STORYMIRROR

Dinakar Reddy

Abstract Comedy Drama

4  

Dinakar Reddy

Abstract Comedy Drama

జామాతా గ్రహాంతర వాసి:

జామాతా గ్రహాంతర వాసి:

1 min
666

పంతులు గారూ! అమ్మాయి పెళ్లికి మంచి ముహూర్తం పెట్టండి అన్నారు కాశీనాథ దంపతులు. 


అబ్బాయి జాతకం కూడా ఇస్తే.. అన్నారు పంతులు గారు.

ఏదైనా ఇబ్బందా అండీ అన్నాడు కాశీనాథ పరికించి చూస్తూ.


అమ్మాయికి కుజ దోషం ఉంది .. అన్నారు పంతులు గారు. అయ్యో. దానికేం భాగ్యం. అబ్బాయి ఉండేదే కుజుడి మీద అని కాశీనాథ భార్య వైపు చూశాడు.


లలితమ్మ వెంటనే అందుకుంది. అవును పంతులు గారూ! పెళ్లి కొడుకుది కుజ గ్రహం. మన వాళ్లేనండీ. వాళ్ళ పూర్వీకులు అక్కడే సెటిల్ అయ్యారు.


ఆ అబ్బాయి మన సుందరి లేదూ.. అదేనండీ మా అమ్మాయి సుందరి. దాన్ని ఏదో శాటిలైట్ సిగ్నల్స్ లో చూసి మనసు పారేసుకున్నాడు.


మేమూ సరేనన్నాం.. ఎంతైనా అల్లుడు గ్రహాంతర వాసి అని చెప్పుకోవడం భలేగా ఉంటుంది అంటూ భర్త భుజాన్ని తన భుజంతో రాసింది.


ఆయన వెంటనే తేరుకుని అవును అవును అంటూ నీళ్లు నమిలాడు.


పంతులు గారు శూన్యంలోకి చూస్తూ ఉండిపోయారు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract