Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

దొరికిన రాఖీ

దొరికిన రాఖీ

1 min
349


శ్రావణ మాసం వస్తోందని గది శుభ్రం చేస్తుంటే వంట గది అరలో చిన్న డబ్బా దొరికింది. పెద్దగా సామాన్లు లేవు కాబట్టి నేను వంట గది మొత్తం ఎప్పుడూ కదిలించలేదు.


ఆ డబ్బా తెరిస్తే ఒక రాఖీ పండగ శుభాకాంక్షల కార్డ్ కనిపించింది.


ఆ ఫోటోలో ఒక అమ్మాయి తన సోదరుడికి రాఖీ కడుతున్నట్లు ఉంది. బాక్సు లోపల ఒక ప్యాకెట్ లో కుంకుమ, ఇంకో ప్యాకెట్ లో బియ్యపు గింజలు ఉన్నాయి. మరో చిన్న ప్యాకెట్ లో రాఖీ కూడా ఉంది.


చూస్తే ఈ డబ్బా ముందు ఈ గదిలో అద్దెకున్న వారిదేమో అనిపించింది. రాఖీ కట్టుకున్నట్లు లేదు.


ఎవరికి ఇవ్వాలో తెలీక ఆ రాఖీ డబ్బాను అక్కడే పెట్టేసి అందులోని కార్డు తీసుకున్నాను.


గోడ పైన అతికించి పెట్టాను. రాఖీ పండగ ఫోటో రోజూ నాకు కనిపిస్తుంది. ఏమో! ఈ రాఖీ కోసం ఎవరైనా తిరిగి రావొచ్చేమో..


Rate this content
Log in

Similar telugu story from Abstract