చిన్ననాటి దూరదర్శన జ్ఞాపకాలు
చిన్ననాటి దూరదర్శన జ్ఞాపకాలు


సంవత్సరాలు గడిచేకొద్దీ పాత మాటలు జ్ఞాపకం వస్తాయి.ఇలాగె నాతో కూడా జరిగింది.
౧౯౮౦ దశాబ్దం మాటలివి.అప్పటిలో దూరదర్శన ప్రసారాలు మాత్రమే ఉండేవి.ప్రతి ఇంట అందరు ఒకే కార్యక్రమం చూసే వారు.
నేననుకుంటాను ఏంటటంటే, అప్పట్లో అన్ని వర్గాల ప్రేక్షకులకు కార్యక్రమాలు ఉండేవి అని.
ఆదివారం నాడు ఉదయం రంగోలి హిందీ చలన చిత్రాల పాటలు, ఉదయం ౯ గంటలకు రామాయణం, లేదా మహాభారతం, ఇంకా చాణక్య , గీత రహస్యం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉండేవి. బొమ్మల కార్యక్రమాలు , వార్తలు, వెండితెర, తెలుగు చలన చిత్రం, ఇంకా ధారావాహిక కార్యక్రమాలు.
ప్రవాసంలో ఉండే వారికి ౨-త్రీ నెలలకు వారి భాష చిత్రం ప్రతి ఆదివారం మధ్యాహ్నం ౧.౩౦ నిమిషాలకు ప్రసారం అయ్యేది.
ఇలా రకరకాల కార
్యక్రమాలతో దూరదర్శన ఒకే ఒక్క రారాజు ల ఉండేది.ప్రాంతీయ భాష కార్యక్రమాలు, జాతీయ కార్యక్రమాలు.ఎన్నో విషయాలు తెలిసేవి.శాస్త్రీయ నృత్యం, శాస్త్రీయ సంగీతం, విశ్వవిద్యాలయ కార్యక్రమం.భాష పట్ల సరైన పట్టు ఉండేది.
ఈ రోజులలో ప్రతి వర్గానికి ఒక వాహిని ఉంది.వార్తలకైతే సరే సరి.అంతూ అదుపు రెండు లేవు.ఇష్టమొచ్చిన పదాలు వాడటం.మజ్జి మజ్జి లో ఆంగ్ల పదాలు.వార్తలు తక్కువ, కబుర్లెక్కువ అయిపోయాయి ఇప్పుడు.పైగా అబద్ధపు వార్తలు.
అందికేనే అని;పిస్తూ ఉంటుంది, ౨౧వ శతాబ్దం కన్నా ౨౦వ శతాబ్దం బావుంది అని.పైగా ఇన్ని వాహినిలు ఉన్న ఒక్క వాహిని కూడా సరైన కార్యక్రమం అందించటం లేదు.దూరదర్శన కేంద్ర కార్యక్రమాలు నయం అనిపిస్తున్నాయి.
ఇలా కొన్ని జ్ఞాపకాలతో
నీ స్నేహితుడు,
రాజా