Raja Sekhar CH V

Drama

4  

Raja Sekhar CH V

Drama

ప్రణయం విజయం

ప్రణయం విజయం

2 mins
558జీవితం ఒక అందమైన వరం. అందులో ఎన్నో ఎన్నెన్నో భావాలూ ! అనుకునేవి అనుకోలేని అనుభవాలు ! ఇక యవ్వనం ఇంకో అందమైన నవవసంత సమయం.

ఈ తరుణ సమయంలోనే పుట్టెను ఒక అద్భుత అపూర్వమైన భావం ! ప్రేమ ! ప్రణయం !


౧౯౯౦ దశాబ్దం నటి మాట.ఒడిశా రాజ్యం రాజధాని నగరం భువనేశ్వర్లో ఒక ఉత్తరాంధ్ర బ్రాహ్మణ కుటుంబం ఉండేవారు. శ్రీ శంకర రావుగారు వారి సతీమణి ఉమా దేవి సమేతం ఇద్దరు అబ్బాయిలు శ్రీహరి ఇంకా శ్రీనివాస్ .భువనేశ్వర్లో చాలామంది తెలుగువారు ఉంటారు.శ్రీ శంకర రావుగారు విజయనగరం నుండి ౧౯౭౨ సంవత్సరంలో భువనేశ్వర్ కు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగం రీత్యా వచ్చారు. ఇలా సంవత్సరాలు గడిచాయి. చిన్న అబ్బాయి శ్రీనివాస్ +౨ విజ్ఞానంలో చదవటం ఆరంభించాడు ఒక కళాశాలలో. అది ౧౯౯౮ సంవత్సరం నటి మాట.అప్పటికి శ్రీనివాస్ కి ౧౭ ఏళ్ళు.ఒక అందమైన కౌమారం.


శ్రీనివాస్ తరగతిలో మంజుశ్రీ అనే ఒక ఒరియా అమ్మాయి కూడా చదివేను.ఇద్దరి మధ్యలో పరిచయం ఏర్పడింది.అప్పుడప్పుడు తరగతి లో మాట్లాడటమే లేక ఫలహారశాలలో మాట్లాడుకునేవారు.ఇలా కొన్ని నెలలు గడిచాయి.ఆ రోజులలో చరవాణులు ఉండేవి కావు.కేవలం దూరవాణి మాత్రమే ఉండేది.శ్రీనివాస్ నయాపల్లి లో ఉండేవాడు ఇంక సత్య నగర్ లో మంజుశ్రీ ఉండెను .మంజుశ్రీ తన ఇంట్లో పెద్ద అమ్మాయి.వారి నాన్నగారు శ్రీ బిప్రనారాయణ్ మహంతి ఒరిస్సా రాజ్య ప్రభుత్వంలో ఉద్యోగం చేసేవారు.ఇరువురవి సాంప్రదాయకమైన కుటుంబాలు.


అందుచేత కళాశాల వేళా తప్ప వేరే వేళలలో మాట్లాడుకునే పరిస్థితి లేదు.ఇక ఆరు నెలల తరువాత శ్రీనివాస్ కి తాను ప్రేమలో ఉన్నానని అనిపించింది.ఎందుకంటే మంజుశ్రీని చూడకుండా ఉండలేపోయాడు.అతి కష్టంగా సాహసం చేసి మంజుశ్రీకి తెలిపాడు మర్చి ౧౯౯౯ సంవత్సరంలో. మంజుశ్రీ అంగీకరించలేదు. ఎందుకంటే శ్రీనివాస్ వాళ్ళు శాకాహారులు.మంజుశ్రీ వారు మాంసాహారులు.శ్రీనివాస్ ఇంట్లో తెలుగు మాట్లాడతారు.మంజుశ్రీ ఇంట్లో ఒరియా మాట్లాడతారు.మంజుశ్రీ వారి వర్ణం వేరు.కానీ శ్రీనివాస్ ఇవన్నీ పట్టించుకోనన్నాడు.మరి ఇప్పుడు పరీక్షల సమయం.


ఈ లోపు మంజుశ్రీ వాళ్ళ తల్లి తండ్రులకు మంజుశ్రీ తన ప్రేమ విషయం చెప్పేసింది.ఇది విన్న ప్రతి తండ్రికి కోపం వస్తుంది.కానీ మంజుశ్రీ తండ్రి అలాగ కాదు.అతను చాలా సాంప్రదాయకమైన సరే, పిల్లల విషయంలో పిల్లల నిర్ణయాల ను గౌరవించేవారు. ఇక మంజుశ్రీ తో శ్రీనివాస్ అభిప్రాయం తెలుసుకుని శ్రీనివాసుని ఇంటికి పిలిచారు.


శ్రీనివాస్ కాస్త భయపడ్డాడు.కానీ మాట్లాడటానికి వెళ్ళాడు.తన ప్రేమ విషయం చెప్పాడు.

కానీ బిప్రనారాయణగారు +౨ పరీక్షల విషయం అడిగారు, ఎలా సంపాదిస్తారు అని అడిగారు, జీవనోపాధిమార్గం గురుంచి అడిగారు.ఎందుకంటే ఇంకా యంత్రవిద్య లో పట్టం సంపాదించి ఉద్యోగం సంపాదించాలి.ఇలా చేస్తేనే ధనం (డబ్బు) వస్తుంది జీవితం ముందుకు తీసుకెళ్లడానికి.శ్రీనివాస్ ఇంక మంజుశ్రీ కాస్త ఆలోచనలో పడ్డారు. 


శ్రీ బిప్రనారాయణ్ శ్రీనివాస్ ఇంక మంజుశ్రీ కి బాగా చదువుకుని , ఉద్యోగం సంపాదించుకుని తిరిగి రమ్మన్నారు.వారి ఇద్దరి ప్రేమలో ఏమి అభ్యంతరం, ఆపత్తి లేదన్నారు.ఇద్దరు మాట్లాడుకోవచ్చు అన్నారు కానీ ఏ విధమైన తప్పు జరగకూడదని మందలించారు.ఏ మర్యాద సీమ దాటకూడదన్నారు.నమ్మకాన్ని భంగపరచద్దన్నారు .మంజుశ్రీ అమ్మగారు కూడా అంగీకరించారు.ఇద్దరు సంపాదించినా అనంతరం శ్రీనివాస్ తల్లి తండ్రులతో మాట్లాడతాం అన్నారు.


శ్రీనివాస్ మరియు మంజుశ్రీ జాగ్రత్త గా +౨ విజ్ఞాన పరీక్షలు ఉత్తీర్ణులై , జాతీయ సాంకేతిక సంస్థ తిరుచిరాపల్లి లో ఖనిజరసాయనశాస్త్రములో పట్టం సంపాదించారు. ౨౦౦౫ సంవత్సరం కల్లా ఇద్దరు ఒక ప్రభుత్వేతర సంస్థలో ఉద్యోగం సంపాదించారు.

వారి ఇద్దరి మధ్య ప్రేమలో ఏమాత్రం మార్పు రాలేదు.ఇద్దఋ చాలా అన్యోన్యంగా ఉన్నారు. ఇక శ్రీ బిప్రనారాయణ్ గారు శ్రీ శంకర రావుగారికి నచ్చచెప్పి పిల్లల ప్రేమని అంగీకరించమని చెప్పారు.శ్రీ శంకరరావుగారు కొన్ని వారాలు అలోచించి శ్రీనివాస్ మంజుశ్రీల ప్రేమను అంగీకరించారు.ఇలా శ్రీనివాస్ ఇంక మంజుశ్రీ తన ప్రణయంలో విజయం సంపాదించారు.


నీతి బోధన : యవ్వనంలో ప్రేమ చాలా అందమైన సమయం.కానీ జీవితం లో తన కాళ్ళ మీద నిలబడటం కూడా అంతే అవసరం.చదువు, సంపాదన చాలా అవసరం.తల్లి తండ్రుల సహాయం ధైర్యం కూడా అవసరం.పిల్లలను తప్పు చెయ్యకుండా చూడటం ఏంటో అవసరం.


Rate this content
Log in

Similar telugu story from Drama