Sunkara Hrao

Tragedy

5.0  

Sunkara Hrao

Tragedy

ఇదే నేటి న్యాయం

ఇదే నేటి న్యాయం

9 mins
232ఆల్వాల్ యువజన సేవా సమితి రెండవ వార్షికోత్సవము .

సభా ప్రాంగణము సమితి సభ్యులతో క్రిక్కిరిసిపోయింది.

విద్యావoతులు ,పెద్ద పెద్ద వుద్యోగస్తులు సమాజానికి సేవ చేయాలని స్ఠాపించుకున్నసంస్థ అది . 

వందకు మించిన స్త్రీ పురుష యువజన సభ్యులు చల్లుకున్న హోలీ రంగులతో ఇంద్రధనుస్సును తలపించేలా రంగు రంగుల సీతాకోక చిలుకల్లా సభా ప్రాంగణాన్ని కన్నుల పండుగ చేస్తున్నారు .

వుత్తర భారతీయులకు ఆ రోజు హోళీ పండుగ .

దక్షిణ భారతీయులకు ముఖ్యంగా తెలుగువారికి వసంతోత్సవము . పేరులు వేరైనా ,జరిగే వేడుక ఒక్కటే . వేదిక మీద సెక్రెటరీ సూర్య ,ప్రెసిడెంట్ ఆదిత్య , ట్రెజరర్ నివాళి ఆసీనులై వున్నారు . అందరి నిరీక్షణ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఝాన్సీ కోసం మాత్రమే.

దాదాపు వందకు మించిన సమితి సభ్యులు క్రమశిక్షణతో న్నిశ్శబ్దం గా కూచుని వున్నారు . ఒకవైపువార్షికోత్సవము.

మరొకవైపు హోళీ పండుగ . రసాయనిక రంగుల వాడకాన్ని నిషేధించిన సమితి ఆశయాలకు అనుగుణంగా బుక్కాలు మాత్రమే చల్లుకొని ఆసoవత్సరము చేయవలసిన కార్యక్రమాల వివరణ కోసం యెదురు చూస్తున్నారు. చిన్నపాటి గుసగుసలు తప్ప మాటలు వినిపించని క్రమశిక్షణ మూర్తీభవించినట్లు వుంది వాతావరణం.అటువంటి వాతావరణాన్ని భగ్నం చేస్తూ యేడుపులు , పెడబొబ్బలతో సభా ప్రాంతం ఒక్కసారిగా హోరెత్తిపోయింది

హఠాత్తుగా వేధికనుండి దూకిన సూర్య పరుగున వచ్చి కోలాహలం మధ్య చేరిపోయాడు .

చేతిలో వున్న ఆరు సంవత్సరాల బాలిక శవంతో స్పృహ కోల్పోయెలా వున్న రాములమ్మను చూస్తూ ,ఆమెకు సేవలు

చేస్తున్న ఝాన్సీని అయోమయంగా చూశాడు .

రాములమ్మ.. ప్రతిరోజూ సభా ప్రాంగణాన్ని వూడ్చి పరిశుభ్రం గా వుంచే పనిమనిషి . ఆమె చేతిలో ఆరేళ్ళ పసిపాప నిర్జీవ దేహం .

“సూర్యా !జరిగిపోయిన ఘోరాన్ని చూడు .

పాలుకారే పసిపాప లక్ష్మి , మన రాములమ్మ చిన్నకూతురు

ఆఆలు దిద్దే ఆరేళ్ళ వయసు .అందరితో కలిసి రంగులు చల్లుకోవాలని ఆరాటపడి అత్యాచారానికి గురై ప్రాణాలు కోల్పోయింది . తల్లి రాములమ్మ జరిగిన ఘోరానికి తట్టుకోలేక సొమ్మసిల్లి పోతోంది . యెక్కడో యేదో కంపెనీలో వాచ్మన్ గా పనిచేస్తున్న తండ్రి రాములుకు కూతురికి జరిగిన దారుణం తెలియను కూడా తెలియదు .మనం సంఘంకోసం రక్తం దానం చేశాము.చలివేంద్రాలు పెట్టి దాహార్తిని తీరుస్తున్నాము .

యువజనులకు ఆటలపోటీలు ,సాహిత్య పోటీలు పెట్టి యేదో సాధించినట్లు పొంగిపోయాము .

సూర్యా!మన ప్రక్కనే వున్న హంతకుని ,రేపిస్టుని గుర్తించలేక పోయాము .

మన చెల్లి వంటి పాలబుగ్గల నిర్భయను ఘోరంగా చిదిమేశాడు.

మనం ఘోరంగా ఓడిపోయాము . మన కాలనీలో ,మనవారికి జరుగుతున్న్ ఘోరాన్ని నిరోధించలేక పోయాము.

ఫెబ్రవరి నుండి యిప్పటివరకు మన గ్రేటర్లో పిల్లలమీద జరిగిన లైంగిక వేదింపులు 42 పైమాటే . దేశ వ్యాప్తంగా ప్రతిరోజూ పిల్లమీద జరుగుతున్న ఘోరాలు 168.

మనది ఈరోజు వార్షిక దినము . వుత్సాహంగా జరుపుకోవాలని కాంక్షించాము . కానీ పాలుగారే పసిపాపను కాటికి పంపించే కార్యక్రమాన్ని జరుపుకోవలసిన దుర్దినము

వచ్చింది . కాముని దహనం చేయవలసిన రోజున కనీసం లోకం తెలియని ఆరేళ్ళ పసిపాను కాటికి పంపి దహనం చేయవలసిన దుస్థితి వచ్చింది .”

భోరున యేడ్చేసింది ఝాన్సీ.

ట్రెజరర్ నివాళి వచ్చి ఓదార్చింది . సమితి సభ్యులు జరిగిన ఘోరాన్ని తెలుసుకొని ఆవేశంతో వూగిపోయారు .

అందరి వుద్రేకాల్ని గమనించిన సూర్య .. “దయచేసి సావధానంగా నామాటలు వినండి . యిది వుద్రేకంతో ఆవేశ పడే సమయం కాదు . అత్యాచా రానికి గురై మరణించిన చిరంజీవిలక్ష్మి మన సహోదరితో సమానం.

ఝాన్సీ చెప్పింది అక్షర సత్యం . నిజమే యెందరికో రక్తాన్ని దానం చేసి యెంతో మంది ప్రాణాలు కాపాడాము. కానీ మన గల్లీలో వుంటున్న రాములమ్మ పసిబిడ్డ ప్రాణాలు రక్షించ లేక పోయాము . యిది మన అసమర్ధతకు వుదాహరణ .

అసలు జరిగిన ఘోరాన్ని యెవరైనా గమనించి వుంటే దయచేసి బయటకు చెప్పకండి . మనం గొడవచేస్తే పోలీస్ వస్తారు . కేసు పెడతారు .లంచాలు బుక్కి కేసు మూసేస్తారు.”

“అన్నా!పోలీస్ వచ్చారు . అటుయిటు తిరిగారు . అమ్మాయి ఇనుప చువ్వమీద పడి చనిపోయిందని చెప్పి

వెళ్ళిపోయారు .”

ఒక యువకుడు చెప్పాడు.

“అయితే సరే!పాప తండ్రిని పిల్చుకు రండి . మన బస్తీ దవాకాన డాక్టరమ్మను తీసుకు రండి .ముందు రాములమ్మ ను రక్షించుకోవాలి .

రాములమ్మ ను ఆమె భర్త రాములు వచ్చేంతవరకు కాపాడడం మన ప్రస్తుత కర్తవ్యం.”

సూర్య మాటలు వింటూనే సమితి సభ్యులు డాక్టర్ కోసం, రాములు కోసం పరుగులుతీశారు .డాక్టర్ క్రాంతి వచ్చి రాములమ్మకు ట్రీట్మెంట్ యిచ్చిoది 

ఝాన్సీకి ధైర్యం చెప్పింది . రాములమ్మ ఒడిలో వున్న లక్ష్మిని పరీక్షించి తనను వేరే గదిలోకి తరలించమని చెప్పి తనతోబాటు యిద్దరు అమ్మాయిలను తోడు రమ్మని కోరింది . నివాళితో బాటు మరో సభ్యురాలు డాక్టర్ర్తో వెళ్లారు . పదిహేను నిమిషాల తర్వాత శోకవదనంతో వచ్చిన డాక్టర్ క్రాంతి మాటలు రానట్లు మూగబోయి శిలా విగ్రహం లా నిలబడిపోయింది.                                               “డాక్టర్ ! లక్ష్మి యెలా చనిపోయింది?అసలు ఆ చిన్నారి ఇనుప చువ్వ మీద యెలా పడిపోయింది ?” సూర్యా ఆదుర్దాగా ప్రశ్నించాడు . డాక్టర్ క్రాంతిసూర్యవంకజాలిగాచూస్తూ                “సూర్యా!నేను నా ఇరవై సంవత్సరాల సర్వీస్ లో యింతటి దారుణమైన ఘోరాన్ని చూడలేదు . చెప్పాలంటేనే వళ్లు

జలదరిస్తోంది . ఈ చిన్నారి పైన సామూహిక అత్యాచారం జరిగింది . ఒకరికన్నా యెక్కువమంది అత్యాచారం చేసి చంపేశారు . నా అనుమానం మొదటి అత్యాచారానికే ప్రాణాలు కోల్పోతే ప్రాణం లేని పసిపాప దేహంతో అమానుషంగా ప్రవర్తించారు అనిపిస్తోంది. కనికరం లేని కామాంధులు చివరకు ఒక ఇనుపచువ్వను కంఠంలో గుచ్చి జరిపిన ఘోరానికి మరో రూపాన్ని యివ్వాలని ప్రయత్నించారు . ఒకనాటి నిర్భయ వుదంతాన్ని మరోసారి పునరావృతం చేశారు . నా అనుమానం ప్రకారం యిద్దరు లేక ముగ్గురు ఈఘోరకలికి భాగస్వాములై వుంటారు అనిపిస్తోంది . పాలబుగ్గల పసిపాప అనే కనికరం కూడా చూపని మృగాలు దేహాన్నిచీల్చి ఆకలి తీర్చు కున్నాయి.

మనరాష్ట్రoలో యింతవరకు జరగని అత్యంత హేయమైన సంఘటనగా చరిత్రలో నిలిచిపోతుoది.”                                  డాక్టర్ జరిగిన దారుణాన్నియింకా చెప్పలేనట్లు మౌనoగా కన్నీటితో నిలిచిపోయింది . డాక్టర్ క్రాంతి మాటలకు తట్టుకోలేని ఝాన్సీ ఆపుకోలేని దుఖం తో వుబికి వస్తున్న కన్నీటిని ఆపుకోలేక బేలగా సూర్యాని చూసింది .                                         “ఝాన్సీ !పాపం చిన్నారిలక్ష్మి అన్యాయమైపోయింది . చిన్నారిని వేటాడిన మృగాలను ?”

ఆగిపోయాడు సూర్య  

 తట్టుకోలేని బాధతో తపించిపోతున్న ఝాన్సీని  

డాక్టర్ క్రాoతి,నివాళిసముదాయించారు .

స్పృహ వచ్చిన రాములమ్మ విగతజీవిగా వున్న తన రెండో కూతురు లక్ష్మి మృత దేహాన్ని చూసి తట్టుకోలేక భోరున విలపించింది.

అప్పుడే వచ్చిన రాములు కనిపించిన దృశ్యాన్ని చూసి జీర్ణించుకో లేక పిచ్చిచూపులు చూశాడు.

సూర్య రాముల్ని దగ్గరకుతీసుకొని సముదాయించాడు .

“రాములు అన్న!ఘోరం జరిగిపోయింది .మనం యెంత ఏడ్చినా చనిపోయిన లక్ష్మి తిరిగిరాదు . మాకంటే వయసులో నువ్వే పెద్దవాడివి. నీకు చెప్పగలిగిన వయసు మాకు లేదు.”

“యింత గోరం యెలా జరిగింది సారో ?యెవరు చేసిన్రో చెప్పున్రి . ఆనా కొడుకుని చంపి బొంద పెడతా . పొద్దుగాల లేచింది మొదలు బాపు రంగులే అంటూ నా వెంట బడింది . బిడ్డా!నేను మద్దేనం అచ్చేటప్పుడు తెస్తలే బిడ్డా అని నచ్చజెప్పి డూటీకి  బోయినా .యింతలో ఈగోరం జరిగిపాయే .”

రాములు యేడ్చేశాడు .

“రాములన్నా! ఆడుయెవడో తెలిస్తే మేమే చంపెటోల్లం. తెలుసుకుందాము . లక్ష్మి ఆత్మకు శాంతి చేద్దాము . నీకు యిద్దరు కూతుర్లు కదూ?”

సూర్య అడిగాడు . 

“ఔమల్ల.. యిద్దరు సారో !”

సమాధానం యిచ్చాడు రాములు

“మరి రెండో అమ్మాయి యెక్కడ వుంది?”

“గది మా రాములమ్మకే యెరిక . ఔ! మన స్వాతి యాడుంది?”

“యేమో నాకేం యెరక?లక్ష్మి పాయిన బాదలో వుంటి . గమనించలే .”

ఆదుర్దాగా సమాధానం చెప్పింది రాములమ్మ .

“అమ్మా!నువ్వు గాబరా పడకు . నేను చూసి వస్తాను .”

నివాళి మరికొంతమంది సభ్యులతో బయటికి వెళ్ళిపోయిoది.

బయటకు వెళ్ళిన నివాళి బాధతో తిరిగి వచ్చింది .

ఆమె వెనుక స్పృహలేని స్వాతిని చేతులమీద మోసుకుంటూ వచ్చారు యువజన సమితి సభ్యులు.

ఝాన్సీ ముందుగా స్పందించి స్వాతిని తన చేతుల్లోకి తీసుకుంది . డాక్టర్ క్రాంతి స్వాతిని పరీక్షించి

“తనకు వచ్చిన ప్రమాదం యేమీ లేదు . షాక్ తో స్పృహ తప్పింది . ముందు మంచి నీరు త్రాగించండి . నేను గ్లూకోజ్ పంపిస్తాను . నీటిలో కలిపి త్రాగించండి .”

డాక్టర్ క్రాంతి యిద్దరు సభ్యులను వెంటతీసుకొని మౌనంగా వెళ్లిపోయింది. నీరు త్రాగి కొంచం తెరుకున్న స్వాతి ఝాన్సీ ని చూస్తూ

“అక్కా!చెల్లి లక్ష్మి యెట్లున్నది?”

నీరసంగా కళ్లు తెరుస్తూనే అడిగింది .

“మంచిగానే వుంది . నువ్వు యెందుకు బేవోష్ అయినవు?”

ఝాన్సీ అడిగింది . అప్పటికే లక్ష్మి మృత దేహాన్ని గదిలోనే వుంచి సమితి సభ్యులు అడ్డంగా నిలబడిపోయారు .

“అక్కా!పొద్దుగాల సంది లక్ష్మి హోలీ రంగులు కావాలని బాపును సతాయించుడు షురూ చేసింది . బాపు మద్దెగాల తెస్తానని డూటీకి పోయిండు. లక్ష్మి యేడ్చుకుంటూ బయటకు పోనాది . నేను యెంత సముదాయించినా ఇనలేదు . అప్పుడు మాఇంటి పక్కనున్న రాజేశ్ అన్న, గాయనతో బాటు అన్న దోస్తులు యిద్దరు వచ్చిన్రు.

