కొత్త కారు
కొత్త కారు


మొన్నే కొన్నానురా.ఎలా ఉంది అని తను కొన్న కొత్త కారు చూపించాడు వంశీ.చాలా బాగుందిరా అన్నాను నేను.
నా మనసులో నేనింకా కారు కొనలేదే అని ఎక్కడో అసంతృప్తి.
పదరా అలా గుడికి వెళ్లి పూజ చేయించాలి అన్నాడు.లేదురా అమ్మా నాన్నా బస్టాండ్ చేరుకొని ఉంటారు.
వారిని ఇంటికి తీసుకురావాలి.
మరేం పరవాలేదు.మనం బస్టాండ్ వెళ్లి ఆంటీని అంకుల్ని పికప్ చేసుకొని అటు నుంచి ఆటే గుడికి వెళ్దాం అని
బయలుదేరదీశాడు వంశీ.
వాడి స్నేహాన్ని చూసి నా మీద నాకే అసూయ అనిపించింది.