తువులు ఇచ్చినా.. ఎన్ని ఇచ్చినా.. అవి జీవంలేనివి. జీవం ఉన్న మీరు ప్రాణం లేని వస్తువుల తోటి, డబ్బులు తోటి బ్రతుకుతున్నారు తల్లిదండ్రులారా! వినండి మీరు ఉండి కూడా మీ పిల్లల్ని అనాధలు చేయకండి ఇదివరకు ఉమ్మడి కుటుంబాలు అందరూ ఎంతో ఆనందంగా గడిపేవారు అంట పుస్తకాల్లో చదివాను. చిన్న చిన్న కుటుంబాలు కూడా ఆనందంగా గడుపుతున్నారు. కానీ మా అమ్మ నాన్న లాగా ప్రేమ వివాహాలు చేసుకొని అందరినీ కాదని బంధాల్ని పక్కకునెట్టి మీదే ప్రపంచం అనుకుంటూ బతుకుతూ మీ చిన్నారులకు ఆ ప్రేమ వాత్సల్యాన్ని దూరం చేయకండి. ఉంటానమ్మా! ఇక సెలవు ఇంకా పెద్దది రాస్తే చదివే సమయం నీకు ఉంటుందో లేదో నాకు తెలియదు అందుకే ముగిస్తున్నాను బాయ్ బాయ్ అమ్మ…

    తన కూతురు రాసిన చివరి ఉత్తరాన్ని చదువుతూ ఉన్నచోటే కుప్పకూలిపోయింది. సరోజ ఏమండీ అంటూ బిగ్గరగా అరుస్తూ కన్న పేగు నొప్పితో చుట్టు కుంటుంటే విలవిలలాడింది ప్రాణం.


Rate this content
Log in

Similar telugu story from Tragedy