జ్ఞాపకంలో యువత
జ్ఞాపకంలో యువత
చిన్నప్పుడు ఎప్పుడు విన్నా పెద్దయ్యాక బాగుంటుంది అని చెప్పే వాళ్ళు. పది పాసవ్వగానే ఇంటర్మీడియెట్, ఇంకా ఎంసెట్ కోచింగ్ టార్గెట్లు. ఐఐటీ అంటారా? నాకంత సీన్ లేదని మా నాన్నగారు ముందే పసిగట్టి ఎంసెట్ వ్రాయి,చాలు అన్నారు.
బీటెక్ చేస్తే మంచి ఉద్యోగం వస్తుంది. లైఫ్ సెటిల్ అవుతుంది అంటారు. తర్వాత లైఫ్ సెటిల్మెంట్ సంగతి పక్కన పెడితే ఉద్యోగాలు మారుతూ, జీతాలు పెంచుకునేటప్పటికి తెల్ల జుట్టు వచ్చేస్తుంది.
ఆపైన పెళ్లి. పిల్లలు. చదువులు. మళ్లీ సెటిల్మెంట్ పాఠం పునరావృతం. ఇన్ని విషయాల్లో ఎప్పుడు ఎలా గడిచిందో బాల్యం.. ఆ జ్ఞాపకాల్లో యువత ఉంది. మళ్లీ పసితనపు స్వచ్ఛత కావాలని అనుకుంటూ ఉంటుంది.
ఎన్ని తెలిసినా మళ్లీ కథ మామూలే.
