STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

లైబ్రరీ రహస్యం

లైబ్రరీ రహస్యం

1 min
348

ఈ చిన్న టౌన్ లో ఎందుకు దాచిపెట్టారు? ఒక ఏలియన్ అడిగింది. చిన్న టౌన్ కాబట్టి ఎవరూ పట్టించుకోరు. మరో ఏలియన్ చెబుతూ ఒక యంత్రాన్ని ఆన్ చేసింది.


మేఘాల జల్లులు మొదలయ్యాయి. 

ఇంకెంత సేపు? ఒక ఏలియన్ అడిగింది. మరో రెండు గంటల్లో టౌన్ మొత్తం పక్కనే ఉన్న చెరువులకు వచ్చే వరదతో మునుగుతుంది.


మనం లైబ్రరీకి వెళ్లి ఆ పుస్తకం తీసుకుందాం అని చెప్పింది మరో ఏలియన్.


అయినా మనుషులు వాడే లైబ్రరీలో మనవాళ్ళు భవిష్యత్తు గురించిన పుస్తకం ఎందుకు దాచిపెట్టినట్టు అని ఆ ఏలియన్స్ ఆలోచిస్తూ ఉన్నాయి. 


ఇంతలో టౌన్ పక్కనే ఉన్న చెరువుకు గండి పడింది. నీళ్లు వేగంగా తోసుకుంటూ జనావాసాల్ని ముంచాయి. లైబ్రరీలో కి నీళ్లు చేరాయి. అయితే ఏలియన్స్ కి కావాల్సిన పుస్తకపు పేజీలు తడవని రసాయనాల మిశ్రమంతో తయారు చేయబడ్డాయి.


ఎన్నో వందల ఏళ్ల క్రితం ఓ రాజు కట్టిన లైబ్రరీ కింద దాచిపెట్టిన నాగరికత రహస్యాల కోసం ఆ ఏలియన్స్ సృష్టించిన వరద టౌన్ ను నాశనం చేసింది.


ఆ పుస్తకం అంతరిక్ష వీధుల్లోకి ఎగిరిపోయింది.



రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract