STORYMIRROR

Dinakar Reddy

Abstract Drama

4  

Dinakar Reddy

Abstract Drama

బ్రేకప్ అయ్యిందా..

బ్రేకప్ అయ్యిందా..

1 min
366

ఎవరికైనా లవ్ బ్రేకప్ అయ్యిందంటే మధుర్ కి ఎక్కడ లేని ఆసక్తి వచ్చేస్తుంది. అసలు బ్రేకప్ ఎందుకు అయ్యింది అనే విషయం దగ్గర నుంచీ, బ్రేకప్ తరువాత ఏం జరిగింది ఇలా అన్ని విషయాలూ వింటాడు.


ఊరికే కాదులెండి. Breakup healer అంటూ తనను తాను సాంత్వన చేకూర్చే వ్యక్తిగా పరిచయం చేసుకుంటాడు.


లవ్ బర్డ్స్ బ్రేకప్ అయ్యాక విలవిలలాడుతూ గడపడానికి ప్రత్యేక నివాసాలు ఏర్పాటు చేశాడు. వారు ఒంటరిగా ఉండాలి అనుకుంటే అందుకు తగ్గ అన్ని ఏర్పాట్లూ చేస్తారు.


ఇప్పుడు ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ కోసం తయారుగా ఉన్నాడు.


ఇంటర్వ్యూ చేసే అమ్మాయి ఇక మొదలు పెడదాం అన్నట్టు సైగ చేసింది.


అసలు బ్రేకప్ అయిన వెంటనే మీరు కాల్ చేయాల్సిన నంబర్లు ఇవే.. అంటూ కెమెరా వైపు తిరిగి చెప్పడం మొదలు పెట్టాడు మధుర్.


సార్. కొంచెం ఆగండి. ప్రశ్నలు నేను అడిగాక మీరు సమాధానం చెప్పాలి అందామె.


సరే అంటూ జుత్తు సరిచేసుకున్నాడు మధుర్.


మధుర్ గారూ! మీకు తెలిసినవి, విన్నవి బ్రేకప్ కారణాలు చెప్పండి అని అడిగింది ఆ అమ్మాయి.


చాలా ఉన్నాయి. రెస్టారెంట్ కి ఆలస్యంగా వచ్చారని, ఇంటికి వెళ్ళేటప్పుడు బై చెప్పడానికి రాలేదు అని, Instagram లో వాళ్ళ వీడియోను వెంటనే షేర్ చెయ్యలేదు అని, వాళ్ళకి నచ్చినట్టు బట్టలు వేసుకోలేదు అని..


సార్.. ఒక్క నిమిషం.. ఒక్కో కారణానికి ఒక్కో కథ ఉంది అంటారా.. అని అడిగింది.


లేదు. ప్రతి కథకూ బోలెడు కారణాలు ఉన్నాయి అని అతను ఇంకా ఎన్నో కారణాలు చెబుతూ ఉన్నాడు.


రచనకు రేటింగ్ ఇవ్వండి
లాగిన్

Similar telugu story from Abstract