Raja Sekhar CH V

Children Stories

4  

Raja Sekhar CH V

Children Stories

అహంకారం తగదు

అహంకారం తగదు

3 mins
673



౧౯౮౪ సంవత్సరం నాటి మాట.ఒరిస్సా రాజ్యం భువనేశ్వర్ నగరం నువాపల్లి ప్రాంతం లో శ్యామ్ అనే అబ్బాయి వారి తల్లి తండ్రులతో ఉండేవాడు.ఆ రోజులలో దురదర్శిని అనగా టెలివిజన్ సెట్ అందరి ఇళ్లలో ఉండేవి కావు. చాల తక్కువ ఇళ్లలో ఉండేవి.ఇంటి మెడమీద సంకేత గ్రాహకం అనగా ఆంటిన్నా ఉంటె తెలిసేది ఫలానా ఇంట్లో టీవీ ఉన్నది అని.శ్యామ్ కి చిన్న వయసు. ౭ ఏళ్ళు . టీవీ అంటే ఏంటో ఇష్టం.కానీ వాళ్ళ ఇంట్లో టీవీ లేదు. అందుకే ఇంకో తెలిసిన వారి ఇంటికి టీవీ చూడటానికి వెళ్లే వాడు. అప్పుడప్పుడు సినిమాలు, సినిమా పాటలు లాంటి కార్యక్రమాలు శ్రీ రంగా రావు గారింట్లో చూసేవాడు.


ఒక సారి చాలా రాత్రి అయిపొయింది.రాత్రి పది గంటలకి ఎవరో ఇంట్లో టీవీ చూస్తానని అల్లరి పెట్టాడు.అప్పుడు శ్యామ్ వాళ్ళ నాన్నగారు మరుసటి రోజు టీవీ తీసుకొచ్చేసారు.ఎందుకంటే ఎన్నాళ్లిలా అందరి ఇళ్లలో టీవీ చూస్తాడు !! శ్యామ్ కి చాలా శారద వేసింది. కానీ ఇప్పుడు వాళ్ళ ఇంటికి కూడా పక్కింటి వాళ్ళు టీవీ చోడటానికి రావటం మొదలు పెట్టారు . శ్యామ్ కి చిరాకు మొదలైయ్యింది.కానీ శ్యామ్ అమ్మగారు ఏంటి చెప్పారంటే " శ్యామ్ ! నువ్వు కూడా అందరింటికి వెళ్లే వాడివి కదా .మరి వాళ్ళు ఎప్పుడు విసోగుకోలేదు గా !!" శ్యామ్ మౌనంగా ఏమి అనలేక నిశ్శబ్దంగా కూర్చునేవాడు.ఒక సరి పక్కింటావిడ ఇంటి బయట నుండి శ్యామ్ వాళ్ళ ఇంట్లో టీవీ చూస్తోంది.ఎదో పాపం లే అని అనుకోకుండా , వీధి తలుపు అమాంతంగా శ్యామ్ మూసి వేసాడు. పక్కింటావిడ ఏమి అనలేదు.చిన్న పిల్లాడుకదా ఊరుకుని వెళ్ళిపోయింది.మంచి మనిషి పాపం.

శ్యామ్ వాళ్ళ అమ్మ కోప్పడింది.ఇలా అన్నారు " శ్యామ్ ! మన ఇంట్లో మాత్రమే టీవీ ఉన్నాడని అనుకోవద్దు.అయినా ఎందుకు నీకా అహంకారం ? ఇది తప్పు ! " శ్యామ్ కి ఏమి అర్ధం కాలేదు . తాను ఎం చేసాడో అందులో తప్పు ఏమి అనిపించలేదు.


కొన్ని సంవత్సరాల తరువాత పక్కింటి వాళ్ళకి కూడా టీవీ కొనుక్కున్నారు.౧౯౮౬-౮౭ సంవత్సరం మాట ఇది.అప్పట్లో దూరదర్శన్ లో ప్రతి ఆదివారం రామాయణం ప్రసారం అయ్యేది. ఒక ఆదివారం శ్యామ్ వెళ్లి ఇంట్లో టీవీ పాడైపోయింది. రామాయణం అంటే అందరికి ఇష్టం చూడటానికి.శ్యామ్ కి కూడా ఇష్టమే . ఇక పక్కింటావిడకి ఈ విషయం తెలిసింది.

శ్యామ్ అనుకున్నాడు ఆవిడా శ్యామ్ కి ఇంట్లో కి రానివ్వదేమో టీవీ చూడటానికి.కానీ దాని విరుద్ధమైన ఘటన జరిగింది. ఆవిడ శ్యామ్ ని రామాయణం చూడటానికి పిలిచింది . శ్యామ్ వాళ్ళ అమ్మ ఇలా అన్నారు " చూసేవా శ్యామ్ ! ఆంటీ ఎంత మంచి ఆవిడో ! నువ్వు ఆమెకు టీవీ చూడనివ్వలేదు ! కానీ ఇన్ని ఏళ్ళైనా ఆవిడా పాత మాట మర్చిపోయి నీకు టీవీ చూడటానికి పిలిచింది.ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో ! అహంకారం తగదు !" శ్యామ్ అప్పటికే ౯ సంవత్సరాల పిల్లడు.తన తప్పు కాస్త తెలుసుకున్నాడు.కానీ ఇంకా బుద్ధి మారలేదు.


౧౯౮౮ సంవత్సరం వచ్చింది. శ్యామ్ ఇప్పుడు ఆరవ తరగతి లో చదువుతున్నాడు.శ్యామ్ వాళ్ళు ఆంధ్ర వాళ్ళు అవటం వలన ఇంట్లో తెలుగు మాట్లాడే వారు .ఇంటి బయట ఒరియా భాషలో మాట్లాడాలి.మాట్లాడటం అయితే శ్యామ్ కి వచ్చేది . కానీ వ్రాయటం చదవటం వచ్చేది కాదు. ఇక ఆరవ తరగతి లో తృతీయ భాష గా ఒరియా తీసుకోవాలి .ఇంట్లో ఒరియా నేర్పేవారు ఎవరు లేరు.అప్పుడు పక్కింటి పట్నాయక్ ఆంటీ ఇంటికే మళ్ళీ వెళ్ళాడు. ఆవిడ సంతోషంగా శ్యామ్ కి ఒరియా వ్రాయటం చదవటం నేర్పారు. పది రోజులలో శ్యామ్ బాగా నేర్చుకున్నాడు. కానీ ఈ సరి ఎందుకో తనకి తన మీద అంట అహంకారం రాలేదు. ఎందుకంటే ఆంటీ మనసు ఏమి పెట్టుకోకుండా శ్యామ్ కి ఒరియా వ్రాయటం చదవటం నేర్పించారు. శామ్ కి పరీక్షలలో ఒరియా భాషలో మంచి అంకెలు వచ్చాయి. ఇప్పుడు నిజంగా శ్యామ్ మారాడు. తనలో అహంకారం దాదాపుగా పోయింది. ఎందుకంటే సమయం ఎప్పడు ఒక లగే ఉండదు కాబట్టి .


నీతి పలుకు : జీవితంలో పరిస్థితి ఎప్పుడు ఒకలాగ ఉండదు.అందుకే అహంకారం తో ఎవరితోటి తప్పుడు వ్యవహారం చెయ్యకూడదు.ఎందుకంటే కొన్ని పరిస్థితిలో వారి సహాయం అవసరం ఉంటుందేమో ! ఎవరి విలువ గొప్పతనం వారిది !


Rate this content
Log in