కొత్తగా రెక్కలొచ్చెనా
కొత్తగా రెక్కలొచ్చెనా


కొత్తగా రెక్కలొచ్చెనా అని పాడుకోవాలనిపిస్తోంది.2019 నా ఆత్మ విశ్వాసాన్ని మరింత పెంచింది.
అనవసరపు మాటలు వ్యవహారాలు తగ్గించుకునేలా చేసింది.నేను ఎప్పటికీ బయటపడలేను అని అనుకున్న కొన్ని
మనో వ్యథల నుండి నాకు విముక్తి కలిగింది.మనసు చిన్నపిల్లల్లా కేరింతలు కొట్టే క్షణాల్ని జ్ఞాపకాలుగా ఇచ్చింది.
నన్ను నేను ప్రేమించుకుంటూ ఆ భగవంతుని సేవలో సకారాత్మకతను పొందేలాంటి జీవన శైలి అలవరుచుకునేలా చేసింది.
జీవితాంతం బాధించే విషయాలు వెంట పడుతున్నా నేను మునుపటి కంటే ధైర్యంగా నవ్వగలిగి సమస్యల్ని ఎదుర్కోగలను
అని నన్ను నేను మరింత అభివృద్ధి చేసుకోగలను అని నిరూపణ అయ్యేలా చేసింది.