కరోనా: పారిశుధ్యం
కరోనా: పారిశుధ్యం


18-04-2020
ప్రియమైన డైరీ,
ఇవాళ భారత దేశం లాక్ డౌన్ లో ఇరవై ఐదో రోజు.
ఎవరో వార్తల్లో చెప్పారు.డాక్టర్లకు ఇచ్చినంత విలువ మనం పారిశుధ్య కార్మికులకు ఇవ్వలేదు.కానీ ఇప్పుడు ఈ లాక్ డౌన్ సమయంలో వారు ఈ వైరస్ ప్రబలకుండా హైడ్రో సోడియం క్లోరైడ్ లాంటి వాటిని స్ప్రే చేయడం చేస్తున్నారు.
నిజమే కదా.
మనం ఎప్పుడూ ఒక రంగాన్ని ఎక్కువ గౌరవిస్తాం.
మిగతా రంగాల్లో పని చేసే వారిని తక్కువగా చూస్తాం.
కానీ ఆలోచించి చూస్తే మనందరం ఒకరి మీద ఒకరం ఆధారపడి ఉన్నాం.
అన్ని రంగాల వారు కలిసి కట్టుగా పని చేస్తేనే మనం అసలైన అభివృద్ధి సాధించగలుగుతాం.
మెరుగైన సమాజాన్ని నిర్మించగలుగుతాం.ఏమంటారు?