లక్ష్మి రంగుల గోల విని మేము కొనిస్తమని దానిని వెంట బెట్టుకొని పోయిన్రు. నేను అద్దని యెంత మొత్తుకున్నాఅది నామాట ఇనలేదు . చెల్లిని ఆల్లు యెంటబెట్టుకొని గా దిక్కునున్న పొదల్లోకి పోతుంటే బయంతో అరిచిన . అందులో ఒకడు అచ్చినోరు మూసుకో

లేకుంటే చంపుతనని కొట్టిండు . గంతే నేను కింద పడిపోతి.

ఇప్పుడు గిక్కడే కళ్ళు తెరిస్తి .”

స్వాతి చెప్పింది విని రాములు , రాములమ్మ ఏడ్చు కుంటూ వచ్చి స్వాతిని అక్కున చేర్చుకున్నారు .

సూర్య లేచాడు . సభ్యులందరిని పిలిచి చెప్పాడు .

“అందరూ జాగ్రత్తగా వినండి . మన రెండవ వార్షికోత్సవము రోజున దారుణమైన సంఘటన జరిగిపోయింది . మన చీన్నారి చెల్లాయి లక్మి చనిపోయింది.

మనం యెంత ప్రయత్నించినా లక్ష్మిని తిరిగి తెచ్చుకో లేము. పేద దంపతులు రాములు రాములమ్మ . వారికి జరిగిన అన్యాయాని పూర్తి న్యాయం చేయలేము .

కానీ మనకు చేతనైన సాయం చేద్దాము . రెoడో చెల్లి స్వాతిని మనం దత్తత తీసుకుందాము . తన ఆలనా పాలన తో బాటు చదువు సంధ్యల బాధ్యత మనం తీసుకుందాము .

మన సభ్యులు వంద మంది. మనం తల్చుకుంటే యిది మనకు ఒక సమస్యే కాదు . యిది నాఒక్కడి నిర్ణయం కాదు.

మన అందరిదీ . యెవరికైనా అభ్యంతరం వుంటే బలవంతం యేమీ లేదు . అభ్యంతరమున్న వారు చేతులెత్తి తెలియచేయ వచ్చు .”

సూర్య మాటలకు అందరూ కరతాళ ధ్వనులతో ఆమోదం తెలిపారు .

“అందరికీ ధన్యవాదాలు . యిప్పుడు అందరూ ఇళ్లకు వెళ్లిపొండి. జరిగిన సంఘటన గురించి యెవరికీ చెప్పకండి .

ఈ రాత్రి కామదహన కార్యక్రమం వుంటుంది. సభ్యులందరూ రాత్రి యేడుగంటలకు తప్పక రండి.

 అందరం చర్చించి నిర్వహిద్దాము .

చిరంజీవి లక్ష్మి అంత్యక్రియలు రేపు మనమే చేద్దాము.

నాతోబాటు ఝాన్సీ ,నివాళి మరో నలుగురు యెక్జిక్యూటివ్ మెంబర్స్ వుంటే చాలు . జరగవలసిన

పనులు పూర్తి చేసుకొని కామదహనానికి కావలసిన అన్నీ యేర్పాట్లు పూర్తి చేస్తాము.”

మిగిలిన సమితి సభ్యులందరూ వెళ్ళిపోయారు .

లక్ష్మి నిర్జీవ దేహoతో రాములు ,రాములమ్మ ,స్వాతి ఝాన్సీ ,నివాళి ,సూర్య తో బాటు నలుగురు యెగ్జిక్యూటివ్ సభ్యులు మిగిలిపోయారు . 

రంగు రంగుల కాంతులతో కళకళ లాడవలసిన సభా ప్రాంగణం శ్మశాన నిశ్శబ్దంతో చావు కళతో భయంకరంగా భాసించింది.

లక్ష్మి మృత దేహాన్ని రాములు యింటికి చేర్చారు . బంధు మిత్రుల రోదనతో రాములమ్మ ఇల్లు దద్దరిల్లి పోయింది .

