STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

దారిద్ర్యం మీద పరిశోధన

దారిద్ర్యం మీద పరిశోధన

1 min
480

ఎందుకు కొంత మంది దారిద్య్రాన్ని అనుభవిస్తున్నారు? ఎందుకు కొందరు మాత్రమే విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు?


అసలు మానవుని ఉనికికి ఏది ఆధారం? డబ్బు అన్నారు ఎవరో. డబ్బు. అవును. డబ్బు కావాలి. మదన్ తెగ మధనపడిపోతున్నాడు.


ఏమిట్రా. ఆర్ట్ సినిమాలు చూశావా ఏమిటి అని స్నేహితుణ్ణి పలకరించాడు నిరుపమ్.


లేదురా. అసలు పేదరికమనే దారిద్ర్యాన్ని గురించి నేను పరిశోధన చెయ్యాలి. ప్రపంచాన్ని తిరగాలి. జ్ఞానం సంపాదించాలి. మదన్ ఆవేశంతో చెప్పుకుంటూ పోతున్నాడు.


నాయనా సిద్ధార్థా! నువ్వు గౌతమ బుద్ధుడిలా అవ్వాలంటే మొదట నీ చుట్టూ ఉన్న సమాజంలోని మంచి, చెడులను గుర్తించు. బుద్ధునికి జ్ఞానోదయం బోధి వృక్షం కింద అయింది.


నువ్వు ఇక్కడ ఉండి ఆలోచించు. ప్రపంచాన్ని చుట్టి రావడానికి ఖర్చు పెట్టే డబ్బుతో ఇక్కడ ఏదైనా మంచి పని చెయ్యచ్చేమో ఆలోచించు. నిరుపమ్ తన సలహా చెప్పాడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract