దీపమా దారి చూపుమా
దీపమా దారి చూపుమా


ప్రియమైన డైరీ,
ఇవాళ భారత్ మొత్తం లాక్ డౌన్ లో పన్నెండో రోజు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ గారు ప్రజలను ఈ రోజు రాత్రి తొమ్మిది గంటలకు తొమ్మిది నిమిషాల పాటు ఇళ్ళ వెలుపల కానీ బాల్కనీలో కానీ దీపం వెలిగించమన్నారు.
దేశపు ఏకత్వాన్ని ప్రతిబింబించేలా కరోనాపై పోరుకు అందరినీ జాగరూకతతో మెలిగేలా చేయాలని ఉద్దేశ్యం కాబోలు.
మామూలుగా పెద్దలు ప
్రతి రోజూ ఇంట్లో
పూజ గదిలో దీపారాధన చేయమంటారు.
దీపం వెలిగించడం అంటే సకారత్మక ఆలోచన చేయడం.జీవితంలో కష్టాలు శాశ్వతం కాదని చీకటి తరువాత వెలుగు వస్తుందనీ అలాగే ప్రతి సమస్యకూ పరిష్కారం దొరుకుతుందనీ ఆశా భావం కలిగి ఉండాలి అనే దీపారాధన వెనుక అంతరార్థం.
రేపు అనేది తప్పక మంచిగా ఉంటుందని ముందుకు సాగమని ఈ జాతి అంతర్లీనంగా దీపారాధనకు అంత విశిష్టత ఇచ్చింది.
ఈ రోజు వెలిగించే దీపాలు ఈ కరోనా మహమ్మారి నుండి మానవాళిని కాపాడుకునే శక్తిని సజారాత్మకతను ఇస్తాయని ఆశిద్దాం.