సూర్య తన స్వంత డబ్బు రాములు చేతిలో పెట్టి

“రాములు అన్న!వచ్చిన బంధువుల విషయం చూసుకో . నీకు మేము తోడుగా వుంటాము . రేపు లక్శ్మి అంత్యక్రియలు చేద్దాము . యికనుండి స్వాతి బాధ్యత మాదే . మేము యిక్కడే సమితి ఆఫేసులో వుంటాము . అన్న!మీకు యేదికావాలన్న అడుగు .సందేహించకు .”

అందరూ తిరిగి సమితి ఆఫీస్ లోకి వచ్చేశారు .

             *******

“సూర్యాఅన్న!యిటువంటి పరిస్థితిలో మనం రాత్రికి కామదహనం చేయడం అవసరమా?”

కొంతమంది సభ్యులు అడిగారు.

సూర్యా సమాధానం చెప్పకముందే ఝాన్సీ చెప్పింది .

“అవసరమే . లక్ష్మిమరణానికి కామదహనానికి సంబంధం వుంది . దానివిషయం నాకు సూర్యకు వదిలేయండి . మేము చేస్తున్న పనికి సహాయం చేయండి .ముందు మీరు రాములు ఇంటికి వెళ్ళి వారి బాధలు ,బాధ్యతలు గమనించండి .”

ఝాన్సీ సూచనతో నివాళి ,నలుగురు సభ్యులు బయటకు వెళ్ళిపోయారు. హమ్మయ్య అనుకున్న సూర్య ఝాన్సీ వంక సూటిగా చూస్తూ

“ఝాన్సీ !నేను ఒక ప్రశ్న వేస్తాను నాకు సూటిగా సమాధానం చెప్పాలి . లక్ష్మి కి జరిగిన ఘోరాన్ని విన్నప్పటినుండి నీ మనసు పడుతున్న బాధ ,స్పందన నాకు తెలుసు. నువ్వు చిన్నారులపై జరుగుతున్న లైంగిక వేధింపుల చిట్టా విప్పి నప్పుడే నువ్వు నాకు విసిరిన సవాల్ అర్ధమైపోయింది.కనీసం మన పరిసరాలను కూడా రక్షించుకోలేక పోతే సమితులెందుకు ?పెద్దపెద్ద వుపన్యాసాలు చెపుతున్న మనం యెందుకు?యిదేగా నీ మనసులో కల్లోలం రేపుతున్న స్పందన? .”

ఝాన్సీని సూర్య తీక్షణంగా చూస్తూ అడిగాడు .

“నేను సూటిగా సమాధానం చెప్పనని నువ్వు యెందుకు భావించావు? నా మనసులోని అలజడిని గ్రహించిన నువ్వు  పరిష్కారాన్ని చూపించి నా అలజడి ని తొలగించు.”

సూటిగా చెప్పేసింది ఝాన్సీ .

“ఝాన్సీ!నేను యేమిటో నీకు తెలుసు. నేను యేమిచేయాలనుకుంటున్నానో కూడా తెలుసు . కానీ అంతకుముందు  మనం చేయవలసిన పనులు  వున్నాయి. అవేమిటో నీకు తెలియనివికావు . మనo ఒకసారి బయటకు వెళ్ళి పరిసరాలు గమనిస్తే బాగుంటుంది . అలాగే రాముల్ని రాములమ్మని కలిసినట్లు కూడా వుంటుంది . నువ్వు స్వాతిని నీతో తీసుకురా . మరొకసారి సరియైన స్థావరాన్ని తెలుసుకుందాము . అప్పుడు యేమి చేయాలో ,యెలా చేయాలో నిర్ణయం తీసుకుందాము .”

ఒక్కసారిగా ఝాన్సీ సూర్య చేతిని తనచేతిలోకి తీసుకొని అభినందన తెలియచేసింది . ఆమె పెదాలమీద విరిసిన తృప్తీతో కూడిన చిరునవ్వు సూర్య చూపులనుండి తప్పించుకోలేక పోయింది .

