Dinakar Reddy

Abstract Children Stories Fantasy

3  

Dinakar Reddy

Abstract Children Stories Fantasy

డింభకా సాహసము శాయరా

డింభకా సాహసము శాయరా

1 min
237


డింభకా సాహసము సేయరా. దేవి ప్రసన్నమవుతుంది.

పాతాళ భైరవి పిలుస్తోంది రా. 

పాతాళ బిలానికి మార్గము చేస్తాను అని హీరోని మంటల్లోకి దూకమంటాడు.

అప్పుడు మన ఎన్టీవోడు అదేనండీ బాబూ మన తోట రాముడు అనుమానంగా చూస్తాడు. 

మాయల ఫకీరు తల ఒక పక్కకు తిప్పి కళ్ళు రెండూ దగ్గరకు చేస్తూ రాకుమారి లభిస్తుందిరా అని తోట రాముడి మనసును ఆధీనంలోకి తెచ్చుకుంటాడు.


సాష్టాంగ నమస్కారం వంకతో తోట రాముడిని బలి ఇచ్చి పాతాళ భైరవిని చేజిక్కించుకోవడానికి చేసే ప్రయత్నంలో విలనిజంలోని కామెడీని తరువాత రాకుమారిని వివాహం చేసుకోవడానికి చేసే ప్రయత్నంలో సహజమైన పురుషుని యొక్క స్వభావాన్ని ఇలా ప్రతి సన్నివేశాన్ని రక్తి కట్టిస్తుంది మాయల ఫకీరు పాత్ర.

పాతాళ భైరవి సినిమా మొత్తంలో అందరికీ గుర్తుండిపోయే డైలాగ్ కూడా ఈ మాటల ఫకీరు పాత్ర చెప్పేదే. డింభకా సాహసము శాయరా అని మన వాళ్ళు కామెడీగా చాలా సందర్భాల్లో వాడుతూ ఉంటారు.


విలనిజంలో ఎస్వీ రంగారావు గారు..


అవునూ.. నేను తెలుగు ప్రేక్షకులకు ఎస్వీ రంగారావు గారి నటన గురించి చెప్పడమా.. నా మొహం..


(మ్మ్మ్మ్ అంటూ మంత్రాల మర్రి దగ్గర వచ్చే శబ్దాలు పాతాళ భైరవి అంటూ నేను అప్పుడప్పుడూ అరుస్తూ ఉంటాను. భయపడకండే..)


Rate this content
Log in

Similar telugu story from Abstract