Raja Sekhar CH V

Drama

2  

Raja Sekhar CH V

Drama

అమాయక చిలిపి చప్పట్లు

అమాయక చిలిపి చప్పట్లు

2 mins
11.9K


చప్పట్లు ! ఎన్నో సందర్భాలలో ఇవి వాడబడును.జీవితంలో అందరం ఎదో ఒక సమయం లో చప్పట్లు కొట్టే ఉంటాం .అలాంటి ఒక హాస్య కథే ఇప్పుడు చదువుదాం.


ఒడిశా రాజధాని నగరం భువనేశ్వర్లో నువాపల్లి ప్రాంతంలో రాజేష్ తన తల్లి-తండ్రులతో ఉండేవాడు.ఒక వ్యక్తిగత విద్యాలయంలో మూడవ తరగతి చదివేను.౧౯౮౫ సంవత్సరం నాటి మాట ఇది.ప్రతిరోజూ విద్యాలయం వేదికపైన కొంతమంది విద్యార్థులు ప్రార్థన చేశెను.అనంతరం ప్రధాన అధ్యాపకులు ఉపన్యాసం ఇచ్చే వారు.అనంతరం విద్యార్థులు చప్పట్లు కొట్టేవారు.అలాగే తరగతిగదిలో కూడా ఎవరైనా ప్రసంగిస్తే, అంటారు చప్పట్లు కొట్టేవారు.ఇక రాజేష్ లగే మిగతా పిల్లలకి ఏమిటి అర్ధమైందంటే, ప్రసంగం తరువాత చప్పట్లు కొట్టాలని.


ఒక రోజు విద్యాలయంలో పని చేసే ఒక ౬౫ఏండ్ల వృద్ధ సేవకురాలు మాలతి మరణించెను.తన జ్ఞాపకంలో విద్యాలయం మధ్యాహ్నం మూడు గంటలు ఒక సంతాప సభ ఏర్పాటు చేశెను.ముందుగా ప్రధాన అధ్యాపకులు వేదిక పైన మాలతి గురుంచి చర్చించెను.చిన్న పిల్లలందరికీ ప్రసంగం తరువాత చప్పట్లు కొట్టడం అలవాటు. ఈ సరి కూడా ప్రధానాచార్యుల ప్రసంగం అనంతరం చిన్న పిల్లలందరూ చప్పట్లు కొట్టేసారు.ఇక అది చూసి మిగతా పిల్లలు కూడా చప్పట్లు కొట్టారు.ఇక ఈ సభ సంతాప సభ కాక హాస్య సభగా మరి పోయింది.ఎం చేస్తాం !! చిన్న పిల్లలకు ఏమి తెలుస్తుంది.ఎప్పుడు చప్పట్లు కొట్టాలో ఎప్పడు కొట్టకూడదని ఎలా తెలుస్తుంది !! అందువలన ఆ సంతాప సభ కాస్త హాస్య సభగా మారిపోయింది.


ఇక రాజేష్ అలా అలా ౧౦వ తరగతికి వచ్చాడు.ఇక ౧౫ సంవత్సరాల వయసు.అల్లరి వయసు. పెంకి పనులు కొంటె చేష్టలు.ఆ అబ్బాయి తో పాటి మరో ౧౦ మంది పెంకి పిల్లలుండేవారు.బాలల దినోత్సవం వచ్చింది.౧౯౯౩ సంవత్సరం నాటి మాట.ప్రధానాచార్యులు బాలల దినోత్సవం నాడు ప్రసంగం ఇచ్చారు.ప్రసంగం తరువాత పిల్లనదారు చప్పట్లు కొట్టారు.రాజేష్ కూడా చప్పట్లు కొట్టాడు.అంట నిశ్శబ్దం అయ్యే సరికి ఇంకో ౪ మంది పిల్లలు గోపినాథ్,సందీప్,అంశుమాన్ ఇంక దేవ్ చప్పట్లు కొట్టారు.వారు ఆపిన తరువాత ఇంకో నలుగురు చప్పట్లు కొట్టారు.వాళ్ళ తరువాత ఇంకో నలుగురు.ఇలా ఒక చప్పట్ల కార్యక్రమం అయ్యింది.పిల్లలు కాస్త పెద్దవాళ్ళు.ప్రధానాచార్యులు ఏమి అనలేదు.వాళ్ళ తోపాటు నవ్వారు.ఎందుకంటే తెలిసీతెలియని వయసు లో ఇదంతా సహజం.పిల్లలు విద్యాలయం లో పెంకితనం చెయ్యక , ఇంట్లో చెయ్యక ఇంకెక్కడా చేస్తారు.అధ్యాపకులు అందరు చెప్పటలు కొట్టి కొట్టి నవ్వుతూనే ఉన్నారు.

రాజేష్ పెద్దవాడయ్యాడు.తనకు ఇప్పుడు చదువుకునే పిల్లలు.వాళ్ళకి ఈ అనుభవం చెప్పి చెప్పి నవ్వు కుంటూ ఉంటాడు !!

ఇదండీ అమాయక చిలిపి చప్పట్ల కథ.


Rate this content
Log in

Similar telugu story from Drama