బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

5.0  

బ్రోకెన్ ఏంజెల్ కీర్తి

Drama

బంధనం

బంధనం

3 mins
544


అసలు ఎంటో యి జీవితం.... చీ..ఎదవ జీవితం..బ్రతకడం ఎందుకు నేను....ఎవరి కోసం బ్రతకాలి ఏందుకోసం బ్రతకాలి..అని అంట్లు రుద్దడం కంటే అవి పడేస్తున్నట్లు విసిరి కొడుతున్నట్లు అనిపిస్తుంది శాంభవి నీ చూస్తూ వుంటే....అసలు ఈ ఆడవాళ్ళు కోపం వస్తే దాన్ని ఇలా అంట్లు రుద్దె అప్పుడు బట్టలు వుతెకేటప్పుడు చూపిస్తారు ఎందుకో అని మనసులో అనుకుంటూ పేపర్ చదవడం అపేసి గదిలోకి వెళ్ళి పడుకున్నాడు రంగనాదు..

.


😔😔😔😔😔😔😔😔😔


ఛీ.....ఎంత మారిపోయాడు...చిన్న నాటి నుంచి కడుపులో పెట్టుక చూసుకుంటే పెళ్ళాం రాగానే కొంగు పట్టుకొని తిరుగుతున్నాడు....అందరూ వాడి లానే వున్నారా....అని నసుగుతూ బి.పి గోళీలు వేసుకుంటూ అంటుంది... శాంభవి...


ఇక ఇలా అయుతే కుదిరెల లేదు అని...శాంభవి....నీకు మన పెళ్లి అయిన కొత్త రోజులు గుర్తున్నాయా...


దొంగ లు పడ్డ ఆరు నెలల కి...

కుక్కలు మోరిగాయి అంట....🐶🐶🐶అల వుంది మి యవ్వారం..జీవితం అంతా గడిచింది ...యిప్పుడు ఎం చేసుకోను...గుర్తుచేసుకుని...వున్నని రోజులు మీ అమ్మగారు వేయించు కా తిన్నారు....యిప్పుడు మీ కొడుకు కోడలు...అని మొహం తింపుకుందీ...


శంభు....అని ముద్దుగా పిలుస్తూ తన చేతుల్ని పట్టుకొని...నికు గుర్తు వుందా...పెళ్లి అయ్యాక మొదటి దీపావళి నాడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించలేదు అని పండగ అయ్యే అన్ని రోజులు ఏడుస్తూనే వున్నావు...గుర్తు వుందా...


హ్మ్మ్...అయితే...ఇప్పుడు ఎంటి...


ఒక సారి నువ్వు నీ కోడలి స్థానం లో వుండి చూడు....అప్పుడు నువ్వు బాధ పడినట్లే యిప్పుడు నీ కోడలు కూడా బాధ పడుతుంది కదా...


కాస్త ఆలోచన లో పడింది శాంభవి....


అప్పుడు మా అమ్మ కి ఎదురు చెప్పలేక నిన్ను ఎటు తీసుకెళ్ళిన అవకాశం లేదు....పెళ్లి ...పిల్లలు...వాళ్ళ బాగోగులు చూసుకుంటూ జీవితం గడిచిపోయింది...వెనక్కి తిరిగి చూసుకుంటే సంతోషం గా గడిపిన సమయం అసలు ఎం లేదు....అది నా తప్పే...కాదు అని అనను...అమ్మ కి ఎదురు చెప్పలేక నిన్ను బాధ పెట్టను....యిప్పుడు నా కొడుకు కూడా అదే పరిస్థితిలో వున్నాడు....మన లాగే మన అబ్బాయి జీవితం కూడా అసంపూర్ణం గా మిగిలి పోవల....చెప్పు.... అటు బార్య ను బాధ పెట్టలేక యిటు నిన్ను ఒప్పించలేక మధ్యలో నీ కొడుకు ఎంత నలిగి పోతూ వున్నది అర్థం చేసుకో....మనం కాక పోతే పక్కింటి వాళ్ళు అర్ధం చేసుకుంటరా నువ్వే చెప్పు....నువ్వు ఇలా ప్రవర్తిస్తే నీ కోడలు కూడా నీ లానే నువ్వు మీ అత్తమ్మ నీ తిట్టుకున్నట్లు తిట్టుకొడం కాయం....నీ కూతురి నీ నువ్వు పండగ రోజు చూడాలని ఆశ పడటం తప్పు కాదు కానీ నీ కోడలు వల్ల అమ్మ నీ కలవడానికి వెళితే మాత్రం తప్పా...పక్కింటి మనమ్మ పరిస్థితి చూడు...పెత్తనం చెలాయిస్తూ అజమాయిషీ చేస్తూ వుంటే నే కోడలు బాగుంటుంది లేదంటే చులకన అయిపోతుంది అని కోడలి నీ ఎన్ని కష్టాలు పెట్టింది...చివరికి ఆ పిల్ల ఆత్మహత్య చేసుకుంది....యిప్పుడు అందరు తిడుతున్నారు గా...చివరికి నువ్వు కూడా ...నువ్వు అల చేస్తున్నావు అని నేను అనడం లేదు...కానీ కోడలు ఉత్తమురాలు కావాలంటే అది అత్త మీదే ఆధారపడి ఉంది.....ఎదురు ఇంటి మంగమ్మ గారిని వాళ్ళ కొడుకు కోడలు ఓల్టేజ్ హోం లో వదిలి వచ్చారు...ఎందుకు అని అంటే...చాదస్తం పెరిగి పోయింది అని అన్నారు...


కానీ మన పక్క విధి శంకరమ్మ నీ చూడు...కోడలిని ఎంత బాగా చూసుకుంటుంది....అత్త నీ చూసి కోడలు కూడా ప్రేమ గా వుండడం నేర్చుకుంది....రేపు తనకు వచ్చే కోడలితో అల నే వుంటుంది అప్పుడు వాళ్ళ జీవితం లో ఎం ఇబ్బంది వుండదు కదా....


ఎప్పుడు చస్తమూ తెలియదు ...మహా అంటే ఇంకో అయిదు ఆరు సంవత్స రాలు...ఎందుకు నా మాటే నెగ్గలనీ పంతం చెప్పు.


ఎన్ని చెప్పినా అత్త అత్తే ....కోడలు కోడలే గా....

అందుకే గా పాట కూడా వచ్చింది...


కోడలా కోడలా కొడుకు పెళ్ళామా...ఓ యమ్మ...

పచ్చి పాల మీద మీగడ ఎదమ్మ...

వేడి పాల మీద వెన్న లేదమ్మా...అని...


అని నిట్టూర్పు విడుస్తూ చెప్తాడు.... హ్మ్.......

...తరువాత నీ యిష్టం...


ఇద్దరి మధ్య ఒక నిమిషం నిశబ్దం....తాండవం అడింది...


రంగ మన కోడలికి ఫోన్ చేయి మాట్లాడలి...తొందర ఎం లేదు తీరిగ్గా రమ్మని చెప్పాలి...


శాంభవి లో వచ్చిన మార్పు కు సంతోషించిన రంగ ఆనందం గా ఫోన్ చేస్తాడు....


..... ..... .....


కోడలు అత్త కాక తప్పదు....కోడలు గా వున్నప్పటి రోజులు గుర్తు వుంచుకుని వచ్చిన కోడలిని సంతోషం గా చూసుకుంటే ఆనందం విల్లివిరుస్తుంది...


నేడు అత్త గారిని తన్ని తరిమేసి...మన పిల్లలకు మీరు కూడా ఇలా వుండాలి అని నేర్పించిన అట్లే గా...ఆలోచించండి...

బంధాలను పదిల పరచుకొని వుంటే బాంధవ్యాలు వెళ్లి విరుస్తయి...

అవే బందాలు బంధనాలు అయితే జీవితాలను అల్లకల్లోలం చేస్తాయు....

ధన్యవాదాలు.........ఓపిక తో చదివి నందుకు ...మీ అభిప్రాయం సమీక్ష ద్వారా తెలుపగలరు అని ఆశిస్తున్నాను...
Rate this content
Log in

Similar telugu story from Drama