                 *****

సమయం రాత్రి యేడు గంటలు . రాములు ఇంటికి కొంచం దూరంలో కామదహనానికి పెద్ద యెత్తున యేర్పాట్లు జరిగాయి . కాలనీ వాసులతో బాటు ఆల్వాల్ యువజన సేవా సమితి సభ్యులతోఆప్రాంతం కిటకిటలాడిపోయింది.పూర్తిగా రంగులతో తడిసిపోయి ముఖం నిండా బుక్కాలు చల్లుకున్న వ్యక్తులు ఆనవాలు పట్టడానికి వీలు లేకుoడా వున్నారు . రాములు ఇంటి సభ్యులు , రాములు ఇంటి ప్రక్కయింట్లో వున్న బీహారీలు తప్ప అందరూ తమకు తోచిన పాత సామాను తెచ్చి మంటల్లో వేసి తమ ఆనందాన్ని పంచుకుంటున్నారు .

అంతటి గందరగోళంలో కూడా బీహారీల యింటి నుండి వస్తున్న పాటల శబ్దం కర్ణకటోరంగా వినిపిస్తుంటే యెవరు యేమీ అనలేక మండుతున్న మంటల్ని చూస్తూ వుండిపోయారు . అప్పుడు వచ్చింది ఒక రాయల్ యెన్ఫీల్డ్ బైకు . బీహారీల యింటి ప్రక్కనే పార్క్ చేసి బైకు మీద వచ్చిన వ్యక్తి గుంపులో కలిసిపోయాడు . ముఖమ్మీద పులుముకున్న రంగులతో ఆనవాలు పట్టడానికిసాధ్యం కానీ ఆవ్యక్తి ఝాన్సీ మాత్రమే గమనించేలా ఒక చూపుచూసి హోలీ ఆడుతున్న జనాలలో కలిసిపోయాడు .


అర్ధరాత్రి రాములు ఇంట్లో నుండి వినిపిస్తున్న శోకాలు కాలనీ వాసుల గుండెల్లో కరుణను రేకెత్తిస్తుంటే

కామదహనం కోసం మండుతున్న కట్టెలు అగ్నిజ్వాలల్ని కురిపిస్తుంటే అనుకోని సంఘటన జరిగిపోయింది .

అగ్నిజ్వాల వ్యాపిoచి బీహారీల యింటి ప్రక్కనున్నరాయల్ యెన్ఫీల్డ్ పెట్రోల్ టేoకు అంటుకొని ఒక్కసారిగా పేలిపోయింది . జనాలు భయంతో చెల్లా చెదురు అయిపోయారు . బైకు నుండి వ్యాపించిన మంటలు ప్రక్కనున్న యింటికి అంటుకొని చూస్తుండగానే భస్మం చేసేశాయి .

              *****

మర్నాటి పేపర్ లో వచ్చిన వార్త ఇలా వుంది  “ఆల్వాల్ కాలనీలో జరిపిన కామదహనం పండుగ ఒక ఇంటిని కాల్చేసింది. అందులో వున్న బీహారీలు మద్యం మత్తులో బయట పడలేక మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు . పోలీస్ చెప్పిన వివరాల ప్రకారం వీరు రౌడీ షీటర్లని , అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే కిరాతకులని తెలిసింది . మంటలను ఆర్పిన ఫైర్ సిబ్బందికి లభించిన ఆధారాలు అన్నీసెక్స్ ను ప్రేరేపించే మందులు , అశ్లీల వీడియోలు లభించడాన్ని అర్ధం చేసుకోలేక పోతున్నారు .


తమ కాలనీలో యిటువoటి అసాంఘిక శక్తులు వుండడాన్ని కాలనీ వాసులు జీర్ణించుకోలేక పోతున్నారు .”

ఆల్వాల్ యువజన సేవా సమితి కార్యాలయంలో వార్త చదివిన సూర్య

“ఝాన్సీ! ఝాన్సీ లక్ష్మీబాయి గారిలా అవతారమెత్తి

కిరాతకులను మట్టుబెట్టి విజయం సాధించావు . ఇదేనేటి న్యాయం అనిరూపించావు .  కాంగ్రాట్స్ !”

