బోనస్ డబ్బులు
బోనస్ డబ్బులు


రెండు నెలల జీతం బోనస్ ఇచ్చారు పండక్కి.
సరిగ్గా అకౌంట్లో డబ్బులు పడేటప్పటికి నేను ఇంట్లోనే ఉన్నాను.లక్షలేమీ సంపాదించలేదు.కానీ ఏదో ఆనందం.
నాన్నా రేపు షాపింగ్ వెళ్దాం అన్నాను.ఎప్పుడూ పండక్కి నాన్నతో వెళ్లి బట్టలు కొనుక్కునే నేను ఆ రోజు
మొట్టమొదటిసారి నాన్నను షాపింగ్ తీసుకెళ్ళాను.ఇద్దరికీ బట్టలు కొనుక్కున్నాం.
అమ్మకు కొత్త చీర కొనుక్కోమని డబ్బులు పక్కన పెట్టాను.
ఒకే రంగు చొక్కా ప్యాంటు ఇద్దరం తీసుకోవడం చూసి అమ్మ మీ నాన్న వయసు తగ్గిపోయిందని చెప్పి పడీ పడీ నవ్వింది.
ఏం అన్నా తమ్ముడు అయితేనే ఒకే రంగు కొంటారా అని నేను మా నాన్నను వెనకేసుకొచ్చాను.
ఎందుకో అది నా జీవితంలో సాధించిన గొప్ప విజయంలా అనిపిస్తుంది.