Dinakar Reddy

Abstract Drama Inspirational

4  

Dinakar Reddy

Abstract Drama Inspirational

కష్టంలో ఆశ

కష్టంలో ఆశ

1 min
296


అన్నా! ఏమైనా మిగులుతుందా? ఇదొక్కటే చేస్తావా? ఇంకా వేరే జాబ్స్ కూడానా?

బైక్ టాక్సీ ఎక్కగానే మనలో చాలా మంది అడిగే ప్రశ్నలు..


అతనేదో తన స్థితి చెప్తాడు. మనం వింటాం. అలానే అడిగాను ఒకసారి.


సతీష్ తన పేరు. ఓ చిన్న జాబ్ చేసుకుంటూ మిగతా టైంలో ఇలా బైక్ టాక్సీ నడుపుతున్నాడు.


ట్రాఫిక్ లేని సమయంలో ట్రిప్పులు నడుపుకుంటే తనకు సమయం కలిసి వస్తుందని, రోజూ తను అనుకున్నంత డబ్బులకు సరిపడా ట్రిప్పులు పూర్తవగానే ఇక విశ్రాంతి తీసుకుంటాడట.


ఒక్కరోజు ఆఫీసుకు సెలవు దొరగ్గానే మరుసటిరోజు చాలా మంది ఆఫీసుకు వెళ్లాలంటే బద్ధకిస్తారు.


అలాంటిది అవసరం రోజుకు రెండు,మూడు డ్యూటీలు కూడా చేయిస్తోంది కదా..


అంతటి కష్టంలోనూ సతీష్ కి మంచి జాబ్ దొరుకుతుంది అనే ఆశ లేకుండా పోలేదు. దాని కోసం అతను కష్టపడకుండా కూడా ఉండడు.


ఇలానే కూరగాయలు తోపుడు బండి మీద అమ్మే వాళ్ళయినా, సరుకులు డెలివరీ చేసేవాళ్లయినా ఎన్నో ఆశలతో, సమయం సర్దుబాటు చేసుకుంటూ పని చేస్తుంటారు.


అన్ని వృత్తులనూ గౌరవించడమే మనం 

అలవర్చుకోవాల్సింది.



Rate this content
Log in

Similar telugu story from Abstract