సూర్య చేసిన కామెంట్ కు చిన్నగా నవ్వేసిన ఝాన్సీ

“సూర్యా !ఈ విజయానికి కారణం తమరే  .పాలబుగ్గల నిర్భయ చిరంజీవి లక్ష్మిని చిదిమేసిన బీహారీలు ధర్మేంద్ర, రాజేశ్, నితీశ్ లవంటి దుర్మార్గులను మట్టుపెట్టడంలో నువ్వు చూపిన సాహసం నాకు మాత్రమే తెలుసు.లక్ష న్నర రూపాయల కొత్త బైక్ ను బీహారీల యింటి ప్రక్కన పార్క్ చేసి పెట్రోల్ టేoకు కనెక్షన్ ను పీకేయడం నాకు తెలుసు . నువ్వు చెప్పిన మాటలు నేను మర్చిపోలేదు . రాత్రీకి జరిగేది కామదహనము కాదు కాముకుల దహనం అని .”

“తల్లీ ఝాన్సీ !చిన్న బిడ్డను వీపుకు కట్టుకొని బ్రిటీష్ వారిని దునుమాడిన నీముందు నేను చేసిన చిన్నపనికి సాహసం అoటుoటే నాకే నవ్వు వస్తోంది.  మనది చిన్న ప్రయత్నం మాత్రమే. ప్రేరణ కామదహనం నాడు కాముకుల చేతుల్లో బలైపోయిన పాలబుగ్గల లక్ష్మీదీ.

జరిగిన ఘోరానికి స్పoది0చిన  నువ్వు నాలో ప్రకంపనలు రేపి సవాల్ విసిరావు . నువ్వు అన్నావు లక్షన్నర రూపాయల బైక్ అని ..అవును నిజమే కానీ కోటి లక్షలు పోసినా చిన్నారి ప్రాణం తిరిగి తేగలమా? నిజమే డాక్టర్ క్రాoతి మేడమ్ మాటలు విన్నప్పుడే వెళ్ళి ముగ్గురునీ చంపేయాలనిపించింది . కానీ కత్తికంటే కలoగొప్పది అంటారు . కలo అంటే బుద్ధి ఆలోచన . దానిప్రేరణతో  కూడా విజయం సాధించ వచ్చు అనిపించింది .కళ్ళముందు జరిగిపోయిన సంఘటనే మనకు ప్రేరణ అయ్యింది. ప్రయత్నించాము సాధించాము.”  “అవును సూర్యా!దీనిని మన యువజన సేవా సమితి సాధించిన గొప్ప విజయంగానే భావిస్తున్నాను . యెవరికీ తెలియ వలసిన అవసరం లేని విజయం యిది.”

“యిది విజయమని నేను భావించను. విజయాలను మించిన విజయం. లోకకంఠకులను సంహరించిన యెందరో మనకు ఆదర్శంగా నిలిచారు. ఇది రేపు మనపిల్లలు క్షేమంగా తిరగవలసిన సమాజం . దానిని మనమే సరిదిద్దులోవాలి. నీ మనసును తాకిన చిన్నారి ప్రేరణ ముగ్గురు సంఘవిద్రోహులను అగ్నిలో బూడిద చేసింది. నేను నీ ఆలోచనలకు అస్త్రాన్ని మాత్రమే . మరినువ్వో అస్త్రాన్ని విజయవంతంగా ప్రయోగించిన విజయ ఝాన్సీవి”.                                                                    సూర్య మాటలు విని విజయ ధరహాసంతో  పాలబుగ్గల చిన్నారి నిర్భయ లక్ష్మిని తలుచుకుoటూ కన్నీరు తుడుచుకుంది ఝాన్సీ.

                  *****సమాప్తం ****


                                       

   

 

 


Rate this content
Log in

Similar telugu story from Tragedy