STORYMIRROR

Dinakar Reddy

Abstract Inspirational Thriller

4  

Dinakar Reddy

Abstract Inspirational Thriller

ఘాజీ సినిమాలో..

ఘాజీ సినిమాలో..

1 min
661

నేను ఫార్వర్డ్ టార్బిడోలను మాన్యువల్ గా లాంచ్ చేస్తాను అన్నాడు అర్జున్ వర్మ. 

అది నీ ప్రాణాలకే ప్రమాదం అన్నాడు దేవరాజ్. ఇప్పుడు నేను ఈ పని చేయకపోతే అది నా వృత్తికే కాదు,దేశానికి కూడా అన్యాయం చేసినవాణ్ణి అవుతాను అన్నాడు అర్జున్. కెప్టెన్ చేసిన ప్రాణ త్యాగానికి అర్థం లేకుండా పోతుంది.


అతడి కళ్ళలో ఏమాత్రం భయం కనిపించలేదు. అతణ్ణి ముందు భాగంలోనికి వెళ్ళనిచ్చి ఆ మార్గాన్ని మూసివేశారు.


సమయానికి అతను అనుకున్న పని చేయగలిగాడు అర్జున్. కానీ అంతలో అతడి కాలు చైన్ కి ఇరుక్కుపోయింది.


లీకేజీ అవడంతో అక్కడ చేరిన సముద్రపు నీటిలో ఒక జీవి అతడి కాలిని కొరికింది.


అతి కష్టం మీద చైన్ నుంచి కాలిని విడిపించుకుని లోపలికి చేరుకున్నాడు. శత్రువుల మీద విజయంతో S21 ఆనందంతో నిండింది.


అర్జున్ కొద్ది కొద్దిగా స్పృహ కోల్పోయాడు.

 


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract